Samantha : ఎప్పుడూ వెన్నంటే ఉంటావ్.. తండ్రిపై సమంత ఎమోషనల్ కామెంట్స్..

టాలీవుడ్ హీరోయిన్ సమంత ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆమె తండ్రి జోసెఫ్ ప్రభు నిన్న రాత్రి కార్డియాక్ అరెస్ట్ తో నిద్రలోనే కన్నుమూశారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ తన్ ఇన్ స్టా స్టోరీలో హార్ట్ బ్రేక్ ఎమోజీని షేర్ చేసింది సామ్.

Samantha : ఎప్పుడూ వెన్నంటే ఉంటావ్.. తండ్రిపై సమంత ఎమోషనల్ కామెంట్స్..
Samantha Fam
Follow us
Rajitha Chanti

|

Updated on: Nov 29, 2024 | 5:16 PM

సమంత ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆమె త్రండి జోసెఫ్ ప్రభు కన్నుమూసినట్టుగా తెలుస్తోంది. ఇక సమంత కూడా తన ఇన్‌స్టా వేదికగా ఇదే విషయాన్ని తెలిసయజేసింది. బ్రోకెన్ హార్ట్ ఎమోజీతో.. అంటిల్ విల్ మీట్ ఎగైన్ డాడ్ అంటూ… స్టేటస్‌ను పోస్ట్ చేసింది. ఇక మీడియాకు ఎప్పుడూ దూరంగా ఉండే సమంత ఫాదర్ జోసెఫ్‌… సమంత విడాలకులు తీసుకున్న టైంలో మాత్రం మీడియాతో మాట్లాడారు. కాస్త ఎమోషనల్ కామెంట్స్ చేశారు. ఇక జోసెఫ్ ప్రభును తన కూతురిని అమితంగా ప్రేమిస్తుంటారు. ఆమె కోరుకున్న రంగంలో రాణించేందుకు చాలా సపోర్ట్ చేశారు. ఇదే విషయాన్ని గతంలో సమంత చాలా ఇంటర్వ్యూలో చెప్పారు.

టాలీవుడ్ హీరోయిన్ సమంత తండ్రి జోసెఫ్ ప్రభు కన్నుమూశారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ సామ్ తన ఇన్ స్టా లో స్టేటస్ పెట్టారు. హార్ట్ బ్రోకెన్ ఇమేజ్ ను షేర్ చేశారు. అంటిల్ వీ మీట్ ఎగైన్ డాడ్.. అంటే మళ్లీ మనం కలిసే వరకు నాన్న అంటూ ఆ పోస్టుకు క్యాప్షన్ పెట్టారు. సమంత చెన్నైలో జోసెఫ్ ప్రభు, నీనెట్ ప్రభు దంపతులకు జన్మించింది. ఆమె తండ్రి, తెలుగు ఆంగ్లో-ఇండియన్. తన జీవితంలో తన తండ్రి ముఖ్య పాత్ర పోషించారని చాలా సందర్భాల్లో చెప్పారు. సినిమాలతో బిజీగా ఉన్నా.. తల్లిదండ్రులను మాత్రం ఎప్పటికప్పుడు కలిసేది. తాను కెరీర్ లో ఈ స్థాయికి ఎదిగానంటే.. దానికి కారణం తన తండ్రే అని అన్నారు. సమంత తండ్రి మరణవార్త తెలిసి.. సమంత అభిమానులు షాకయ్యారు. సమంత తండ్రికి నివాళులర్పిస్తూ.. సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. మీ కుటుంబానికి ప్రగాడ సానుభూతి అంటూ వాటిని షేర్ చేస్తున్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నారు. ఈ విషయం తెలిసి.. సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.

“నా మొదటి సినిమా ఏ మాయ చేసావే పెద్ద హిట్ అయ్యి, జనాలు నన్ను మెచ్చుకుంటున్నప్పుడు, ఆ విజయాన్ని ఎలా తీసుకోవాలో నాకు తెలియదు. ఆ విజయంలో నా మనసులో రెండు విషయాలు ఉన్నాయి. ఒకటి మీరు అండర్ అచీవర్, లేదా మీరు ఈ విజయం, ప్రశంసలన్నింటికీ అర్హులు కాదు అని అన్నారు. ఆ రెండో మాటనే మనసులో పెట్టుకున్నాను. కెరీర్ మొదట్లో నా లుక్స్, యాక్టింగ్ విషయంలో నాపై నాకే అనుమానం కలిగింది. నేను ఈ ప్రశంసలకు అర్హురాలిని అని నన్ను నేను నేను ఒప్పించుకోవడానికి 10-12 సంవత్సరాలు పట్టింది. ఆ సమయంలో మా నాన్న జోసెఫ్ ప్రభు మాటలు నన్ను మరింత బలంగా మార్చాయి. ఇండస్ట్రీలో, నా జీవితంలో ఎదుర్కొన్న పోరాటాలకు మా నాన్న అండగా ఉన్నారు ” అంటూ గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.

ఇది చదవండి : Tollywood: ఒక్క సినిమాకు రూ.40 కోట్లు రెమ్యునరేషన్.. ప్రైవేట్ జెట్, ఇండియా, అమెరికాలో కోట్ల ఆస్తులు ఉన్న ఏకైక హీరోయిన్..

Vijay Sethupathi: విజయ్ సేతుపతి ఇన్ స్టాలో ఫాలో అవుతున్న ఏకైక హీరోయిన్.. ఎవరో తెలుసా..?

Tollywood : గ్యాంగ్‌స్టర్‌తో ప్రేమలో పడి కెరీర్ నాశనం చేసుకున్న హీరోయిన్.. ఇండస్ట్రీకి దూరం..

Actress Gajala: వాసి వాడి తస్సాదియ్యా.. అందాలతో హార్ట్ ఎటాక్ తెప్పిస్తోన్న ఎన్టీఆర్ హీరోయిన్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

90 లక్షల ఇళ్లు ఖాళీ ఏమయ్యారు.? ఎటు పోయారు.? అసలేం జరిగింది.!
90 లక్షల ఇళ్లు ఖాళీ ఏమయ్యారు.? ఎటు పోయారు.? అసలేం జరిగింది.!
ఏపీలో కొత్త రేషన్ కార్డ్ కావాలా.? దరఖాస్తుల స్వీకరణ మొదలు..
ఏపీలో కొత్త రేషన్ కార్డ్ కావాలా.? దరఖాస్తుల స్వీకరణ మొదలు..
మా ఊరికి పులి వచ్చింది.. మీ ఊరుకొచ్చిందా.? అదే పులి పలు చోట్ల..
మా ఊరికి పులి వచ్చింది.. మీ ఊరుకొచ్చిందా.? అదే పులి పలు చోట్ల..
ప్రాణం కాపాడిన వ్యక్తికి కృతజ్ఞతలు చెప్పిన కోతుల గుంపు.! వీడియో..
ప్రాణం కాపాడిన వ్యక్తికి కృతజ్ఞతలు చెప్పిన కోతుల గుంపు.! వీడియో..
గోదావరి నదిలో మొసలి కలకలం.! అదిరిపడ్డ పశువుల కాపరి..
గోదావరి నదిలో మొసలి కలకలం.! అదిరిపడ్డ పశువుల కాపరి..
ఇలా చేస్తే మీ తెల్లజుట్టు నల్లగా మారడం ఖాయం.! సహజ పద్ధతులు..
ఇలా చేస్తే మీ తెల్లజుట్టు నల్లగా మారడం ఖాయం.! సహజ పద్ధతులు..
చలికాలంలో ఆవనూనెతో అనేక లాభాలు.! ఇంతకన్నా క్రీమ్స్ అవసరమే లేదు..
చలికాలంలో ఆవనూనెతో అనేక లాభాలు.! ఇంతకన్నా క్రీమ్స్ అవసరమే లేదు..
స్నానానికి వెళ్లి బాత్రూమ్‌లో నవవధువు మృతి.. ఏం జరిగిందంటే.!
స్నానానికి వెళ్లి బాత్రూమ్‌లో నవవధువు మృతి.. ఏం జరిగిందంటే.!
పిల్లలకు చాయ్‌ తాగిస్తున్నారా ?? ఈ వీడియో చూడండి
పిల్లలకు చాయ్‌ తాగిస్తున్నారా ?? ఈ వీడియో చూడండి
ఒకే చోట గంటల కొద్దీ కూర్చునేవారికి.. షాకింగ్‌ న్యూస్‌
ఒకే చోట గంటల కొద్దీ కూర్చునేవారికి.. షాకింగ్‌ న్యూస్‌