Kushi Movie: విజయ్ దేవరకొండ, సమంతల ‘ఖుషి’ సినిమా షూటింగ్ పూర్తి.. ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధం..

మ్యూజిక్ డైరెక్టర్ హిషామ్ అబ్దుల్ వాహబ్ అందించిన రెండు పాటలు సోషల్ మీడియాలో శ్రోతలను అలరిస్తున్నాయి. ప్రేమికులంతా కూడా పాడుకునేలా రొమాంటిక్, మెలోడీ సాంగ్స్ ఉన్నాయి. ప్రస్తుతం నా రోజా నువ్వే, ఆరాధ్య సాంగ్స్ యూట్యూబ్ లో ట్రెండ్ అవుతున్నాయి. ముఖ్యంగా ఆరాధ్య పాటలో విజయ్, సమంత మధ్య కెమిస్ట్రీ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.

Kushi Movie: విజయ్ దేవరకొండ, సమంతల ‘ఖుషి’ సినిమా షూటింగ్ పూర్తి.. ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధం..
Kushi
Follow us
Rajitha Chanti

|

Updated on: Jul 15, 2023 | 9:28 PM

విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటిస్తోన్న చిత్రం ఖుషి. పాన్ ఇండియా మూవీగా రాబోతోన్న ఈ సినిమాను దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా మీద ఇప్పటికే మంచి అంచనాలు ఏర్పడ్డాయి. సెప్టెంబర్ 1న రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. మరోవైపు షూటింగ్‌ను చకచకా చేస్తూ వచ్చిన చిత్రయూనిట్ ఇప్పుడు ఓ అప్డేట్ ఇచ్చింది. ఖుషి సినిమాకు సంబంధించిన షూటింగ్ పూర్తయిందని మేకర్లు అప్డేట్ ఇచ్చారు. అలాగే పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా షూటింగ్‌కు సమాంతరంగా జరుపుతూ వచ్చామని తెలిపారు టీం సభ్యులు. ఇక ఇప్పటికే ఈ సినిమా 70శాతం పనులు పూర్తయ్యాయని తెలుస్తోంది.

ఇదిలా ఉంటే.. మ్యూజిక్ డైరెక్టర్ హిషామ్ అబ్దుల్ వాహబ్ అందించిన రెండు పాటలు సోషల్ మీడియాలో శ్రోతలను అలరిస్తున్నాయి. ప్రేమికులంతా కూడా పాడుకునేలా రొమాంటిక్, మెలోడీ సాంగ్స్ ఉన్నాయి. ప్రస్తుతం నా రోజా నువ్వే, ఆరాధ్య సాంగ్స్ యూట్యూబ్ లో ట్రెండ్ అవుతున్నాయి. ముఖ్యంగా ఆరాధ్య పాటలో విజయ్, సమంత మధ్య కెమిస్ట్రీ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.

సెప్టెంబర్ 1న ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళ్, మళయాల, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయబోతోన్నారు. ఈ సినిమాలో జయరాం, సచిన్ ఖేడేకర్, మురళీ శర్మ, అలీ కీలకపాత్రలు పోషిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.