సమంతలో ఈ యాంగిల్ కూడా ఉందా?
ఇప్పటికే హీరోయిన్‌గా తనకంటూ ఓ మంచి పేరును తెచ్చుకుంది టాలీవుడ్ నటి సమంత. ఇటు సినిమాల్లోనే కాకుండా అటు.. వెబ్ సిరీస్‌లలోనూ, సోషల్ మీడియాలోనూ బిజీగా ఉంటూ అభిమానులకి ఎప్పుడూ టచ్‌లో ఉంటూ వస్తోంది. ఇక అక్కినేని వారింటి కోడలయ్యాక సామ్ మరిన్ని ప్రయోగాలు చేసేందుకు, తనలోని ఇన్నర్ టాలెంట్‌ను వెలికి తీసేందుకు చాలానే కష్టపడుతోందనే చెప్పాలి. రీసెంట్‌గా ఈ బ్యూటీ ప్రొడ్యూసర్‌గా మారేందుకు ప్రయత్నాలు చేస్తోందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ప్రొడక్షన్ గురించి ఏ టూ […]
ఇప్పటికే హీరోయిన్‌గా తనకంటూ ఓ మంచి పేరును తెచ్చుకుంది టాలీవుడ్ నటి సమంత. ఇటు సినిమాల్లోనే కాకుండా అటు.. వెబ్ సిరీస్‌లలోనూ, సోషల్ మీడియాలోనూ బిజీగా ఉంటూ అభిమానులకి ఎప్పుడూ టచ్‌లో ఉంటూ వస్తోంది. ఇక అక్కినేని వారింటి కోడలయ్యాక సామ్ మరిన్ని ప్రయోగాలు చేసేందుకు, తనలోని ఇన్నర్ టాలెంట్‌ను వెలికి తీసేందుకు చాలానే కష్టపడుతోందనే చెప్పాలి. రీసెంట్‌గా ఈ బ్యూటీ ప్రొడ్యూసర్‌గా మారేందుకు ప్రయత్నాలు చేస్తోందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ప్రొడక్షన్ గురించి ఏ టూ జెడ్ అన్నీ తెలుసుకోవడానికి తెగ చెమటోడుస్తుందట సామ్. మంచి కథ దొరికితే ఎంతైనా సరే.. ఖర్చు చేసి ప్రొడ్యూసర్‌గా మారేందుకు రెడీగా ఉందట. ఇప్పటికే రాహుల్ రవింద్రన్ దర్శకత్వంలో వచ్చిన ‘చి.ల.సౌ’ మూవీని దగ్గరుండి మరీ.. అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి ప్రొడ్యూస్ చేయించింది సమంత. ఆ మూవీకి కూడా పాజిటివ్ టాక్ రావడంతో కథల ఎంపికలో సామ్ చాలా తెలివిగా ఉంటుందని ఇప్పటికే రుజువైంది. మరి సొంత ప్రొడక్షన్ హౌజ్‌ని స్టార్ట్ చేస్తే.. ఎలాంటి కథలని ఓకే చేస్తుందో అనేది లెట్స్ వెయిట్ అండ్ సీ.