రేప్‌లు జరిగేందుకు మహిళలే కారణం: సీనియర్ దర్శకుడి వివాదాస్పద వ్యాఖ్యలు
మహిళలపై వేధింపులకు, అత్యాచారాలు జరిగేందుకు వారే కారణమని సీనియర్ దర్శకుడు, నటుడు కె.భాగ్యరాజా వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ‘కరుత్తుగలై పుది ఉసెయ్’ సినిమా ట్రైలర్ సందర్బంగా భాగ్యరాజా మహిళలపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. వివాహేతర సంబంధం కోసం ఈ కాలంలో మహిళలు భర్తల్ని, పిల్లల్ని చంపేస్తున్నారని ఆయన అన్నాడు. సెల్‌ఫోన్ల కారణంగా మహిళలు చెడిపోతున్నారని.. కట్టుబాట్లను వదిలేస్తున్నారని భాగ్యరాజా కామెంట్లు చేశాడు. ‘‘ఇప్పుడు మహిళలు ఎప్పుడూ ఫోన్‌లలోనే ఉంటున్నారు. రెండేసి ఫోన్ సిమ్‌లు వాడుతున్నారు. వారిపై వేధింపులు, […]
మహిళలపై వేధింపులకు, అత్యాచారాలు జరిగేందుకు వారే కారణమని సీనియర్ దర్శకుడు, నటుడు కె.భాగ్యరాజా వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ‘కరుత్తుగలై పుది ఉసెయ్’ సినిమా ట్రైలర్ సందర్బంగా భాగ్యరాజా మహిళలపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. వివాహేతర సంబంధం కోసం ఈ కాలంలో మహిళలు భర్తల్ని, పిల్లల్ని చంపేస్తున్నారని ఆయన అన్నాడు. సెల్‌ఫోన్ల కారణంగా మహిళలు చెడిపోతున్నారని.. కట్టుబాట్లను వదిలేస్తున్నారని భాగ్యరాజా కామెంట్లు చేశాడు. ‘‘ఇప్పుడు మహిళలు ఎప్పుడూ ఫోన్‌లలోనే ఉంటున్నారు. రెండేసి ఫోన్ సిమ్‌లు వాడుతున్నారు. వారిపై వేధింపులు, అత్యాచారాలు జరగడానికి ఇదొక కారణం’’ అని భాగ్యరాజా అన్నాడు.
అంతటితో ఆగకుండా తమిళనాట తీవ్ర సంచలనం రేపిన పొల్లాచ్చి ఘటనపై కూడా ఆయన ఇలాంటి కామెంట్లే చేశాడు. ‘‘పొల్లాచ్చి ఘటనలో మగవాళ్లది ఎలాంటి తప్పులేదు. అక్కడ అమ్మాయి అవకాశం ఇచ్చింది కాబట్టే రేప్ జరిగింది’’ అని భాగ్యరాజా చెప్పుకొచ్చాడు. తాను ఉమ్మడి కుటుంబం నుంచి వచ్చినందు వల్ల తన సినిమాల్లో మహిళలకు అధిక ప్రాధాన్యత ఇచ్చానని ఆయన అన్నాడు. అయితే ఈ వ్యాఖ్యలు ఇప్పుడు తమిళనాట దుమారం రేపుతున్నాయి. భాగ్యరాజా వ్యాఖ్యలపై మహిళా సంఘాలు మండిపడుతున్నాయి. మహిళలపై పురుషులు అత్యాచారాలు చేస్తే వారి తప్పేమీ లేదంటారా..? అంటూ పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చూస్తుంటే ఈ వివాదం పెద్దది అయ్యేలా ఉండగా.. దీనిపై ఆయన ఎలా స్పందిస్తారో చూడాలి.