AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tiger 3: సైలెంట్‏గా ఓటీటీలోకి వచ్చేసిన ‘టైగర్ 3’.. సల్మాన్ మూవీ ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందంటే..

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ జంటగా నటించిన ఈ సినిమా ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. యష్ రాజ్ స్పై యూనివర్స్ లో భాగంగా తెరకెక్కించిన ఈ సినిమా దీపావళి కానుకగా నవంబర్ 12న విడుదల చేశారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా అనుకున్న రేంజ్ లో హిట్ కాలేకపోయిన పాజిటివ్ రివ్యూస్ అందుకుంది.

Tiger 3: సైలెంట్‏గా ఓటీటీలోకి వచ్చేసిన 'టైగర్ 3'.. సల్మాన్ మూవీ ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందంటే..
Tiger 3 OTT
Rajitha Chanti
|

Updated on: Jan 07, 2024 | 9:29 AM

Share

ప్రస్తుతం ఓటీటీల్లో సూపర్ హిట్ చిత్రాలు సందడి చేస్తున్నాయి. బ్యాక్ టూ బ్యాక్ భారీ బడ్జెట్ బ్లాక్ బస్టర్ మూవీస్ డిజిటల్ ప్లాట్ ఫాంపై స్ట్రీమింగ్ అవుతున్నాయి. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లోని అనేక సినిమాలు ఓటీటీ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నాయి. ఇక ఇప్పుడు మరో స్టార్ హీరో సినిమా సైతం ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చేసింది. అదే టైగర్ 3. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ జంటగా నటించిన ఈ సినిమా ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. యష్ రాజ్ స్పై యూనివర్స్ లో భాగంగా తెరకెక్కించిన ఈ సినిమా దీపావళి కానుకగా నవంబర్ 12న విడుదల చేశారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా అనుకున్న రేంజ్ లో హిట్ కాలేకపోయిన పాజిటివ్ రివ్యూస్ అందుకుంది. ఇప్పుడు ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది.

నిజానికి ఈ సినిమా డిసెంబర్ లోనే ఓటీటీలోకి వచ్చేయాల్సింది. కానీ అలా జరగలేదు. జనవరి 7న ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతుందని ప్రకటించారు. కానీ ఆ తర్వాత మాత్రం టైగర్ 3 ఓటీటీ స్ట్రీమింగ్ పై సస్పెన్స్ నెలకొంది. కొద్దిరోజులుగా ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ పై కన్ఫ్యూజన్ నెలకొంది. అదే సమయంలో గత అర్దరాత్రి నుంచి ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులోకి వచ్చేసింది.ఈ సినిమా తెలుగు వెర్షన్ కూడా స్ట్రీమింగ్ అవుతుంది. థియేటర్లలో ఈ సినిమాను మిస్ అయినవారు ఇప్పుడు నేరుగా ఇంట్లోనే చూసేయ్యోచ్చు.

మనీష్ శర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మించింది. యష్ రాజ్ నిర్మించిన స్పై యూనివర్స్ లో ఈ సినిమా ఐదవ భాగం. గతంలో విడుదలైన నాలుగు చిత్రాలు ది టైగర్, టైగర్ జిందా, వార్, పఠాన్ చిత్రాలు బ్లాక్ బస్టర్ హిట్స్ అయ్యాయి. కానీ టైగర్ 3 మిశ్రమ ఫలితాలను అందుకుంది. నివేదికల ప్రకారం ఈ సినిమాను రూ.300 కోట్లను నిర్మించగా.. భారతదేశంలో రూ.339.5 కోట్లు.. విదేశాల్లో రూ.124.5 కోట్లు రాబట్టింది. మొత్తంగా ప్రవంచవ్యాప్తంగా రూ.464 కోట్లు వసూలు చేసింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.