Salar Shooting: ప్రభాస్ సినిమాలకు ఏమైంది..? ఒకే రోజు రెండు చిత్రాలకు సంబంధించి ప్రమాదాలు..
Salar Unit Met With An Accident: ప్రభాస్ హీరోగా తెరకెక్కుతోన్న రెండు చిత్రాలకు సంబంధించి ఒకే రోజు ప్రమాదాలు జరగడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ప్రభాస్ హీరోగా బాలీవుడ్ దర్శకుడు...

Salar Unit Met With An Accident: ప్రభాస్ హీరోగా తెరకెక్కుతోన్న రెండు చిత్రాలకు సంబంధించి ఒకే రోజు ప్రమాదాలు జరగడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ప్రభాస్ హీరోగా బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘ఆదిపురుష్’ సినిమా సెట్‌లో మంగళవారం భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ముంబైలోని గోరెగావ్ ఫిల్మ్ స్టూడియో ఈ సినిమా మొదటి రోజు షూట్ జరుపుకుంటుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అయితే ఎలాంటి ప్రాణ నష్టం వాటిల్లకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇదిలా ఉంటే ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘సలార్’ చిత్ర యూనిట్ సభ్యులు వెళ్తున్న వ్యానును లారీ ఢీకొట్టింది. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని శ్రీరాం నగర్ కాలనీ వద్ద రాజీవ్ రహదారిపై మంగళవారం రాత్రి ఈ సంఘటన జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. ఇలా ఒకే రోజు ప్రభాస్ నటిస్తున్న రెండు చిత్రాలకు సంబంధించి ప్రమాదాలు జరగడం గమనార్హం. అయితే ఈ రెండు సినిమా సెట్‌లలో ప్రస్తుతం ప్రభాస్ షూటింగ్‌లో పాల్గొనట్లేదు.
Also Read: త్వరలో పెళ్ళిపీటలెక్కబోతున్న టాలీవుడ్ యంగ్ హీరో.. ఆ అమ్మాయితోనే వివాహం.. వాస్తవమేనా ?



