త్వరలో పెళ్ళిపీటలెక్కబోతున్న టాలీవుడ్ యంగ్ హీరో.. ఆ అమ్మాయితోనే వివాహం.. వాస్తవమేనా ?
టాలీవుడ్ దర్శకుడు, నిర్మాత ఎంఎస్ రాజు కుమారుడు సుమంత్ అశ్వీన్ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఈ వేడుకను హైదరాబాద్ శివార్లలో నిర్వహించనున్నట్లుగా సమాచారం.
Actor Sumanth Ashwin Marriage Update: టాలీవుడ్ దర్శకుడు, నిర్మాత ఎంఎస్ రాజు కుమారుడు సుమంత్ అశ్వీన్ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఈ వేడుకను హైదరాబాద్ శివార్లలో నిర్వహించనున్నట్లుగా సమాచారం. కరోనా ప్రభావంతో ఈ పెళ్లికి కేవలం బందువులు, సన్నిహుతులను మాత్రమే ఆహ్వనించనున్నారట. ఫిబ్రవరి 13న సుమంత్ వివాహం డల్లాస్‌లో ఎమ్మెస్ పూర్తిచేసిన దీపిక అనే అమ్మాయితో జరగునున్నట్లుగా తెలుస్తోంది.
నిర్మాత ఎంఎస్ రాజు తన కుమారుడి పేరు మీద సుమంత్ ఆర్ట్స్ అనే బ్యానర్‌ను నెలకొల్పి.. ఒక్కడు, వర్షం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా వంటి సూపర్ హిట్ చిత్రాలను నిర్మించాడు. ఇటీవలే ఎంఎస్ రాజు నిర్మించిన డర్టీ హరీ మూవీ భారీగా కలెక్షన్లును రాబట్టింది. ఇక సుమంత్ కూడా హీరోగానే పరిచయమయ్యాడు. తన తండ్రి డైరెక్షన్లో ‘తూనీగ తూనీగ’ సినిమాలో హీరోగా చేశాడు సుమంత్. కానీ ఆ మూవీ అంతగా హిట్ కాలేకపోయింది. అనంతరం ఇంద్రగంటి మోహన్ కృష్ణ డైరెక్షన్లో అంతకు ముందు ఆ తరువాత సినిమాను చేశాడు. ఆ తర్వాత లవర్స్, కేరింత వంటి సినిమాల్లో నటించి మంచి గుర్తింపు పొందాడు ఈ యంగ్ హీరో.