షారుఖ్ ఖాన్, ప్రభాస్.. సినిమా ఇండస్ట్రీలో తిరుగులేని స్టార్ డమ్ ఉన్న స్టార్ హీరోలు. షారుఖ్ ఖాన్ ఎన్నో ఏళ్లుగా సినిమా ఇండస్ట్రీని ఏలుతున్నాడు. ప్రపంచ వ్యాప్తంగా ఆయనకు అభిమానులు ఉన్నారు. అదే సమయంలో ప్రభాస్ మాత్రం అతి తక్కువ కాలంలో పాన్ ఇండియా సూపర్ స్టార్‌గా మారిపోయాడు. అశేష అభిమానగణం సంపాదించుకున్నాడు. అలాంటి సూపర్ స్టార్ల సినిమాలు ఒకేసారి థియేటర్లలో విడుదలైతే.. అభిమానులకు పండగేనని చెప్పుకోవచ్చు. అయితే సలార్, డుంకీ సినిమాల రిలీజ్ విషయంలో థియేటర్ల కేటాయింపు తీవ్ర చర్చనీయాంశమైంది. ముఖ్యంగా నార్త్‌లో షారుఖ్ ఖాన్ సినిమాకు ఎక్కువగా థియేటర్లు కేటాయించడం, దీనిపై సలార్ నిర్మాతలు అభ్యంతరం వ్యక్తం చేయడం సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ప్రభాస్ మూవీ రిలీజ్ రెండు రోజులకు ముందే సలార్ టీమ్ సంచలన నిర్ణయం తీసుకుంది. పీవీఆర్ ఐనాక్స్ చైన్ థియేటర్లల్లో తమ సినిమా విడుదల చేయబోమని ప్రకటించింది. ఏపీ, తెలంగాణతో పాటు దక్షిణాది రాష్ట్రాల్లో ఎక్కడ కూడా పీవీఆర్ ఐనాక్స్ థియేటర్లలో సలార్ మూవీని విడుదల చేయకూడదని సలార్ మేకర్స్‌వెల్లడించారు. అలాగే మిరాజ్ థియేటర్లలో కూడా సలార్ మూవీని రిలీజ్ చేయకూడదని తీర్మానించుకుంది.
సలార్, డంకీ సినిమాల రిలీజ్ డేట్లు ప్రకటించినప్పుడు భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఎవరో ఒకరు తమ సినిమాను వాయిదా వేసుకోవాలని అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయితే అప్పటికే సలార్ రిలీజ్ పలు సార్లు వాయిదా పడడంతో ప్రభాస్ సినిమాను కచ్చితంగా రిలీజ్ చేయాల్సిన పరిస్థితి. అదే సమయంలో డంకీ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరాణీ కూడా ఈ క్లాష్‌పై స్పందించాడు. ఒకేసారి రెండు భారీ సినిమాలు రిలీజ్ చేస్తే ఎవరో ఒకరు నష్టపోవాల్సి వస్తుందని చెప్పుకొచ్చాడు. ఆయన అనుకున్నదే జరిగింది. నార్త్‌లో డంకీ సినిమాకు భారీగా థియేటర్లు బుక్ అయ్యాయి. సలార్ సినిమాకు మాత్రం థియేటర్లు దొరక్కలేదు. ముఖ్యంగా పీవీఆర్ ఐనాక్స్, మిరాజ్ థియేటర్లన్నీ షారుక్ సినిమానే ప్రదర్శించాయి. ఇదే సలార్ టీమ్‌కు ఆగ్రహం తెప్పించింది. దీంతో సౌత్‌లో పీవీఆర్ ఐనాక్స్, మిరాజ్ థియేటర్లలో సలార్ సినిమాను రిలీజ్ చేయబోమని ప్రకటించింది. ఇది రెండు సినిమాల కలెక్షన్లపై ప్రభావం చూపించింది. పాజిటివ్ టాక్ వచ్చినా మొదటి రెండు రోజులు సలార్‌కు నార్త్‌లో పెద్దగా కలెక్షన్లు రాలేదు. అదే సమయంలో నెగెటివ్ టాక్ కారణంగా డంకీ సినిమా కలెక్షన్లు తగ్గుముఖం పట్టాయి.
𝑩𝑶𝑿 𝑶𝑭𝑭𝑰𝑪𝑬 𝑲𝑨 𝑺𝑨𝑳𝑨𝑨𝑹 🔥#BlockbusterSalaar hits 𝟒𝟎𝟐 𝐂𝐑𝐎𝐑𝐄𝐒 𝐆𝐁𝐎𝐂 (worldwide) 𝐢𝐧 𝟑 𝐃𝐚𝐲𝐬!#RecordBreakingSalaar #SalaarRulingBoxOffice#Salaar #SalaarCeaseFire #Prabhas #PrashanthNeel @PrithviOfficial @shrutihaasan @VKiragandur @hombalefilms… pic.twitter.com/C8rFGeSs86
— Salaar (@SalaarTheSaga) December 25, 2023
సలార్, డంకీ సినిమాల రిలీజ్ విషయంలో కాస్త గ్యాప్ ఉండి ఉంటే ఇరు నిర్మాతలు లాభపడేవారు. డంకీ కలెక్షన్లు తగ్గినా అది లో బడ్జెట్ సినిమా. ఇప్పటికే వంద కోట్ల క్లబ్‌లో చేరింది. అదే సమయంలో రికార్డు కలెక్షన్లు సాధిస్తోన్న సలార్ బ్రేక్ ఈవెన్‌కు ఇంకా చాలా దూరంలో ఉంది. ఒకవేళ సింగిల్‌గా థియేటర్లలోకి వచ్చి ఉంటే రెండు సినిమాలకు భారీ కలెక్షన్లు వచ్చేవని ట్రేడ్ పండితులు అభిప్రాయపడుతున్నారు. ప్రభాస్ నటించిన సలార్ కేవలం 4 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ. 400 కోట్లు రాబట్టింది. అదే సమయంలో నెగెటివ్ టాక్‌తో నడుస్తోన్న డంకీ వంద కోట్ల క్లబ్‌లో చేరింది. కలెక్షన్ల సంగతి పక్కన పెడితే.. ఈ రెండు సినిమాల్లో ఏది పై చేయి సాధించిందంటే సమాధానం చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే డంకీ పూర్తి ఎమోషనల్ డ్రామా. అదే సమయంలో సలార్ ప్యూర్ యాక్షన్ ఎంటర్‌టైనర్. కాబట్టి ఈ రెండు సినిమాలను పోల్చడం చాలా కష్టం. దేనికదే స్పెషల్ అంతే..
This festive season, your love has given us the best present of the year! 🤩❤️
Book your tickets right away!https://t.co/DIjTgPqLDI
Watch #Dunki – In Cinemas Now! pic.twitter.com/Gu56gV1cYR
— Red Chillies Entertainment (@RedChilliesEnt) December 25, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.