Devara-Saif Ali Khan: దేవర నుంచి సైఫ్ ఫస్ట్ లుక్ వచ్చేసింది.. సముద్ర జలాల్లో ‘భైరా’గా బాలీవుడ్ హీరో..

|

Aug 16, 2023 | 3:46 PM

ఆర్ఆర్ఆర్ తర్వాత తారక్ నటిస్తోన్న సినిమా కావడంతో దేవరపై భారీగానే అంచనాలు ఉన్నాయి. ఇందులో బాలీవుడ్ స్టార్స్ జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుండగా.. కీలకపాత్రలో హీరో సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నారు. అలాగే మలయాళీ నటుడు షైన్ టామ్ చాకో విలన్ గా కనిపించనున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లపై నందమూరి కళ్యాణ్ రామ్, మిక్కిలినేని సుధాకర్ ఈ సినిమాను నిర్మి స్తుండగా.. గతంలో విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ మూవీపై మరింత అంచనాలను క్రియేట్ చేసింది.

Devara-Saif Ali Khan: దేవర నుంచి సైఫ్ ఫస్ట్ లుక్ వచ్చేసింది.. సముద్ర జలాల్లో భైరాగా బాలీవుడ్ హీరో..
Devara Movie Team
Follow us on

మాస్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తోన్న లేటేస్ట్ సినిమా దేవర. ఆచార్య డిజాస్టర్ తర్వాత ఆయన దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీపై మరింత శ్రద్ద తీసుకుంటున్నారు కొరటాల. మరోవైపు ఆర్ఆర్ఆర్ తర్వాత తారక్ నటిస్తోన్న సినిమా కావడంతో దేవరపై భారీగానే అంచనాలు ఉన్నాయి. ఇందులో బాలీవుడ్ స్టార్స్ జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుండగా.. కీలకపాత్రలో హీరో సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నారు. అలాగే మలయాళీ నటుడు షైన్ టామ్ చాకో విలన్ గా కనిపించనున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లపై నందమూరి కళ్యాణ్ రామ్, మిక్కిలినేని సుధాకర్ ఈ సినిమాను నిర్మి స్తుండగా.. గతంలో విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ మూవీపై మరింత అంచనాలను క్రియేట్ చేసింది. కొద్ది రోజులుగా ఈ మూవీ షూటింగ్ వేగంగా జరుగుతుంది.

ఇదిలా ఉంటే.. ఈరోజు (ఆగస్ట్ 16న) సైఫ్ అలీ ఖాన్ పుట్టినరోజు. ఈ సందర్భంగా దేవర నుంచి ఆయన ఫస్ట్ లుక్ రివీల్ చేసింది చిత్రయూనిట్. ఇందులో సైఫ్ భైరా అనే పాత్రలో నటిస్తున్నట్లుగా తెలుస్తోంది. సముద్రం, అలలు మధ్యలో భైరా ఫస్ట్ లుక్ చూపించారు. ఇక తాజాగా విడుదలైన పోస్టర్ లో సైఫ్ మాస్ లుక్ లో కనిపిస్తున్నారు. దీంతో ఈ సినిమా ఫుల్ మాస్ యాక్షన్ నేపథ్యంలో ఉండబోతున్నట్లుగా అర్థమవుతుంది.

ఇవి కూడా చదవండి

ఎన్టీఆర్ ట్వీట్స్ సైఫ్ ఫస్ట్ లుక్ పోస్టర్..

ఎన్టీఆర్ ఇన్ స్టా పోస్ట్.. 

 

ఫుల్ మాస్ యాక్షన్ గా రాబోతున్న ఈ సినిమా కోసం తారక్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సముద్రపు భూభాగాల్లో జరిగే కథ ఇది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన యాక్షన్ సీన్స్ షూటింగ్ కంప్లీట్ అయ్యిందని.. త్వరలోనే సినిమా నాలుగో షెడ్యూల్ స్టార్ట్ కానున్నట్లు తెలుస్తోంది.

దేవర చిత్రయూనిట్ ట్వీట్..

ఎన్టీఆర్ ఇన్ స్టా పోస్ట్.. 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.