Sai Pallavi: ‘వరుణ్‌తో నటించేప్పుడు హీల్స్ వేసుకునేదాన్ని’.. ఆసక్తికర విషయాలు వెల్లడించిన హైబ్రీడ్ పిల్ల..
ai Pallavi About Varun Tej: 'ఫిదా' సినిమాతో తెలుగు ప్రేక్షకులను నిజంగానే మాయ చేసింది చెన్నై చిన్నది సాయి పల్లవి. కెరీర్ తొలినాళ్ల నుంచి గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటూ కేవలం నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రల్లోనే నటిస్తూ...
Sai Pallavi About Varun Tej: ‘ఫిదా’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను నిజంగానే మాయ చేసింది చెన్నై చిన్నది సాయి పల్లవి. కెరీర్ తొలినాళ్ల నుంచి గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటూ కేవలం నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రల్లోనే నటిస్తూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుందీ బ్యూటీ.
ఇక సినిమా ఎంపికలోనూ తనదైన ముద్ర వేసే ఈ చిన్నది.. తన పాత్రకు కచ్చితంగా తగినంత ప్రాధాన్యత ఉండేలా చూసుకుంటుంది. ఓవైపు నటనతో మరోవైపు డ్యాన్స్ ఫ్యాన్స్‌ను మెస్మరైజ్ చేసే ఈ బ్యూటీ తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వూలో తెలుగులో తన తొలి హీరో.. వరుణ్‌తేజ్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చింది. ఈ సందర్భంగా సాయి పల్లవి మాట్లాడుతూ.. ‘తెలుగులో నేను తొలిసారి నటించింది వరుణ్‌తోనే అందుకే ఆయన నాకు ఎప్పుడూ ప్రత్యేకమే. నా హైట్ ఏమో.. 5.4 అయితే.. వరుణ్ 6.4 అడుగుల ఎత్తు ఉంటాడు. దాంతో మేమిద్దరం కలిసి నటించే సీన్లలో తప్పనిసరిగా హీల్స్ వేసుకునేదాన్ని. సెట్స్‌పై వరుణ్ చాలా సరదాగా కనిపిస్తాడు. కానీ తీరా మానిటర్ చూస్తే, అతని భావాలు, నటన వ్యక్తం చేసిన తీరు వేరేలా ఉంటుంది. సినిమా చిత్రీకరణ జరిగినన్నీ రోజులు ఇంటికెళ్లాక మా అమ్మకు ఈ విషయాన్ని పదే పదే చెప్పేదాన్ని. వరుణ్ తేజ్ నటన చూసి ఎంతో నేర్చుకున్నాను. ఒక్కమాటలో చెప్పాలంటే ‘ఫిదా’తో నేను వరుణ్ నటనకు ఫిదా అయ్యాను’ అని చెప్పుకొచ్చిందీ బ్యూటీ. ఇక సాయి పల్లవి ప్రస్తుతం నాగ చైతన్య హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘లవ్ స్టోరీ’ చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమాతో పాటు నాని హీరోగా తెరకెక్కుతోన్న ‘శ్యామ్ సింగరాయ్’లోనూ తళక్కుమననుంది.
Also Read: Danush: ‘గుర్రం, ఏనుగు, కుక్క, కత్తి’… ఆసక్తి రేకెత్తిస్తోన్న ధనుష్ కొత్త చిత్రం టీజర్..