Sai Durgha Tej: ‘మయసభ’ అద్భుతాలు సృష్టించాలి.. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో సాయి దుర్గ తేజ్

వైవిధ్యమైన కంటెంట్‌తో ఎప్పటికప్పుడు ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందిస్తోన్న వన్ అండ్ ఓన్టీ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ సోనీ లివ్ నుంచి రాబోతోన్న ‘మయసభ : రైజ్ ఆఫ్ ది టైటాన్స్’ ఇప్పటికే సెన్సేషన్‌గా మారింది. వెర్సటైల్ ఫిల్మ్ మేకర్ దేవా కట్టా, కిరణ్ జయ కుమార్ దర్శకత్వంలో హిట్ మ్యాన్ అండ్ ప్రూడోస్ ప్రొడక్షన్స్ ఎల్.ఎల్.పి బ్యానర్స్‌పై విజయ్ కృష్ణ లింగమనేని, శ్రీహర్ష ఈ సిరీస్‌ను రూపొందించారు.

Sai Durgha Tej: ‘మయసభ’ అద్భుతాలు సృష్టించాలి.. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో సాయి దుర్గ తేజ్
Mayasabha

Updated on: Jul 31, 2025 | 7:23 PM

వైవిధ్యమైన కంటెంట్‌తో ఎప్పటికప్పుడు ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందిస్తోన్న వన్ అండ్ ఓన్టీ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ సోనీ లివ్ నుంచి రాబోతోన్న ‘మయసభ : రైజ్ ఆఫ్ ది టైటాన్స్’ ఇప్పటికే సెన్సేషన్‌గా మారింది. వెర్సటైల్ ఫిల్మ్ మేకర్ దేవా కట్టా, కిరణ్ జయ కుమార్ దర్శకత్వంలో హిట్ మ్యాన్ అండ్ ప్రూడోస్ ప్రొడక్షన్స్ ఎల్.ఎల్.పి బ్యానర్స్‌పై విజయ్ కృష్ణ లింగమనేని, శ్రీహర్ష ఈ సిరీస్‌ను రూపొందించారు. ఇక ‘మయసభ’ టీజర్‌ను వదిలినప్పటి నుంచి ఈ సిరీస్ గురించి అందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇక ఈ సిరీస్‌ను ఆగస్ట్ 7 నుంచి స్ట్రీమింగ్ చేయబోతోన్నారు. ఈ క్రమంలో గురువారం నాడు ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఈ మేరకు నిర్వహించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో..

ఇది కూడా చదవండి : బాబోయ్..! మేడం మెంటలెక్కించింది..! సీరియల్ బ్యూటీ షేక్ చేస్తుందిగా..!!

సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్ మాట్లాడుతూ .. ‘దేవా గారితో నాది పదేళ్ల ప్రయాణం. ‘ఆటోనగర్ సూర్య’ చూసిన వెంటనే దేవా గారికి ఫోన్ చేసి మాట్లాడాను. అప్పటి నుంచి మా ప్రయాణం మొదలైంది. అలా ఆ జర్నీ నుంచి ‘రిపబ్లిక్’ వచ్చింది. ‘రిపబ్లిక్’ టైంలో జరిగిన ఘటనలో నాకు ఎప్పుడూ అండగా నిలిచారు. ఇప్పుడు ఇలా మళ్లీ దేవా కట్టా గారి కోసం ఇలా ఈవెంట్‌కు రావడం ఆనందంగా ఉంది. ఓ మూడు పార్టులకు సరిపడా కథను రాశాను అని దేవా కట్టా గారు ‘మయసభ’ గురించి గతంలోనే ఎప్పుడో చెప్పారు అని అన్నారు.

ఇది కూడా చదవండి :మర్యాద రామన్నలో కనిపించిన ఈ కుర్రాడు గుర్తున్నాడా.? అతను ఇప్పుడు టాలీవుడ్ హీరో..

అలాగే  ఆది, చైతన్య నాకు చాలా ఏళ్ల నుంచి తెలుసు. 30 వెడ్స్ 21 చూసి మా అమ్మ నన్ను పెళ్లి గురించి అడుగుతూ ఉండేవారు. అలా నా లైఫ్‌లో చైతన్య విలన్‌లా మారిపోయాడు. ‘రిపబ్లిక్’ టైంలో సాయి కుమార్ నాకు ఎంతో సపోర్ట్ ఇచ్చారు. ‘మయసభ’ ఈవెంట్‌కు రావడం ఆనందంగా ఉంది. ఈ సిరీస్ అద్భుతాలు సృష్టించాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి :నాగ చైతన్య ఫస్ట్ మూవీలో కనిపించిన ఈ నటి గుర్తుందా..?ఇప్పుడు చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.