Sai Dharam Tej: స్పీడు పెంచిన సుప్రీం హీరో.. మరో సినిమాకు గ్రీన్‌సిగ్నల్‌.. డైరెక్టర్‌ ఎవరంటే?

|

Dec 02, 2022 | 5:52 PM

ఇప్పటికే కార్తిక్‌ దండు దర్శకత్వంలో ఓ సినిమా చేస్తోన్న సాయిధరమ్‌ తాజాగా మరో ప్రాజెక్టుకు పచ్చజెండా ఊపాడు. జయంత్‌ పనుగంటి దర్శకత్వంలో తన 16వ సినిమాను ప్రకటించాడీ సుప్రీమ్‌ హీరో. తాజాగా ఈచిత్రానికి సంబంధించి హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు

Sai Dharam Tej: స్పీడు పెంచిన సుప్రీం హీరో.. మరో సినిమాకు గ్రీన్‌సిగ్నల్‌.. డైరెక్టర్‌ ఎవరంటే?
Sai Dharam Tej
Follow us on

రిపబ్లిక్‌ సినిమా తర్వాత భారీ గ్యాప్‌ తీసుకున్నాడు సుప్రీం హీరో సాయి ధరమ్‌ తేజ్‌. యాక్సిడెంట్‌లో గాయపడడంతో చికిత్స తీసుకుంటూ చాలా రోజులుగా ఇంటికే పరిమితమయ్యాడు. అయితే ఇప్పుడు కోలుకోవడంతో మళ్లీ సిల్వర్‌స్ర్కీన్‌పై కనిపించేందుకు సిద్ధమవుతున్నాడు. వరుసగా సినిమాలకు సైన్‌ చేస్తున్నాడు. ఇప్పటికే కార్తిక్‌ దండు దర్శకత్వంలో ఓ సినిమా చేస్తోన్న సాయిధరమ్‌ తాజాగా మరో ప్రాజెక్టుకు పచ్చజెండా ఊపాడు. జయంత్‌ పనుగంటి దర్శకత్వంలో తన 16వ సినిమాను ప్రకటించాడీ సుప్రీమ్‌ హీరో. తాజాగా ఈచిత్రానికి సంబంధించి హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు.  SDT 16 సినిమాను శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై బీవిఎస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం షూటింగ్‌ త్వరలోనే ప్రారంభం కానుంది. హీరోయిన్లు, టెక్నీషియన్లు తదితర వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి. ఈ కాంబినేషన్‌లో ఇప్పటికే సోలో బ్రతుకే సో బెటర్‌ సినిమా వచ్చింది.

కాగా బైక్‌ యాక్సిడెంట్‌ తర్వాత వేగంగా సినిమాలు పూర్తి చేసే పనిలో ఉన్నాడు సాయి ధరమ్‌. ఇందులో భాగంగా డిసెంబర్ మొదటి వారంలో SDT 15 సినిమాకు సంబంధించిన టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ టీజర్ ని విడుదల చేయనున్నట్లు తెలుస్తో్ంది. క్షుద్ర శక్తుల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కథని అందించగా, కార్తీక్ దండు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాకు కాంతార ఫేమ్‌ అజనీష్ లోక్‌నాథ్‌ స్వరాలు సమకూరుస్తుండడం విశేషం.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..