మెగా హీరో సాయి ధరమ్ తేజ్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. తనదైన స్టైల్, మేనరిజమ్స్‌తో టాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే కొన్నినెలల క్రితం సాయి ధరమ్ తేజ్ జీవితంలో అనుకోని సంఘటన చోటు చేసుకుంది. బైక్ ప్రమాదంలో ఈ మెగా హీరో తీవ్రంగా గాయపడ్డాడు. కొన్ని నెలల పాటు ఆస్పత్రిలోనే గడిపాడు. ఇప్పటికీ కూడా ఈ బైక్ యాక్సిడెంట్ నుంచి తేజ్ కోలుకోలేదని తెలుస్తోంది. ఆయన మాటలు, గొంతు విన్నా ఈ మార్పు స్పష్టంగా కనిపిస్తుంటుంది. బైక్ ప్రమాదం తర్వాత సాయి ధరమ్ తేజ్ పూర్తిగా మారిపోయాడు. రోడ్డు భద్రతా నియమాలకు సంబంధించిన కార్యక్రమాలు, ఈవెంట్లలో తరచూ కనిపిస్తున్నాడు. ట్రాఫిక్ రూల్స్ గురించి అవగామన కల్పిస్తున్నాడు. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో తాజాగా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ (వెస్ట్ జోన్) ఆధ్వర్యంలో బంజరా హిల్స్‌లోని సుల్తాన్ ఉల్ ఉలూమ్ ఎడ్యుకేషనల్ సోసైటీ ఆడిటోరియంలో రహదారి భద్రతా చైతన్య సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా సాయిధరమ్ తేజ్ హాజరయ్యాడు. ఈ సందర్భంగా మాట్లాడిన తేజ్ తన బైక్ ప్రమాద సంఘటనను గుర్తు తెచ్చుకున్నాడు.
‘ఇది నాకు రెండో జీవితం. నేను రోడ్డు ప్రమాదం నుంచి బయపడటానికి హెల్మెట్ కారణమైంది. అభిమానులు, మీలాంటి వాళ్లు, ప్రేక్షకుల ఆశ్సీస్సులతో ఈ రోజు మీ ముందు ఇలా నిలబడ్డానికి కారణమదే. టూవీలర్ డ్రైవ్ చేసే వాళ్లంతా తప్పకుండా హెల్మెట్‌ను ధరించండి. అలాగే కార్లు డ్రైవ్ చేసే వారు సీటు బెల్డ్‌లు విధిగా ధరించండి. అందరూ ట్రాఫిక్స్ రూల్స్ పాటించండి. మద్యం తాగినప్పుడు డ్రైవింగ్ చేయడం చాలా ప్రమాదకరం. అందరూ ట్రాఫిక్ పోలీసులకు సహకరిస్తూ, ట్రాఫిక్స్ నిబంధనలు పాటిద్దాం’ అంటూ తన స్పీచ్‌లో చెప్పుకొచ్చాడు. ఇక సినిమాల విషయానికొస్తే.. విరూపాక్ష, బ్రో వంటి బ్లాక్ బస్టర్స్ తర్వాత గాంజా శంకర్ గా కనిపించనున్నాడు సాయి ధరమ్ తేజ్. సంపతి నంది ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.
Mega Supreme Hero @IamSaiDharamTej graces the Road Safety & Awareness Drive as Chief Guest conducted by Hyderabad Police at Sultan-Ul-Uloom Educational Society.
Addresses students & requests them to wear helmets & avoid Drunk & Drive. pic.twitter.com/EIjlIwcifH— Vamsi Kaka (@vamsikaka) February 13, 2024
#SaiDharamTej shared in a Press meet organised by Traffic Hyderabad Police. Only reason he is alive and being here is #Helmet
I suggest all of you to be safe by wearing Helmet followed by Traffic Rules. @IamSaiDharamTej @HYDTP pic.twitter.com/kuAhdBkboR
— Rajesh Kumar Reddy E V (@rajeshreddyega) February 13, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.