AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sai Dharam Tej: ఫర్హాన్‌కు అసలు సాయం అందిందా..? లేదా.. తేజ్ నుంచి వచ్చిన ఫైనల్ ఆన్సర్ ఇదే..

తనను కాపాడిన అబ్దుల్ ఫర్హాన్ వ్యక్తితో మాట్లాడానని.. తనకు ఏ సాయం కావాలన్నా చేస్తానని చెప్పానని.. కానీ డబ్బులు ఇచ్చి చేతులు దులుపుకోవడం తనకు ఇష్టం లేదని చెప్పుకొచ్చారు తేజ్. అయితే ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కాగా.. తేజ్ మాటలపై అబ్దుల్ స్పందించిన సంగతి తెలిసిందే. తనతో ఎవ్వరూ మాట్లాడలేదని.. మెగా ఫ్యామిలీ నుంచి తనకు ఎవరూ ఫోన్ చేయలేదని అన్నాడు.

Sai Dharam Tej: ఫర్హాన్‌కు అసలు సాయం అందిందా..? లేదా.. తేజ్ నుంచి వచ్చిన ఫైనల్ ఆన్సర్ ఇదే..
Sai Dharam Tej
Rajitha Chanti
|

Updated on: Apr 27, 2023 | 5:04 PM

Share

ఇటీవల విరూపాక్ష సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్. యాక్సిడెంట్ తర్వాత ఆయన నటించిన ఈ సినిమాతో సాలిడ్ కంబ్యాక్ ఇచ్చారు. అయితే ఈ మూవీ ప్రమోషన్లలో తేజ్ యాక్సిడెంట్ గురించి.. ఆ సమయంలో తనను కాపాడిన వ్యక్తి గురించి ఇంటర్వ్యూలలో ప్రస్తావించిన సంగతి తెలిసిందే. తనను కాపాడిన అబ్దుల్ ఫర్హాన్ వ్యక్తితో మాట్లాడానని.. తనకు ఏ సాయం కావాలన్నా చేస్తానని చెప్పానని.. కానీ డబ్బులు ఇచ్చి చేతులు దులుపుకోవడం తనకు ఇష్టం లేదని చెప్పుకొచ్చారు తేజ్. అయితే ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కాగా.. తేజ్ మాటలపై అబ్దుల్ స్పందించిన సంగతి తెలిసిందే. తనతో ఎవ్వరూ మాట్లాడలేదని.. మెగా ఫ్యామిలీ నుంచి తనకు ఎవరూ ఫోన్ చేయలేదని అన్నాడు. తనకు వాళ్లంతా ఎలాంటి సాయం చేయలేదని.. కనీసం తనను కలవలేదని అన్నాడు అబ్దుల్. మెగా ఫ్యామిలీ నుంచి తనకు డబ్బులు ఇచ్చారని ప్రచారం జరగడంతో మానసికంగా ఒత్తిడికి గురవుతున్నానని.. టార్చర్ పెరిగిందని.. దీంతో తాను ప్రశాంతంగా ఉద్యోగానికి వెళ్లలేకపోతున్నానంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో.. సాయి ధరమ్ తేజ్ అబద్ధం చెప్పాడా ?.. ప్రాణాలు కాపాడిన వ్యక్తికి కనీసం సాయం చేయలేదా ? అంటూ కామెంట్స్ వచ్చాయి. తాజాగా ఈ వివాదంపై స్పందించారు తేజ్.

గతంలో తాను మాట్లాడిన మాటలకు సంబంధించిన వీడియోను షేర్ చేస్తూ.. వివాదం పై ట్విట్టర్ వేదికగా వివరణ ఇచ్చాడు తేజ్. “నా గురించి.. నా టీం గురించి బయట తప్పుగా ప్రచారం జరుగుతోందనే వార్తలు నా వద్దకు వచ్చాయి. ఈ వీడియోలో మీరు చూస్తున్నట్లుగా.. ఫర్హాన్ కు మేం సాయం చేశామని ఎప్పుడూ చెప్పుకోలేదు. ఆయన చేసిన సాయానికి నేను.. నా ఫ్యామిలీ ఎప్పుడూ రుణపడి ఉంటాం. ఆయన వద్ద మా డీటైల్స్.. మా కాంటాక్స్ డీటైల్స్ ఉన్నాయి. ఆయనకు ఎప్పుడూ ఏ అవసరం వచ్చినా కూడా కాంటాక్ట్ అవ్వొచ్చు. మా మేనేజర్ శరణ్ ఆయనతో ఎప్పటికీ టచ్ లోనే ఉంటాడు. ఈ విషయం మీద నేను స్పందించడం ఇదే చివరిసారి అవుతుంది” అంటూ ట్వీట్ చేస్తూ క్లారిటీ ఇచ్చాడు తేజూ.

ఇవి కూడా చదవండి

హైదరాబాద్‏లోని కేబుల్ బ్రిడ్జ్ సమీపంలో బైక్ పై వెళ్తుండగా.. తేజ్ ప్రమాదానికి గురయ్యారు. దీంతో తీవ్ర గాయాలు కావడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. ప్రమాద సమయంలో అక్కడే ఉన్న అబ్దుల్ ఫర్హాన్ అంబులెన్స్ కు కాల్ చేసి సమాచారం అందించడమే కాకుండా.. పడిపోయిన తేజ్ ను లేపి నీళ్లు తాగించడం చేశాడు. అయితే ఆ సమయంలో ప్రమాదానికి గురైంది సాయ్ ధరమ్ తేజ్ అని తెలియదని.. కేవలం మానవత్వంతోనే తేజూను కాపాడాడు. అయితే ప్రమాదం నుంచి కోలుకున్న తర్వాత అద్బుల్ కు సాయి ధరమ్ తేజ్ కలిశాడని.. అతనికి ఎలాంటి సాయం కావాలన్నా చేసేస్తా అన్నారని తన ఫోన్ నెంబర్ కూడా అద్బుల్ కు ఇచ్చారని ప్రచారం జరిగింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

దురంధర్ మూవీ చూసిన టీం ఇండియా.. వీడియో వైరల్
దురంధర్ మూవీ చూసిన టీం ఇండియా.. వీడియో వైరల్
పడుకునే భంగిమను బట్టి మీరు ఎలాంటి వారో తెలుసుకోవచ్చట.. ఎలా అంటే?
పడుకునే భంగిమను బట్టి మీరు ఎలాంటి వారో తెలుసుకోవచ్చట.. ఎలా అంటే?
శ్రేయస్ కంటే రాహుల్ పెద్ద తోపా? ఏకిపారేసిన ఐపీఎల్ టీమ్ ఓనర్
శ్రేయస్ కంటే రాహుల్ పెద్ద తోపా? ఏకిపారేసిన ఐపీఎల్ టీమ్ ఓనర్
ఈ సీక్రెట్ తెలిస్తే చికెన్ సూప్ కోసం హోటల్‌కు వెళ్లనే వెళ్లరు!
ఈ సీక్రెట్ తెలిస్తే చికెన్ సూప్ కోసం హోటల్‌కు వెళ్లనే వెళ్లరు!
నాగిని పాటకు.. దుమ్మురేపే డ్యాన్స్ వేసిన పాము.. వీడియో వైరల్..
నాగిని పాటకు.. దుమ్మురేపే డ్యాన్స్ వేసిన పాము.. వీడియో వైరల్..
స్టార్ డైరెక్టర్ అయ్యే ప్రయత్నంలో మృత్యు ఒడికి
స్టార్ డైరెక్టర్ అయ్యే ప్రయత్నంలో మృత్యు ఒడికి
అందాల నాట్య మయూరి.. ఈ స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా.. ?
అందాల నాట్య మయూరి.. ఈ స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా.. ?
కడుపునొప్పి వచ్చిందని ఇంజెక్షన్ ఇచ్చిన ఆర్ఎంపీ.. కట్ చేస్తే..
కడుపునొప్పి వచ్చిందని ఇంజెక్షన్ ఇచ్చిన ఆర్ఎంపీ.. కట్ చేస్తే..
ఇదెక్కడి ట్విస్ట్ భయ్యా.. బిగ్‏బాస్ ఓటింగ్ దెబ్బకు గల్లంతు..
ఇదెక్కడి ట్విస్ట్ భయ్యా.. బిగ్‏బాస్ ఓటింగ్ దెబ్బకు గల్లంతు..
పట్ట పగలు నడి రోడ్డుపై దారుణ హత్య.. బైక్ తగిలిందని గ్యాంగ్‌వార్‌!
పట్ట పగలు నడి రోడ్డుపై దారుణ హత్య.. బైక్ తగిలిందని గ్యాంగ్‌వార్‌!