Dhurandhar: దురంధర్ మూవీ చూసిన టీం ఇండియా.. వీడియో వైరల్
రణ్‌వీర్ సింగ్ నటించిన ధురంధర్ సినిమా బ్లాక్ బస్టర్‌గా నిలిచి, రూ.400 కోట్లకు చేరువలో ఉంది. ఈ వాస్తవ సంఘటనల ఆధారిత చిత్రాన్ని చూసేందుకు టీం ఇండియా క్రికెటర్లు లక్నోలో ఓ థియేటర్‌నే బుక్ చేశారు. సూర్యకుమార్ యాదవ్, శుభ్‌మాన్ గిల్ సహా పలువురు ఆటగాళ్లు ప్రత్యేక స్క్రీనింగ్‌లో సినిమా చూశారు. వారి భద్రత కోసం థియేటర్‌ను పూర్తిగా కేటాయించారు.
బాలీవుడ్ స్టార్ రణ్‌వీర్ సింగ్ హీరోగా నటించిన ధురంధర్ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ సినిమా కలెక్షన్ ఇప్పటికే రూ.400 కోట్లకు చేరువలో ఉంది. వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి రెస్పాన్స్ తో దూసుకుపోతోంది. ఈక్రమంలోనే ఈ మూవీని చూసేందుకు టీం ఇండియా ప్లేయర్లు ఓ థియేటర్‌నే బుక్ చేయడం ఇప్పుడు పాన్ ఇండియా లెవల్లో హాట్ టాపిక్ అవుతున్న న్యూస్. టీం ఇండియా ఆటగాళ్లు కూడా ‘ధురంధర్’ సినిమా చూశారు. క్రికెటర్ల కోసం మొత్తం ఒక థియేటర్‌నే బుక్ చేయించినట్లు తెలుస్తోంది. డిసెంబర్ 17న టీమిండియా దక్షిణాఫ్రికా జట్ల మధ్య నాలుగో టీ20 మ్యాచ్ జరగనుంది. దాని కోసం టీం ఇండియా ఆటగాళ్లు లక్నో చేరుకున్నారు. అయితే డిసెంబర్ 15న రిలాక్స్డ్ మూడ్‌లో ఉన్న ఆటగాళ్లు సినిమా చూడటానికి సమయం తీసుకున్నారు. లక్నోలోని ఒక మల్టీప్లెక్స్‌లో ఆటగాళ్ల కోసం ప్రత్యేక ప్రదర్శనను ఏర్పాటు చేశారు. సోమవారం రాత్రి 8.10 గంటలకు టీం ఇండియా ఆటగాళ్ల కోసం షో బుక్ చేశారు. ఇక సినిమా ముగిసేసరికి అర్ధరాత్రి 12.10 అయింది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, కోచ్ గౌతమ్ గంభీర్, వైస్ కెప్టెన్ శుభ్‌మాన్ గిల్, హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మ, అర్ష్‌దీప్ సింగ్ తదితర క్రికెటర్లు ధరంధర్ సినిమా చూసి ఆనందించారు. భద్రతా దృష్ట్యా టీం ఇండియా ఆటగాళ్లు, సిబ్బందిని తప్ప మరెవరినీ ఈ స్క్రీనింగ్‌లోకి అనుమతించలేదు. ఆటగాళ్ల భద్రత మరియు సౌలభ్యం కోసం మొత్తం థియేటర్ బుక్ చేశారని మల్టీ ప్లెక్స్ నిర్వాహకులు తెలిపారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
స్టార్ డైరెక్టర్ అయ్యే ప్రయత్నంలో మృత్యు ఒడికి! ట్యాలెంటెడ్ డైరెక్టర్ ఆకస్మిక మృతి!
ఎట్టెట్లా.. కైలాస పర్వతాన్ని ఎక్కేశాడా?.. ఎవరు? ఎప్పుడు?
నదిలో వేయి లింగాలు.. ఆ మిస్టరీ ఏంటంటే..
గాలివానకు కుప్పకూలిన స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ
మన కొల్హాపురి చెప్పులకు రూ. 85 వేలా?
వరుడి గొంతెమ్మ కోరిక..పెళ్లిలో వధువు దిమ్మతిరిగే ట్విస్ట్
హిమాలయాల్లో న్యూక్లియర్ డివైస్.. పెనుముప్పు తప్పదా ??
మెస్సీ ప్రైవేట్ జెట్ చూసారా ?? గాల్లో ఎగిరే ప్యాలెస్!

