టాక్‌తో పనిలే..శతకొట్టిన ప్రభాస్

టాక్‌తో పనిలే..శతకొట్టిన ప్రభాస్
Saaho First Day Collections

ప్రపంచ వ్యాప్తంగా అత్యదిక థియేటర్లలో విడుదలయిన భారీ బడ్జెట్ తెలుగు మూవీ సాహో బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతోంది. ఈ మూవీ తొలిరోజున 100 కోట్లు సాధించిందని ట్రేడ్ వర్గాల నుంచి రిపోర్ట్ అందుతున్నాయి. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే ఈ మూవీ  42 కోట్లు సాధించడం విశేషం. డివైడ్ టాక్ వచ్చినా కూడా కలెక్షన్లు మాత్రం అదరగొడుతున్నాయి. హిందీ వెర్షన్ విషయానికొస్తే.. తొలి రోజే 25 కోట్లు వసూలు చేసింది. ఓవర్సీస్ హిందీ విషయానికొస్తే.. మరో రూ.3 […]

Ram Naramaneni

|

Aug 31, 2019 | 5:13 PM

ప్రపంచ వ్యాప్తంగా అత్యదిక థియేటర్లలో విడుదలయిన భారీ బడ్జెట్ తెలుగు మూవీ సాహో బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతోంది. ఈ మూవీ తొలిరోజున 100 కోట్లు సాధించిందని ట్రేడ్ వర్గాల నుంచి రిపోర్ట్ అందుతున్నాయి. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే ఈ మూవీ  42 కోట్లు సాధించడం విశేషం. డివైడ్ టాక్ వచ్చినా కూడా కలెక్షన్లు మాత్రం అదరగొడుతున్నాయి. హిందీ వెర్షన్ విషయానికొస్తే.. తొలి రోజే 25 కోట్లు వసూలు చేసింది. ఓవర్సీస్ హిందీ విషయానికొస్తే.. మరో రూ.3 కోట్లు వసూలు చేసింది. బాహుబలితో ప్రభాస్‌కి వచ్చిన ఇమేజ్, సినిమా బజ్‌, ప్రమోషన్స్‌తో  మిగతా భాషలన్ని కలిపితే..తొలిరోజే రూ.100 కోట్ల షేర్ రాబట్టినట్టు సమాచారం. ఇక రెండు రోజులు వీకెండ్ ఫీవర్‌తో సోమవారం వినాయకచవితి సందర్భంగా సెలవు కావడంతో సినిమా మంచి వసూళ్లను అందుకునే అవకాశం ఉంది.

భారీ అంచ‌నాల న‌డుమ ప‌లు భాష‌ల‌లో విడుద‌లైన హై బ‌డ్జెట్ చిత్రం సాహో. సుజీత్ ద‌ర్శ‌క‌త్వంలో యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కిన ఈ చిత్రానికి మిక్స్‌డ్ టాక్ ల‌భిస్తుంది. బాలీవుడ్ క్రిటిక్ త‌ర‌ణ్ ఆద‌ర్శ్ త‌న ట్విట్ట‌ర్ ద్వారా సాహో చిత్రం భ‌రించ‌లేని సినిమా అని చెప్పుకొచ్చాడు. బాలీవుడ్ ప్రేక్ష‌కులు కూడా ఈ సినిమాపై పెదవి విరుస్తున్నార‌నే టాక్ వినిపిస్తుంది. అయితే ప్ర‌భాస్ స్టార్‌డ‌మ్‌తో పాటుగా చిత్రానికి ల‌భించిన‌ హైప్‌, అడ్వాన్స్ బుక్సింగ్స్ వ‌లన తొలి రోజు ఈ చిత్రం బాక్సాఫీస్ ద‌గ్గ‌ర 24.40 కోట్ల వ‌సూళ్ళు సాధించింద‌ని త‌ర‌ణ్ పేర్కొన్నారు. 2,3 రోజులు చిత్రానికి చాలా కీల‌క‌మైన‌ద‌ని ఆయ‌న తెలిపారు. సాహో చిత్రం తొలి రోజు హిందీలో 50 కోట్ల‌కి పైగా వ‌సూళ్లు సాధిస్తుంద‌ని విశ్లేష‌కులు భావించిన‌ప్ప‌టికి అంచ‌నాలు త‌ల‌కిందులు అయ్యాయి.

2019లో విడుద‌లైన చిత్రాల‌లో భార‌త్ చిత్రం తొలి రోజు 42.30 కోట్లు సాధించి టాప్‌లో నిలిచింది. ఆ త‌ర్వాత మిష‌న్ మంగ‌ళ్ ఫ‌స్ట్ డే రోజు 29.16 కోట్లు, సాహో 24.40 కోట్లు, క‌ళంక్ 21.60 కోట్లు, కేస‌రి 21.06 కోట్లు సాధించి 2,3,4,5 స్థానాల‌లో నిలిచాయి. సాహో చిత్రంలో జాకీష్రాఫ్‌, లాల్‌, అరుణ్‌విజయ్‌, నీల్‌నితిన్‌, మందిరాబేడి, మురళీశర్మతో పాటు భిన్న భాషలకు చెందిన పలువురు నటులు ముఖ్య పాత్ర‌లు పోషించారు. సుజీత్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రాన్ని యూవీ క్రియేష‌న్స్ సంస్థ నిర్మించింది.

బాహుబలి తర్వాత ప్రభాస్‌ ఎలాంటి కథ, కథనాలతో సినిమా చేస్తాడోనని అన్ని వర్గాల ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూశారు. కానీ కథలోని వైవిధ్యత కంటే సాంకేతికంగా ఉన్నతమైనమైన సినిమా చేయడానికే ప్రభాస్‌ ప్రయత్నించారు. అవి ప్రేక్షకులను అంతగా మెప్పించలేదు.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu