‘ఎవరు’ కలెక్షన్స్ కెరీర్ బెస్ట్ అంటున్న శేష్..కరెక్ట్ కాదంటూ నిర్మాత ఫైర్!

‘ఎవరు’ కలెక్షన్స్ కెరీర్ బెస్ట్ అంటున్న శేష్..కరెక్ట్ కాదంటూ నిర్మాత ఫైర్!
Evaru Movie Collections Report

అడవి శేష్.. ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుని దూసుకుపోతున్న హీరో. రెగ్యులర్ సినిమాలు చేయకుండా స్క్రీన్ ప్లే బేస్డ్ మూవీస్ చేస్తూ ప్రేక్షకుల బుర్రలకు పదును పెడుతున్నాడు ఈ హీరో. కారెక్టర్ ఆర్టిస్టుగా వచ్చి హీరోగా మారి ఇప్పుడు సంచలన విజయాలు అందుకుంటున్నాడు ఈయన. తాజాగా ఈ కుర్ర హీరో నటించిన ఎవరు సినిమా విడుదలైంది. దీనికి కూడా టాక్ బాగానే వచ్చింది. రెజీనా హీరోయిన్‌గా వచ్చిన ఈ చిత్రంపై ముందు నుంచి కూడా అంచనాలు […]

Ram Naramaneni

|

Aug 31, 2019 | 6:02 PM

అడవి శేష్.. ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుని దూసుకుపోతున్న హీరో. రెగ్యులర్ సినిమాలు చేయకుండా స్క్రీన్ ప్లే బేస్డ్ మూవీస్ చేస్తూ ప్రేక్షకుల బుర్రలకు పదును పెడుతున్నాడు ఈ హీరో. కారెక్టర్ ఆర్టిస్టుగా వచ్చి హీరోగా మారి ఇప్పుడు సంచలన విజయాలు అందుకుంటున్నాడు ఈయన. తాజాగా ఈ కుర్ర హీరో నటించిన ఎవరు సినిమా విడుదలైంది. దీనికి కూడా టాక్ బాగానే వచ్చింది. రెజీనా హీరోయిన్‌గా వచ్చిన ఈ చిత్రంపై ముందు నుంచి కూడా అంచనాలు భారీగానే ఉన్నాయి. వాటికి తగ్గట్లుగానే ఎవరు తొలిరోజే 2 కోట్ల వరకు షేర్ తీసుకొచ్చి అందర్నీ ఆశ్యర్యపరిచింది. ఆ సినిమాతో పాటు విడుదలైన శర్వానంద్ ‘రణరంగం’కి ప్లాప్ టాక్ రావడం, థియేటర్స్‌లో వేరే ఏ సినిమా పోటీగా లేకపోవడంతో ‘ఎవరు’ కలెక్షన్స్ పరంగా సత్తా చాటింది.  ఇక తాజాగా వచ్చిన సాహో కూడా ప్రేక్షకులను పెద్దగా మెప్పించలేదు. దీంతో తన సినిమాను మళ్లీ ప్రమోట్ చేసే పనిలో పడ్డాడు శేష్. దానిలో భాగంగా ‘ఎవరు’ తన గత సినిమా ‘గూఢచారి’ కలెక్షన్స్‌ను కూడా దాటేసి తన కెరీర్ బెస్ట్ కమర్షియల్ హిట్‌గా నిలిచింది అని ట్వీట్ చేసాడు. అయితే అడివి శేష్ పెట్టిన ఈ ట్వీట్‌కి ఊహించని రిప్లై ఇచ్చాడు ‘గూఢచారి’ సినిమా నిర్మాత అభిషేక్ నామా.

అడివి శేష్ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్ ‘గూఢచారి’ సినిమానే అంటూ చెప్పుకొచ్చాడు. అలా కాకుండా ‘ఎవరు’ పెద్ద హిట్ అయితే ఆ సినిమా బాక్సాఫీసు కలెక్షన్స్ రిపోర్టు షేర్ చెయ్యగలవా అంటూ ప్రశ్నించాడు.  అడివి శేష్‌ కెరీర్‌కి  బిగ్గెస్ట్ హిట్ ‘గూఢచారి’ అని తెగేసి చెప్పాడు. దీంతో వీరిద్దరి మధ్య ఏమైనా డిఫరెన్సెస్ వచ్చాయా అనే సందేహం ఫిల్మ్ వర్గాల్లో వ్యక్తమవుతోంది. లేకపోతే అభిషేక్ నామా అంతలా రియాక్ట్ అవ్వాల్సిన పనిలేదుగా అంటూ కొందరూ లాజిక్స్ మాట్లాడుతున్నారు. సో ఈ విషయంలో హీరో, నిర్మాత ఎటువంటి క్లారిటీ ఇస్తాడో వేచి చూడాలి.

Abhishek Pictures producers Reply to Adivi Sesh Tweet over Evaru Collections

 

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu