Saachi Movie OTT: దాదాపు 10 నెలల తర్వాత ఓటీటీలో రానున్న సినిమా..
థియేటర్స్ లో ఫ్లాప్ అయిన సినిమాలు కూడా ఓటీటీలో మంచి టాక్ ను సొంతం చేసుకుంటున్నాయి. ఇదిలా ఉంటే కొన్ని సినిమాకు వారం పదిరోజులకు ఓటీటీలోకి వస్తుంటే మరికొన్ని సినిమాలు నెలలు పడుతున్న ఓటీటీ మొహం చూడటం లేదు. అలాంటి సినిమాల్లో ఈ సినిమా ఒకటి.

థియేటర్స్ లోకి వచ్చిన సినిమాలు ఓటీటీలోనూ అలరిస్తున్నాయి. థియేటర్స్ లో రిలీజ్ అయినా నెలరోజులకు ఓటీటీలో సినిమాలు అలరిస్తూ ఉంటాయి. ఇప్పటికే చాలా సినిమాలు ఓటీటీలో సూపర్ హిట్ టాక్ లను కూడా సొంతం చేసుకున్నాయి. థియేటర్స్ లో ఫ్లాప్ అయిన సినిమాలు కూడా ఓటీటీలో మంచి టాక్ ను సొంతం చేసుకుంటున్నాయి. ఇదిలా ఉంటే కొన్ని సినిమాకు వారం పదిరోజులకు ఓటీటీలోకి వస్తుంటే మరికొన్ని సినిమాలు నెలలు పడుతున్న ఓటీటీ మొహం చూడటం లేదు. అలాంటి సినిమాల్లో ఈ సినిమా ఒకటి. ఆ సినిమానే సాచి. ఈ సినిమా థియేటర్స్ లోకి వచ్చి దాదాపు 10 నెలలు అవుతోంది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలోకి రాబోతుంది.
ఈ సినిమా 2023 మార్చి 3న థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమా వచ్చింది పోయింది కూడా చాలా మందికి తెలియదు. చిన్న సినిమా కావడం .. పైగా పేరున్న నటులు ఒక్కరు కూడా లేకపోవడంతో ఈ సినిమా తెలియకుండా పోయింది. మహిళ సాధికారత అనే అంశంతో నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది.
కటింగ్ షాప్ నడిపే తండ్రి అతనికి ముగ్గురు కూతుర్లు..తండ్రికి జబ్బు చేయడంతో కూతురే తండ్రి బాధ్యతలు తీసుకుంటుంది, ఈ క్రమంలో ఆమె కటింగ్ షాప్ నడుపుతుంది. అప్పుడు ఆమె ఎలాంటి సవాళ్లు ఎదుర్కొంది అన్నదే కథ. కథ పరంగా ఈ సినిమా మంచి పాయింట్ కానీ.. పెద్దగా గుర్తింపు లేని నటులు కావడంతో అంతగా ఆకట్టుకోలేకపోయింది. పైగా సినిమా సాగదీత కారణంగా నిరాశపరిచింది. ప్రస్తుతం ఈ సినిమా ఇండియాలో తప్ప మిగతా అన్ని చోట్ల అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో ఉంది. ఇక ఇప్పుడు ఇండియాలో కూడా స్ట్రీమింగ్ కానుందని తెలుస్తోంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



