Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SSMB 29:ఒడిశాలో ఎత్తైన శిఖరంపై జక్కన్న.. అంతా బాగానే ఉంది కానీ.. ఆ విషయంలో బాధగా ఉందన్న రాజమౌళి

సూపర్ స్టార్ మహేష్ బాబు రాజమౌళి సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. మహేష్ బాబు చివరిగా నటించిన గుంటూరు కారం సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోకపోవడంతో ఫ్యాన్స్ కాస్త నిరాశలో ఉన్నారు. దాంతో మహేష్ బాబు, రాజమౌళి సినిమా పై బోలెడన్ని ఆశలు పెట్టుకున్నారు. ఇప్పటికే పాన్ ఇండియా సినిమాలు చేసి దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న రాజమౌళి ఇప్పుడు మహేష్ బాబు సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందనున్నారని, మహేష్ సినిమా పాన్ గ్లోబల్ మూవీ అని అభిమానులు అంటున్నారు.

SSMB 29:ఒడిశాలో ఎత్తైన శిఖరంపై జక్కన్న.. అంతా బాగానే ఉంది కానీ.. ఆ విషయంలో బాధగా ఉందన్న రాజమౌళి
Ssmb 29
Follow us
Rajeev Rayala

|

Updated on: Mar 20, 2025 | 10:48 AM

మహేష్ బాబు చివరిగా నటించిన గుంటూరు కారం సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోకపోవడంతో ఫ్యాన్స్ కాస్త నిరాశలో ఉన్నారు. దాంతో మహేష్ బాబు, రాజమౌళి సినిమా పై బోలెడన్ని ఆశలు పెట్టుకున్నారు ఫ్యాన్స్. ఇప్పటికే పాన్ ఇండియా సినిమాలు చేసి దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న రాజమౌళి ఇప్పుడు మహేష్ బాబు సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందనున్నారని, మహేష్ సినిమా పాన్ గ్లోబల్ మూవీ అని అభిమానులు అంటున్నారు. ఈ సినిమా ఒక భారీ యాక్షన్-అడ్వెంచర్ ఫిల్మ్‌గా తెరకెక్కుతోంది. మహేష్ బాబు సినిమా ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో రూపొందుతుందని తెలుస్తుంది. ఇండియానా జోన్స్ తరహాలో గ్లోబల్ స్థాయి కథతో ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదల కానుందని టాక్ నడుస్తుంది. ఈ సినిమాకు బడ్జెట్ సుమారు రూ.1000 కోట్ల రూపాయల వరకు ఉండవచ్చని గుసగుసలు వినిపిస్తున్నాయి.

షూటింగ్ జనవరి 2025లో హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో ప్రారంభమైంది. రీసెంట్ గా ఒడిశాలోని కోరాపుట్ జిల్లాలోని అడవి ప్రాంతాల్లో షూటింగ్ జరుగుతోంది. మహేష్ బాబు అక్కడ స్థానిక పోలీసులతో కలిసి ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇటీవల కెన్యాలో కూడా కొన్ని సన్నివేశాలు చిత్రీకరించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మహేష్ బాబు ఈ సినిమాలో డిఫరెంట్ లుక్ లో కనిపించనున్నారు. అలాగే ఈ సినిమాలో ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తుంది. అయితే ఆమె పాత్ర నెగిటివ్ షేడ్స్ తో ఉంటుందని టాక్.  హీరోయిన్‌గా మరో అంతర్జాతీయ నటిని తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. అలాగే, మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ పాత్రలో నటిస్తున్నట్లు ఒడిశా డిప్యూటీ సీఎం ప్రవతి పరిదా ట్వీట్ ద్వారా చెప్పకనే చెప్పారు.

ఇవి కూడా చదవండి

రాజమౌళి ఈ సినిమా విషయంలో ఎలాంటి లీక్స్ బయటకు రాకూడదని ఎంత ప్రయత్నిస్తున్నప్పటికీ, లీకులు బయటకు వస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమా ఫోటోలు, వీడియాలు లీకై వైరల్ గా మారాయి. ఒడిశాలో సెట్స్ దృశ్యాలు, మహేష్ బాబు కొత్త లుక్ వీడియోలు సోషల్ మీడియా తెగ చక్కర్లు కొడుతున్నాయి. దీనిపై చిత్ర బృందం కఠిన చర్యలు తీసుకుంటోంది. ఇదిలా ఉంటే తాజాగా రాజమౌళి ఓ ఇంట్రెస్టింగ్ వీడియో షేర్ చేశారు. ఈ వీడియో ఒడిశాలోని డియోమాలి ట్రెయిల్‌కు సంబంధించినది. ఈ వీడియోలో ఆయన ఒడిశాలోని అత్యంత ఎత్తైన శిఖరం డియోమాలికి సోలో ట్రెక్కింగ్ చేసిన అనుభవాన్ని పంచుకున్నారు. వీడియోలో అక్కడి అద్భుతమైన ప్రకృతి దృశ్యాలు కనిపిస్తాయి, శిఖరం పై నుంచి చూసే విశాలమైన దృశ్యం ఎంతో ఆకట్టుకుంటుందని రాజమౌళి పేర్కొన్నారు. అయితే, ఈ ట్రెయిల్‌లో చెత్త వేయడం వల్ల తనకు నిరాశ కలిగిందని రాజమౌళి వ్యాఖ్యానించారు. వీడియోలో శిఖరం పైన ప్లాస్టిక్ , ఇతర చెత్తా ను కూడా చూపించారు. ఆయన తన పోస్ట్‌లో ఇలా రాశారు: “డియోమాలి, ఒడిశాలోని అత్యంత ఎత్తైన,అద్భుతమైన శిఖరానికి సోలో ట్రెక్ చేయడం చాలా గొప్ప అనుభవం. పై నుంచి కనిపించే దృశ్యం అద్భుతంగా ఉంది. అయితే, ట్రెయిల్‌లో చెత్త చూసి చాలా బాధపడ్డాను. ఇలాంటి ప్రకృతి సౌందర్యం మనం గౌరవించాలి. కొంచెం  బాధ్యతతో ఈ ప్రదేశాలను కాపాడవచ్చు… ప్రతి సందర్శకుడు తమ చెత్తను తిరిగి తీసుకెళ్లాలి అంటూ రాసుకొచ్చారు రాజమౌళి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ల్యాండింగ్‌ టైమ్‌లో విమాన చక్రం మిస్‌.. ఆ తర్వాత ??
ల్యాండింగ్‌ టైమ్‌లో విమాన చక్రం మిస్‌.. ఆ తర్వాత ??
రీల్స్‌ చూస్తున్న యువకుడికి షాక్.. అతని మంచం వద్దకు వచ్చిన చిరుత
రీల్స్‌ చూస్తున్న యువకుడికి షాక్.. అతని మంచం వద్దకు వచ్చిన చిరుత
నెల్లూరులో కొత్త రకం దొంగలు.. చెడ్డీ గ్యాంగ్‌ను మించి..
నెల్లూరులో కొత్త రకం దొంగలు.. చెడ్డీ గ్యాంగ్‌ను మించి..
ఉదయాన్నే వాష్ రూమ్ లో వింత శబ్ధాలు.. దగ్గరకు వెళ్ళి చూడగా..
ఉదయాన్నే వాష్ రూమ్ లో వింత శబ్ధాలు.. దగ్గరకు వెళ్ళి చూడగా..
చేపల కోసం వల వేసిన మత్స్యకారులు.. వలలో చిక్కింది చూసి షాక్‌
చేపల కోసం వల వేసిన మత్స్యకారులు.. వలలో చిక్కింది చూసి షాక్‌
వారి పంట పండింది.. రూ.1 లక్షకు రూ.3 లక్షలు..
వారి పంట పండింది.. రూ.1 లక్షకు రూ.3 లక్షలు..
ఉదయాన్నే ఈ డ్రై ఫ్రూట్‌ తింటే అద్భుత లాభాలు మీ సొంతం
ఉదయాన్నే ఈ డ్రై ఫ్రూట్‌ తింటే అద్భుత లాభాలు మీ సొంతం
బాలిక నోట్లో ఏదో నల్లటి దారంలా కనిపించింది.. ఆస్పత్రికి వెళ్లగా..
బాలిక నోట్లో ఏదో నల్లటి దారంలా కనిపించింది.. ఆస్పత్రికి వెళ్లగా..
వేసవి లో మామిడి పండ్లు తినే ముందు.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి
వేసవి లో మామిడి పండ్లు తినే ముందు.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి
మీకు తమ్ముడిగా పుట్టినందుకు గర్వంగా ఉంది' పవన్ ఎమోషనల్‌
మీకు తమ్ముడిగా పుట్టినందుకు గర్వంగా ఉంది' పవన్ ఎమోషనల్‌