ఏంది మావ ఈ రచ్చ..! మాట మార్చిన తమన్.. ఆడేసుకుంటున్న మెగా ఫ్యాన్స్
సినిమాలతో పాటు టీవీ షోలు, రియాలిటీషోస్, స్పోర్ట్స్ ఈవెంట్లలోనూ సందడి చేస్తుంటాడు సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్. స్థార్ హీరోల సినిమాలకు మ్యూజిక్ అందిస్తూ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాడు తమన్. ప్రస్తుతం తమన్ టీవీ షోస్, రియాలిటీ షోస్, సినిమాలతో బిజీగా ఉన్నాడు. తాజాగా తమన్ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.

సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు తమన్ . సినిమా ఏదైనా సరే తమన్ తన సంగీతంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. ఇక మాస్ సినిమాలకు తమన్ అందించే సంగీతానికి సపరేట్ ఫ్యాన్స్ బేస్ ఉంది. ముఖ్యంగా బాలకృష్ణ సినిమాలకు తమన్ ఓ రేంజ్ లో బ్యాగ్రౌండ్ స్కోర్ అందిస్తారు. అఖండ, భగవంత్ కేసరి, డాకు మహారాజ్ సినిమాలతో తమన్ నందమూరి అభిమానుల అభిమాన మ్యూజిక్ డైరెక్టర్ అయ్యారు. ఫ్యాన్స్ ఇప్పుడు తమన్ ను నందమూరి థమన్ అని సరదాగా పిలుచుకుంటున్నారు. ప్రస్తుతం తమన్ చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇక రీసెంట్ గా భారీ బడ్జెట్ మూవీ గేమ్ ఛేంజర్ సినిమాకు మ్యూజిక్ అందించాడు. ఈ సినిమా మ్యూజిక్ విషయంలో తమన్ పై కొన్ని విమర్శలు వచ్చాయి.
గేమ్ ఛేంజర్ సినిమా డిజాస్టర్ అయిన విషయం తెలిసిందే. గేమ్ ఛేంజర్ సినిమా రిలీజ్ అవ్వక ముందు ఈ సినిమా సాంగ్స్ కు పర్లేదు మంచి రెస్పాన్స్ వచ్చింది. అప్పుడు తమన్ మ్యూజిక్ అదిరిపోయింది అంటూ చెప్పుకొచ్చారు. కానీ ఇప్పుడు తమన్ ప్లేట్ మార్చేశారు. రీసెంట్ గా ఓ డాన్స్ షోకు హాజరైన తమన్ షాకింగ్ కామెంట్స్ చేశారు. సినిమాలో ఉన్న స్టెప్పుల కంటే 1000 రెట్లు గొప్పగా చేశావ్.. అసలు ఒరిజినల్ వెర్షన్‌లో ఈ స్టెప్పులు ఉంటే బావుండేది” అంటూ కామెంట్స్ చేశారు.
దాంతో మెగా ఫ్యాన్స్ గట్టిగానే హర్ట్ అయ్యారు. దాంతో తమన్ పై ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు. తమన్ ను ట్రోల్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ లు షేర్ చేస్తున్నారు. గతంలో తమన్ గేమ్ ఛేంజర్ సాంగ్స్ ను పొగిడిన మాటలను, ఇప్పుడు విమర్శించినా పాటలను కలిపి సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. థియేటర్లో ఈ పాట రచ్చ రచ్చే… మాములుగా ఉండదు.. డాన్స్ కూడా ఇరగదీశారు అని రిలీజ్ కు ముందు చెప్పారు తమన్. ఇప్పుడు మాట మార్చి ఇలా డాన్స్ చేసి ఉంటే ఇంకోలా ఉండేది అంటూ కామెంట్స్ చేశారు తమన్.
Thaman mama emiti ee drama 😭😭
Shocking & flipped statements from Thaman on #GameChanger
Chusava @AlwaysRamCharan akhariki Thaman mowa kuda plate tippesadu!!
First producer,then director now Music director and you gave your 3.5 years of prime for them !!
#RamCharan pic.twitter.com/XjbyEiv4g4
— Vamc Krishna (@lyf_a_zindagi) March 19, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి