Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vishwambhara:మెగాస్టార్ సినిమాలో మరో స్టార్ హీరోయిన్.. త్రిషకు పోటీగా ఆ బ్యూటీ కూడా.?

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నారు. చివరిగా చిరంజీవి భోళాశంకర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కానీ ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర దారుణంగా బోల్తా కొట్టింది. ఈ సినిమాకు మెహర్ రమేష్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా తర్వాత చిరంజీవి నటిస్తున్న సినిమా కావడంతో విశ్వంభర సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Vishwambhara:మెగాస్టార్ సినిమాలో మరో స్టార్ హీరోయిన్.. త్రిషకు పోటీగా ఆ బ్యూటీ కూడా.?
Chiranjeevi
Follow us
Rajeev Rayala

|

Updated on: Mar 20, 2025 | 11:51 AM

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ 156వ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమాకు విశ్వంభర అనే ఆసక్తికర టైటిల్ ను ఖరారు చేశారు. ఈ మూవీ సోషియో-ఫాంటసీ జానర్‌లో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ సినిమా. ఈ చిత్రానికి “బింబిసార” ఫేమ్ మల్లిడి వశిష్ట దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ పతాకంపై వి. వంశీ కృష్ణా రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి, విక్రమ్ రెడ్డి నిర్మిస్తున్నారు. సంగీత దర్శకుడిగా ఆస్కార్ విజేత ఎం. ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. చిరంజీవి, కీరవాణి కాంబోలో వస్తున్న నాల్గవ చిత్రం ఇది . సినిమాటోగ్రఫీని ఛోటా కె. నాయుడు హ్యాండిల్ చేస్తుండగా, ఎడిటింగ్ కోటగిరి వెంకటేశ్వరరావు చేస్తున్నారు. యాక్షన్ సీక్వెన్స్‌లను రామ్-లక్ష్మణ్ బృందం రూపొందిస్తోంది.

విశ్వంభర అనే టైటిల్ 2024 సంక్రాంతి సందర్భంగా ఒక కాన్సెప్ట్ వీడియోతో అనౌన్స్ చేశారు. ఈ  వీడియోలో ఒక శక్తివంతమైన వస్తువు విశ్వంలో ప్రయాణించి భూమిపైకి చేరుకోవడం చూపించారు. ఈ సినిమా మైథలాజికల్, ఫాంటసీ అంశాలతో కూడిన కథతో తెరకెక్కుతోందని తెలుస్తుంది. మెగాస్టార్ ఈ సినిమాలో డ్యూయల్ షేడ్స్‌లో కనిపించే అవకాశం ఉందని అంటున్నారు. ఇక హీరోయిన్‌గా త్రిష కృష్ణన్ నటిస్తుంది. అయితే ఈ సినిమాలో డ్యూయల్ రోల్‌లో కనిపించవచ్చని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది.

ఇతర ముఖ్య పాత్రల్లో మీనాక్షి చౌదరి, సురభి, హర్షవర్ధన్ వంటి నటులు కనిపించనున్నారని తెలుస్తోంది. షూటింగ్ 2023 అక్టోబర్ 23న హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో మొదలైంది. ఈ సినిమా కోసం 13 విభిన్న సెట్లు వేశారని తెలుస్తుంది. సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. భారీ గ్రాఫిక్స్ మరియు VFX పనుల కారణంగా ఈ సినిమా పోస్ట్-ప్రొడక్షన్‌కు కొంత ఆలస్యం అవుతుందని తెలుస్తుంది. ముందుగా విడుదల తేదీని జనవరి 10, 2025న సంక్రాంతి సందర్భంగా ఖరారు చేశారు. అయితే VFX పనుల ఆలస్యం వల్ల ఆగస్టు 2025 తర్వాత విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది. ఈ సినిమా బడ్జెట్ దాదాపు 200 కోట్ల రూపాయలకు పైగా ఉంటుందని అంచనా. గ్రాఫిక్స్ , VFX కోసం సుమారు 100 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు సమాచారం. ఓవర్సీస్ హక్కులు సరిగమ సంస్థ 18 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. అయితే ఈ సినిమాలో నయనతార కూడా నటిస్తుందని టాక్ ఈ మధ్య వినిపించింది. ఆమె ఓ కీలక పాత్రలో కనిపిస్తుందని వార్తలు వచ్చాయి. కానీ విశ్వంభర సినిమాలో ఆమె నటించడం లేదని తెలుస్తుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ల్యాండింగ్‌ టైమ్‌లో విమాన చక్రం మిస్‌.. ఆ తర్వాత ??
ల్యాండింగ్‌ టైమ్‌లో విమాన చక్రం మిస్‌.. ఆ తర్వాత ??
రీల్స్‌ చూస్తున్న యువకుడికి షాక్.. అతని మంచం వద్దకు వచ్చిన చిరుత
రీల్స్‌ చూస్తున్న యువకుడికి షాక్.. అతని మంచం వద్దకు వచ్చిన చిరుత
నెల్లూరులో కొత్త రకం దొంగలు.. చెడ్డీ గ్యాంగ్‌ను మించి..
నెల్లూరులో కొత్త రకం దొంగలు.. చెడ్డీ గ్యాంగ్‌ను మించి..
ఉదయాన్నే వాష్ రూమ్ లో వింత శబ్ధాలు.. దగ్గరకు వెళ్ళి చూడగా..
ఉదయాన్నే వాష్ రూమ్ లో వింత శబ్ధాలు.. దగ్గరకు వెళ్ళి చూడగా..
చేపల కోసం వల వేసిన మత్స్యకారులు.. వలలో చిక్కింది చూసి షాక్‌
చేపల కోసం వల వేసిన మత్స్యకారులు.. వలలో చిక్కింది చూసి షాక్‌
వారి పంట పండింది.. రూ.1 లక్షకు రూ.3 లక్షలు..
వారి పంట పండింది.. రూ.1 లక్షకు రూ.3 లక్షలు..
ఉదయాన్నే ఈ డ్రై ఫ్రూట్‌ తింటే అద్భుత లాభాలు మీ సొంతం
ఉదయాన్నే ఈ డ్రై ఫ్రూట్‌ తింటే అద్భుత లాభాలు మీ సొంతం
బాలిక నోట్లో ఏదో నల్లటి దారంలా కనిపించింది.. ఆస్పత్రికి వెళ్లగా..
బాలిక నోట్లో ఏదో నల్లటి దారంలా కనిపించింది.. ఆస్పత్రికి వెళ్లగా..
వేసవి లో మామిడి పండ్లు తినే ముందు.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి
వేసవి లో మామిడి పండ్లు తినే ముందు.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి
మీకు తమ్ముడిగా పుట్టినందుకు గర్వంగా ఉంది' పవన్ ఎమోషనల్‌
మీకు తమ్ముడిగా పుట్టినందుకు గర్వంగా ఉంది' పవన్ ఎమోషనల్‌