AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kantara 2: కాంతార 2 నుంచి కనకవతి వచ్చేసింది.. మహారాణి లుక్‌లో వావ్ అనిపించిన స్టార్ హీరోయిన్

కన్నడ స్టార్ హీరో రిషభ్ శెట్టి స్వీయ దర్వకత్వంలో నటించిన చిత్రం 'కాంతార: చాప్టర్ 1' . గతంలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ 'కాంతార' చిత్రానికి ఇది ప్రీక్వెల్. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ పాన్ ఇండియా మూవీ త్వరలోనే రిలీజ్ కానుంది. అయితే ఇప్పటివరకు ఈ చిత్రంలో హీరోయిన్ ఎవరన్నది తెలియరాలేదు.

Kantara 2: కాంతార 2 నుంచి కనకవతి వచ్చేసింది.. మహారాణి లుక్‌లో వావ్ అనిపించిన స్టార్ హీరోయిన్
Kantara 2 Movie
Basha Shek
|

Updated on: Aug 08, 2025 | 12:07 PM

Share

‘కాంతార’ సినిమాలో కన్నడ బ్యూటీ సప్తమి గౌడ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు తెచ్చుకుందీ అందాల తార. ఇప్పుడు తెలుగుతో పాటు పలు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంటోంది సప్తమి గౌడ. ఇదిలా ఉంటే కాంతార సినిమాకు ప్రీక్వెల్ గా తెరకెక్కుతోన్న ‘కాంతార: చాప్టర్ 1’ లో హీరోయిన్ ఎవరో ఇప్పటివరకు వెల్లడించలేదు మేకర్స్. ఇప్పుడు ఈ విషయంపై చిత్ర బృందం నుంచి అధికారిక అప్‌డేట్ వచ్చింది. వరలక్ష్మి వ్రతాన్ని పురస్కరించుకుని కాంతార 2 నుంచి కనకవతి పాత్ర పోస్టర్ విడుదలైంది. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంటోన్న రుక్మిణి వసంత్ ఈ పాత్రను పోషిస్తోంది. ‘కాంతార: చాప్టర్ 1′ విడుదలకు కొన్ని నెలలే మిగిలి ఉంది. అందుకే, ఈ సినిమాను భారీ స్థాయిలో ప్రమోట్ చేయడానికి చిత్ర బృందం సిద్ధంగా ఉంది. ఇందులో భాగంగా, ఈ సినిమా హీరోయిన్‌ను పరిచయం చేశారు. సప్త సాగరాలు దాటి సినిమాతో ఆడియెన్స్ మనసులు దోచేసిన రుక్మిణీ వసంత్ ఈ సినిమాలో భాగం కావడంతో కాంతార 2పై అంచనాలు అమాంతం పెరిగాయి. ఈ సినిమాలో రుక్మిణి వసంత్ యువరాణిలా కనిపిస్తోంది. సినిమాలో ఆమె పాత్ర ఏంటన్నది సస్పెన్స్ గా ఉంది. కొత్తగా రిలీజైన పోస్టర్ వెనుక భాగాన్ని చూస్తే, అది రాజ సభలా కనిపిస్తుంది. అలాగే, ఇది కదంబ కాలం నాటి కథ కాబట్టి, రుక్మిణి రాణి పాత్ర పోషిస్తుందా లేదా యువరాణి పాత్ర పోషిస్తుందా అనేది తెలియాల్సి ఉంది.

కాంతార: చాప్టర్ 1’ సినిమాలో హీరోయిన్ ఎవరు అనే దానిపై చాలా చర్చలు జరిగాయి. ఎట్టకేలకు ఇప్పుడు ఈ ప్రశ్నకు సమాధానం దొరికింది. రుక్మిణి వసంత్ కు పాన్-ఇండియా స్థాయిలో డిమాండ్ ఉంది. ఆమె ఇప్పటికే చాలా సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. ‘కాంతార: చాప్టర్ 1’ చిత్రానికి అరవింద్ ఎస్. కశ్యప్ సినిమాటోగ్రఫీ అందించగా, బి. అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందించారు. హోంబాలే ఫిల్మ్స్ పతాకంపై విజయ్ కిరగందూర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం అక్టోబర్ 2న కన్నడ, తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, బెంగాలీ, ఇంగ్లీష్ భాషలలో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

ఇవి కూడా చదవండి

కాంతార 2 సినిమాలో రుక్మిణీ వసంత్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

నవ్వితే పోయేదేం లేదు.. అనారోగ్యం తప్ప..! అందుకే హాయిగా నవ్వుకోండి
నవ్వితే పోయేదేం లేదు.. అనారోగ్యం తప్ప..! అందుకే హాయిగా నవ్వుకోండి
గ్రామీణ ఉపాధి హామీ పథకం రద్దు.. కేంద్రం షాకింగ్ డెసిషన్!
గ్రామీణ ఉపాధి హామీ పథకం రద్దు.. కేంద్రం షాకింగ్ డెసిషన్!
బాలీవుడ్‌ ఎంట్రీపై ఎగ్జైటింగ్‌గా యంగ్ బ్యూటీ!
బాలీవుడ్‌ ఎంట్రీపై ఎగ్జైటింగ్‌గా యంగ్ బ్యూటీ!
దేశంలోనే అద్భుతం.. ఈ గ్రామంలో ఒక్క ఇంట్లో కూడా వంట చెయ్యరు..
దేశంలోనే అద్భుతం.. ఈ గ్రామంలో ఒక్క ఇంట్లో కూడా వంట చెయ్యరు..
భర్త కాదు.. కాలయముడు.. భార్యను చంపి మృతదేహాంతో..
భర్త కాదు.. కాలయముడు.. భార్యను చంపి మృతదేహాంతో..
క్రిప్టో ఇన్వెస్టర్లకు అలర్ట్.. 2026లో ఈ 5 తప్పులు చేస్తే భారీ న
క్రిప్టో ఇన్వెస్టర్లకు అలర్ట్.. 2026లో ఈ 5 తప్పులు చేస్తే భారీ న
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది
హోటల్ స్టైల్ గ్రీన్ చికెన్ కర్రీ.. టేస్టీగా మీ ఓన్ కిచెన్‎లోనే..
హోటల్ స్టైల్ గ్రీన్ చికెన్ కర్రీ.. టేస్టీగా మీ ఓన్ కిచెన్‎లోనే..
చలి పెడుతుందని రూమ్ హీటర్ వాడుతున్నారా ? ఈ విషయాలు తెలుసుకోండి
చలి పెడుతుందని రూమ్ హీటర్ వాడుతున్నారా ? ఈ విషయాలు తెలుసుకోండి
ఇకపై ఆధార్ కార్డు అవసరం లేదు.. కొత్త ఆధార్ యాప్.. ప్రత్యేకత ఏంటి?
ఇకపై ఆధార్ కార్డు అవసరం లేదు.. కొత్త ఆధార్ యాప్.. ప్రత్యేకత ఏంటి?