Rajamouli: ఈజీ మనీ కోసం అడ్డదారులు తొక్కుతున్నారు.. పిల్లలకు కష్టమంటే ఏమిటో నేర్పించాలి: డైరెక్టర్ రాజమౌళి

బర్‌ సెక్యూరిటీ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలన్నారు డైరెక్టర్ రాజమౌళి. హైదరాబాద్‌లో జరిగిన హ్యాక్‌ సమిట్‌లో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. సైబర్‌ మోసాలకు సామాన్యుడి నుంచి సెలబ్రిటీ వరకు బాధితులే అని అన్నారు. డబ్బులు కావాలని తనకు కూడా చాలా ఫేక్‌ కాల్స్‌ వచ్చాయన్నారు రాజమౌళి.

Rajamouli: ఈజీ మనీ కోసం అడ్డదారులు తొక్కుతున్నారు.. పిల్లలకు కష్టమంటే ఏమిటో నేర్పించాలి: డైరెక్టర్ రాజమౌళి
Rajamouli

Updated on: Apr 13, 2023 | 7:08 AM

అందుబాటులోకి వస్తున్న అద్భుతమైన టెక్నాలజీతో పాటే.. ఇంటర్నెట్ బూచోళ్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నారు. ఫోన్‌కు వచ్చే ఫ్రాడ్ లింక్ పొరపాటున క్లిక్ చేసినా.. ఎవరైనా ఫోన్ చేస్తే ఓటీపీ చెప్పిన ఇక అకౌంట్లో డబ్బులు గల్లంతే.. అలాంటి సైబర్ నేరగాళ్ల బాధితుల కోసం కీలక సూచనలు చేశారు డైరెక్టర్ రాజమౌళి. సైబర్‌ సెక్యూరిటీ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలన్నారు డైరెక్టర్ రాజమౌళి. హైదరాబాద్‌లో జరిగిన హ్యాక్‌ సమిట్‌లో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. సైబర్‌ మోసాలకు సామాన్యుడి నుంచి సెలబ్రిటీ వరకు బాధితులే అని అన్నారు. డబ్బులు కావాలని తనకు కూడా చాలా ఫేక్‌ కాల్స్‌ వచ్చాయన్నారు రాజమౌళి. మనం డబ్బులు ఎవరికి ఆన్‌లైన్‌లో పంపిస్తున్నామో ముందుగానే ఫోన్‌లో నిర్ధారించుకున్న తరువాతే ట్రాన్స్‌ఫర్‌ చేయాలని సూచించారు. సైబర్‌ నేరాల పట్ల ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అవసరముందన్నారీ స్టార్ డైరెక్టర్.

అవగాహన లేకపోవడం వల్లే..

80 శాతం నేరాలు ప్రజల్లో అవగాహన లేకపోవడం వల్లే జరుగుతున్నాయన్నారు రాజమౌళి. అమాయకులను టార్గెట్‌గా చేసుకుని.. సైబర్‌ నేరగాళ్లు రకరకాలుగా బురిడీ కొట్టిస్తున్నారని అభిప్రాయపడ్డారు. తమ షూటింగ్‌ సెట్‌లో ఉన్న ఓ వ్యక్తికి సైబర్‌ నేరగాళ్ల నుంచి కాల్‌ వచ్చిందన్నారు. బ్యాంకు మేనేజర్‌ అని చెప్పడంతో ఓటీపీ చెప్పాడు. 10 నెలల వేతనం అతని బ్యాంకు ఖాతా నుంచి కొట్టేశారన్నారు. ఒక్కసారి డబ్బు పోయాక.. అది కొట్టేసిన నేరగాన్ని పట్టుకోవడం చాలా కష్టమన్నారు. డబ్బుపై దురాశతో సైబర్‌ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. కష్టపడి సంపాదించే డబ్బుతో వచ్చే ఆనందం వేరు. ఈజీగా వచ్చే డబ్బు మోసానికి దారి తీస్తుంది. చిన్నప్పటి నుంచే మన పిల్లలకు కష్టం అంటే ఏంటో నేర్పించాలి. సైబర్‌ నేరాలపై తెలుగులో ప్రజలకు అవగాహన కలిగేలా విస్తృత ప్రచారం చేయాలంటున్నారు రాజమౌళి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..