AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RRR: జపాన్‌లో 200డేస్ కంప్లీట్ చేసుకున్న ఆర్.ఆర్.ఆర్.. ఇది కదా తెలుగు సినిమా స్థాయి అంటే

థియేటర్లలో 50 రోజుల రన్‌ గగనంగా మారుతున్న ఈ రోజుల్లో మనది కాని దేశంలో అన్ని రోజులు ఆడటం మామూలు విషయం కాదంటున్నారు క్రిటిక్స్. ఏది ఏమైనా ఆర్.ఆర్.ఆర్ సినిమా దేశం మీసం మెలేసేలా చేసింది.

RRR: జపాన్‌లో 200డేస్ కంప్లీట్ చేసుకున్న ఆర్.ఆర్.ఆర్.. ఇది కదా తెలుగు సినిమా స్థాయి అంటే
Ram Charan, Alia Bhatt and Jr NTR in a still from RRR.
Ram Naramaneni
|

Updated on: May 10, 2023 | 1:15 PM

Share

ఆల్రెడీ రిలీజ్‌ అయి సక్సెస్‌ అయిన సినిమాలు నిదానంగా ఫేడవుట్‌ అవుతూ ఉంటాయి. కానీ ఎప్పటికప్పుడు ఫ్రెష్‌గా పలకరిస్తూ ఉంది ట్రిపుల్‌ ఆర్‌. ఆస్కార్‌ తెచ్చిన ముచ్చటని జనాలు ఇంకా మర్చిపోనేలేదు. అప్పుడే ఇంకో రికార్డుతో ప్రేక్షకులను పలకరించింది ట్రిపుల్‌ ఆర్‌. స్టార్‌ రైటర్‌ విజయేంద్రప్రసాద్‌ ట్రిపుల్‌ కథ రాసిన క్షణాలను గుర్తుచేసుకుంటున్నారు ఫ్యాన్స్. ప్రపంచవ్యాప్తంగా ట్రిపుల్‌ ఆర్‌ క్రియేట్‌ చేస్తున్న రికార్డులను, కొల్లగొడుతున్న పైసలను చూస్తుంటే ఇండియన్‌ సినిమా కడుపునిండిపోతోందని అంటున్నారు. 2022లో హయ్యస్ట్ గ్రాసింగ్‌ ఇండియన్‌ ఫిల్మ్ గా రికార్డు ఉంది ట్రిపుల్‌ ఆర్‌కి. ఇదే కేటగిరీలో ఆల్‌ టైమ్‌ రికార్డుల్లో మాత్రం మూడో ప్లేస్‌లో ఉంది ట్రిపుల్‌ ఆర్‌.

ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ నటించిన ట్రిపుల్‌ ఆర్‌ లేటెస్ట్ గా జపాన్‌ బాక్సాఫీస్‌ దగ్గర 200 రోజుల్ని పూర్తి చేసుకుంది. థియేటర్లలో 50 రోజుల రన్‌ గగనంగా మారుతున్న ఈ రోజుల్లో మనది కాని దేశంలో అన్ని రోజులు ఆడటం మామూలు విషయం కాదంటున్నారు క్రిటిక్స్. ఇండియాలో ఇప్పటిదాకా వెయ్యి కోట్లు దాటిన సినిమాలు ఐదే. వాటిలో ట్రిపుల్‌ ఆర్‌ది థర్డ్ ప్లేస్‌. ఇప్పటికే జపాన్‌ మార్కెట్లో 119 కోట్లు కొల్లగొట్టింది ఈ మూవీ. ఇదే జోరు కొనసాగితే వరల్డ్ వైడ్‌ కలెక్షన్ల టోటల్‌ పెరిగే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.

అందరి దృష్టి రెయిజ్‌ అవుతున్న గ్రాండ్‌ టోటల్‌ మీదుంటే, మరికొందరు మాత్రం ట్రిపుల్‌ ఆర్‌ సీక్వెల్‌ ఎప్పుడు ఉండొచ్చు అని ఆరా తీస్తున్నారు. ఈ ఆరాలు మన దగ్గరతో పోలిస్తే కంట్రీ ఔట్‌సైడ్‌ నుంచే ఎక్కువగా వినిపిస్తున్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..