Shobana: నటి శోభన ఇంట్లో చోరీ.. దొంగ దొరికిన తర్వాత ఆమె చేసిన పనికి ఫిదా అవుతున్న ఫ్యాన్స్
శోభన కేవలం నటి మాత్రమే కాదు. ప్రముఖ భరతనాట్య కళాకారిణి కూడా.. చాలా కాలం సినిమాల్లో హీరోయిన్ గా నటించిన శోభన ఆతర్వాత సినిమాలకు బ్రేక్ ఇచ్చారు. ఇక ఇప్పుడు ఆమె సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టారు. అడపాదడపా సినిమాలు చేస్తున్నారు శోభన. ఇదిలా ఉంటే తాజాగా శోభన ఇంట్లో చోరీ జరిగింది. చెన్నైలోని తేనాంపేటలో శోభన ఇంట్లో చోరీ జరిగింది. చెన్నై లోకి శ్రీమాన్ శ్రీనివాసకాలనీలో తల్లితో కలిసి ఉంటున్నారు శోభన.
అలనాటి అందాల తారల్లో ఎవరగ్రీన్ బ్యూటీఫుల్ హీరోయిన్ ఎవరు అంటే టక్కున చెప్పే పేరు శోభన. ఎన్నో అంద్భుతమైన సినిమాల్లో నటిని ప్రేక్షకుల గుండెల్లో స్థానం సంపాదించుకున్నారు శోభన. శోభన కేవలం నటి మాత్రమే కాదు. ప్రముఖ భరతనాట్య కళాకారిణి కూడా.. చాలా కాలం సినిమాల్లో హీరోయిన్ గా నటించిన శోభన ఆతర్వాత సినిమాలకు బ్రేక్ ఇచ్చారు. ఇక ఇప్పుడు ఆమె సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టారు. అడపాదడపా సినిమాలు చేస్తున్నారు శోభన. ఇదిలా ఉంటే తాజాగా శోభన ఇంట్లో చోరీ జరిగింది. చెన్నైలోని తేనాంపేటలో శోభన ఇంట్లో చోరీ జరిగింది. చెన్నై లోకి శ్రీమాన్ శ్రీనివాసకాలనీలో తల్లితో కలిసి ఉంటున్నారు శోభన. అయితే తన తల్లికి సపర్యలు చేసేందుకు ఓ మహిళను పని మనిషిని నియమించుకున్నారు శోభన.
అయితే గతకొద్ది రోజులుగా ఆమె తల్లి దగ్గర ఉన్న డబ్బులు చోరీకి గురవుతున్నట్టు తెలుసుకున్నారు శోభన. అయితే ఇంట్లోకి ఇతర వ్యక్తులు వచ్చే అవకాశం లేకపోవడంతో.. పని మనిషిని ప్రశ్నించగా ఆమె తనకు ఏం తెలియదు అని సమాధానం ఇవ్వడంతో పాటు.. ఆ డబ్బు తీయలేదని బుకాయించడంతో పోలీసులను ఆశ్రయించారు శోభన
స్థానిక తేనాంపేట పోలీస్‌స్టేషన్ ఫిర్యాదు చేశారు శోభన. దాంతో రంగంలోకి దిగిన పోలీసులు పనిమనిషిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిచారు. పోలీసులు తమ స్టైల్ లో అడగడంతో గత నెల నుంచి రూ 41 వేల వరకు దొంగిలించినట్టు ఒప్పుకుంది ఆ పనిమనిషి. అయితే పేదరికం కారణంగానే డబ్బులు తీయాల్సి వచ్చిందని.. తనను పనిలో నుంచి తీసెయ్యవద్దని శోభనను వేడుకుందట ఆ పనిమనిషి. దాంతో శోభన ఆమె దొంగలించిన డబ్బును తన జీతం లోనుంచి కట్ చేసి ఆమెను తిరిగి పనిలో పెట్టుకున్నారట. శోభన మంచి మనసుకు ప్రశంసలు కురిపిస్తున్నారు ఫ్యాన్స్..