Tollywood: అప్పుడు మాములుగా.. ఇప్పుడు మతి పోగొట్టేలా.. గుర్తుపట్టారా..?
హీరోయిన్స్ కొన్నిసార్లు ప్రేక్షకులను భలే ఆశ్చర్యపరుస్తూ ఉంటారు. వారు వీరేనా అనేంతగా వారి మేకోవర్ ఉంటుంది. మంచి అవకాశాలు అందిపుచ్చుకునేందుకు.. బొద్దుగా తయారవ్వడానికి అయినా రెడీ.. చిక్కి నాజూగ్గా అవ్వడానికి కూడా రెడీ అంటూ సిగ్నల్స్ ఇస్తూ ఉంటారు. ఈ హీరోయిన్ కూడా అలానే....

తెలుగులో ఇప్పటివరకు పూర్తి స్థాయిలో ఒకే ఒక్క సినిమాలో మాత్రమే నటించింది. అయితేనేం.. కుర్రకారుకు తిక్క లేపింది. అమ్మడికి ఉన్న ఫ్యాన్ బేస్ అంతా ఇంతా కాదు.. ఇన్ స్టాలో ఈ సుందరాంగికి 2.3 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. ఇక మత్తెక్కించే ఫోటోలు సోషల్ మీడియాలో వదులుతూ ఈ చిన్నది చేసే హంగామా అంతా కాదు. నీ కాళ్లను వదలనన్నవి చూడే నా కళ్లు అంటూ పాటలు అందుకుంటారు కుర్రాళ్లు. ఇంతకీ తనెవరో మీరు గుర్తుపట్టారా..? ఇంకా లేదా.. అయితే మేమే చెప్పేస్తాంలేండి…
తన మరెవరో కాదు.. రెబ మోనికా జాన్.. పేరు చెప్పినా చాలామంది గుర్తుపట్టకపోవచ్చులే. ‘సామజవరగమన’ చిత్ర హీరోయిన్ అంతే అందరూ ఈజీగా గుర్తుపడతారు. శ్రీవిష్ణు హీరోగా వచ్చిన ఈ సినిమా మంచి హిట్ అయింది. ఇందులో సరయు పాత్రలో రెబ జాన్ పక్కింటమ్మాయ్‌గా తెలుగు వాళ్లకు బాగా కనెక్ట్ అయింది. తమిళ, మలయాళ చిత్రాల్లో నటించిన ఈ బ్యూటీ.. తెలుగులో నటించింది రెండు సినిమాలే. ‘భూ’, ‘సామజవరగమన’. మ్యాడ్ స్క్వేర్‌లో అమ్మడు స్పెషల్ సాంగ్‌తో సర్‌ప్రైజ్ చేయబోతుంది. ఇక మరోసారి శ్రీ విష్ణు సరసన ‘మృత్యుంజయ్’ చిత్రంలో ప్రస్తుతం నటిస్తోంది.
‘జకబింటే స్వర్గరాజ్యం’ అనే మలయాళ చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది రెబ మోనికా జాన్. ఫోరెన్సిక్’, ‘జరుగండి’, ‘బిగిల్’, ‘మైఖేల్’, ‘ఎఫ్.ఐ.ఆర్’ లాంటి విజయంతవమైన చిత్రాల్లో నటించింది. కెరీర్ తొలినాళ్లలో ట్రెడిషనల్ మోడ్‌లో కనిపించిన ఈ భామ.. ఇప్పుడు కిర్రాక్ లుక్స్‌తో కవ్విస్తుంది. తన లేటెస్ట్ చిత్రాలపై ఓ లుక్కేద్దాం పదండి… .
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..