- Telugu News Photo Gallery Cinema photos Meet This Actress Done 7 Movies In Telugu Only One Block Buster Hit, She Is Heroine Neha Shetty
Tollywood: 7 సినిమాల్లో ఒక్క బ్లాక్ బస్టర్.. యూత్‌లో విపరీతమైన క్రేజ్.. దెబ్బకు ఫెడౌట్.. ఈ బ్యూటీ ఎవరంటే..
తెలుగు సినీపరిశ్రమలో ఆమె క్రేజీ హీరోయిన్. ఫస్ట్ మూవీ డిజాస్టర్.. కానీ అవకాశాలు క్యూ కట్టాయి. చివరకు యంగ్ హీరోతో జతకట్టి బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టింది. దెబ్బకు ఇండస్ట్రీలో ఈ బ్యూటీకి క్రేజ్ ఒక్కసారిగా పెరిగింది. కానీ ఆ మూవీ తర్వాత అవకాశాలు క్యూ కడతాయి అనుకుంటే.. సినీరంగంలో కనిపించకుండా పోయింది. ఇంతకీ ఆమె ఎవరంటే..
Updated on: Mar 20, 2025 | 5:22 PM

తెలుగు కుర్రకారుకు ఇష్టమైన హీరోయిన్. ఒకే ఒక్క సినిమాతో ఇండస్ట్రీలో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. కట్ చేస్తే సోషల్ మీడియాలో ఓ రేంజ్ ఫాలోయింగ్ వచ్చేసింది. ఆ తర్వాత తెలుగులో ఆఫర్స్ తగ్గిపోయాయి. అలాగే ఈ ముద్దుగుమ్మ నటించిన చిత్రాలన్నీ డిజాస్టర్స్ కావడంతో దెబ్బకు ఫెడౌట్ అయిపోయింది.

ఆమె మరెవరో కాదు.. హీరోయిన్ నేహా శెట్టి. మెహబుబా సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఫస్ట్ మూవీ డిజాస్టర్ కావడంతో ఈఅమ్మడుకు అంతగా గుర్తింపు రాలేదు. ఆ తర్వాత ఒకటి రెండు చిత్రాల్లో నటించి మెప్పించినప్పటికీ అంతగా ఫేమస్ కాలేదు.

కానీ తెలుగు యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ సరసన నటించిన డిజే టిల్లు మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఈ సినిమాతో నేహా శెట్టి పేరు మారుమోగింది. ఈ ఒక్క సినిమాతోనే ఇండస్ట్రీలో స్టార్ డమ్ సంపాదించుకుంది ఈ అమ్మడు.

అలాగే సోషల్ మీడియాలో ఓ రేంజ్ ఫాలోయింగ్ వచ్చేసింది. ఆ తర్వాత తెలుగులో పలు చిత్రాల్లో నటించింది. కానీ ఆ సినిమాలు బాక్సాఫీస్ వద్ద అంతగా హిట్ కాలేదు. దీంతో నేహా శెట్టికి నెమ్మదిగా అవకాశాలు తగ్గిపోయాయి.

అలాగే సోషల్ మీడియాలో ఓ రేంజ్ ఫాలోయింగ్ వచ్చేసింది. ఆ తర్వాత తెలుగులో పలు చిత్రాల్లో నటించింది. కానీ ఆ సినిమాలు బాక్సాఫీస్ వద్ద అంతగా హిట్ కాలేదు. దీంతో నేహా శెట్టికి నెమ్మదిగా అవకాశాలు తగ్గిపోయాయి.





























