Pushpa Movie: అల్లు అర్జున్ ‘పుష్ఫ’ చిత్రాన్ని ఒప్పుకోవడానికి రూ. లక్షన్నర కోట్లే కారణమా..?
Reason Behind Bunny Accept Pushpa Movie: అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో 'పుష్ఫ' సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై ఇండస్ట్రీలో భారీ అంచనాలున్నాయి. ఇదిలా ఉంటే...
Reason Behind Bunny Accept Pushpa Movie: అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో ‘పుష్ఫ’ సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై ఇండస్ట్రీలో భారీ అంచనాలున్నాయి. ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించి నిత్యం ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూనే ఉంది. మొన్నటి వరకు ఈ సినిమాకు షూటింగ్ స్పాట్‌లో వీడియోలు లీక్ అవుతూ నిత్యం వార్తల్లో నిలిచింది. ఇదిలా ఉంటే తాజాగా మరో వార్త ఆసక్తిని రేకెత్తిస్తోంది. సుకుమార్ కథ చెప్పగానే బన్నీ ఈ చిత్రాన్ని ఒప్పుకోవడానికి ఓ బలమైన కారణం ఉందట. అదేంటంటే.. ఎర్రచందనం అక్రమ రవాణ విలువ ఏకంగా రూ. లక్షన్నర కోట్లు ఉంటుందని సుకుమార్ చెప్పగానే బన్నీకి ఆ పాయింట్ బాగా కనెక్ట్ అయ్యిందంట. ఇంత పెద్ద ఎత్తున అక్రమం జరుగుతుందా అని భావించిన బన్నీ వెంటనే సినిమా చేయడానికి ఓకే చెప్పాడని సమాచారం. ఇక ఇదిలా ఉంటే ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో దర్శకుడు సుకుమార్ ఇదే విషయమై మాట్లాడుతూ.. ప్రపంచంలో శేషాచల అడవుల్లోనే ఎర్ర చందనం దొరుకుతుంది. ఈ ఎర్రచందనంను స్మగ్లింగ్ చేస్తుంటారు. ఇప్పటి వరకు లక్షన్నర కోట్ల రూపాయల విలువైన ఎర్ర చందనం చైనా, జపాన్ వంటి విదేశాలకు ఎగుమతి అయ్యిందని చెప్పుకొచ్చాడు. మరి విడుదలకు ముందే ఇలా సంచలనాలు సృష్టస్తున్న ఈ సినిమా రిలీజ్ తర్వాత ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.
Also Read: Hero Nithin: హీరో నితిన్‌ను ఏమైనా అడగాలనుకుంటున్నారా..? అయితే ఇన్‌స్టాగ్రామ్‌తో సిద్ధంగా ఉండండి..