Hero Nithin: హీరో నితిన్‌ను ఏమైనా అడగాలనుకుంటున్నారా..? అయితే ఇన్‌స్టాగ్రామ్‌తో సిద్ధంగా ఉండండి..
Hero Nithin Coming To Live In Instagram: హీరో నితిన్‌తో మాట్లాడాలనుకుంటున్నారా.? అతని కెరీర్, సినిమాలు, వ్యక్తిగత విషయాల గురించి ప్రశ్నించాలనుకుంటున్నారా? అయితే ఈరోజు (బుధవారం) సాయంత్రం..
Hero Nithin Coming To Live In Instagram: హీరో నితిన్‌తో మాట్లాడాలనుకుంటున్నారా.? అతని కెరీర్, సినిమాలు, వ్యక్తిగత విషయాల గురించి ప్రశ్నించాలనుకుంటున్నారా? అయితే ఈరోజు (బుధవారం) సాయంత్రం ఇన్‌స్టాగ్రామ్‌లో సిద్ధంగా ఉండండి. ఎందుకంటే నితిన్ ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లోకి రానున్నాడు. టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ ఈ ఏడాది వరుస సినిమాలతో ఫుల్ జోష్ మీదున్నాడు. ఇప్పటికే మూడు సినిమాల తేదీలను ప్రకటించాడు నితిన్. వీటిలో మొదటగా విడుదల కాబోతోంది ‘చెక్’ సినిమా. చెస్ ఆట నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా ఈ నెల 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రచారంలో భాగంగా నితిన్ సరికొత్త పంథాను ఎంచుకున్నాడు నితిన్. ముఖ్యంగా యువతను ఆకట్టుకునే క్రమంలో ఇన్‌స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో ముచ్చటించడానికి సిద్ధమయ్యాడు. ఈరోజు సాయంత్రం అభిమానులతో మాట్లాడడానికి ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లోకి వస్తున్నట్లు తెలిపాడీ యంగ్ హీరో. ఈరోజు సాయంత్రం ఆరు గంటలకు లైవ్‌లోకి రానున్నట్లు తెలిపిన నితిన్.. మీతో ఎప్పుడెప్పుడు మాట్లాడుతానా.. అని ఎదురుచూస్తున్నాను అంటూ క్యాప్షన్ రాసుకొచ్చాడు. మరి ఇంకెందుకు ఆలస్యం.. మీ అభిమాన హీరోతో మాట్లాడడాని సిద్ధం కాండి.
View this post on Instagram
Also Read: నిర్మాతలకు షాక్ ఇస్తున్న టాలీవుడ్ హీరోలు.. భారీగా రెమ్యూనరేషన్ పెంచిన మరో యంగ్ స్టార్…