నిర్మాతలకు షాక్ ఇస్తున్న టాలీవుడ్ హీరోలు.. భారీగా రెమ్యూనరేషన్ పెంచిన మరో యంగ్ స్టార్…

టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోలు తమ రెమ్యునరేషన్ పెంచుతూ నిర్మాతలకు షాక్ ఇస్తున్నారు. ఇటీవలే మాస్ మాహారాజా రవితేజ భారీగానే పారితోషకం తీసుకుంటున్లుగా వార్తలు వచ్చాయి.

నిర్మాతలకు షాక్ ఇస్తున్న టాలీవుడ్ హీరోలు.. భారీగా రెమ్యూనరేషన్ పెంచిన మరో యంగ్ స్టార్...
Follow us
Rajitha Chanti

|

Updated on: Feb 24, 2021 | 1:45 PM

టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోలు తమ రెమ్యునరేషన్ పెంచుతూ నిర్మాతలకు షాక్ ఇస్తున్నారు. ఇటీవలే మాస్ మాహారాజా రవితేజ భారీగానే పారితోషకం తీసుకుంటున్లుగా వార్తలు వచ్చాయి. తాజాగా తెరపైకి మరో యంగ్ హీరో పేరు వస్తుంది. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్‌ లేకుండానే వెండితెర మీద అడుగు పెట్టాడు హీరో నాగశౌర్య. తనను తాను నిరూపించుకోవడానికి దాదాపు ఐదేళ్లు కష్టపడ్డాడు. చిన్న చిన్న సినిమాలు చేస్తున్న సమయంలోనే అనుహ్యంగా గుసగుసలాడే సినిమా ఛాన్స్ కొట్టేసాడు ఈ యంగ్ హీరో. ఆ సినిమా సూపర్ హిట్ కావడం టాప్ హీరోగా ఎదిగాడు నాగశౌర్య. తాజాగా ఈ హీరో తన రెమ్యూనరేషన్‏ను భారీగా పెంచినట్లుగా టాక్ వినిపిస్తోంది.

వైవిధ్యభరితమైన సినిమాల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు నాగశౌర్య. ఇటీవలే విడుదలైన అశ్వథ్థామ సినిమా ఆశించినంత విజయం సాధించలేకపోయింది. అయినప్పటికీ నాగశౌర్య వరుస ఆఫర్లను అందుకుంటూ ఫుల్ బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం నాగశౌర్య ఒక్క సినిమాల్లో నటించేందుకు రూ. నాలుగు కోట్లను తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. అందుకు తక్కువగా ఇస్తే తీసుకోనని నిర్మాతలకు ముందే చెప్పేస్తున్నాడట ఈ యంగ్ హీరో. దీంతో కథ చెప్పడానికి వెళ్లిన దర్శకులు ఈ యంగ్‌ హీరో డిమాండ్‌ చేస్తున్న రెమ్యూనరేషన్‌ విని ఒక్కసారిగా షాకవుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ హీరో ‘లక్ష్య’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా కోసం నాగశౌర్య శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకునేందుకు తీవ్ర కసరత్తులే చేస్తున్నాడట. ఈ చిత్రంలో కేతిక శర్మ హీరోయిన్‌గా నటిస్తోంది. సుబ్రహ్మణ్యపురం ఫేమ్‌ సంతోష్‌ జాగర్లపూడి దీనికి దర్శకత్వం వహిస్తుండగా నారాయణ్‌దాస్‌ నారంగ్‌, శరత్‌ మరార్‌, పీ రామ్మోహన్‌రావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Also Read:

Teddy Movie Trailer: ఆకట్టుకుంటున్న హీరో ఆర్య ‘టెడ్డి’ ట్రైలర్… అనుక్షణం ఉత్కంఠభరింతగా..