AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RC 15 Movie: చెర్రీ, శంకర్ మూవీకి లీకుల బెడద..తాజా లుక్‌లో తండ్రిని తలపిస్తున్న తనయుడు..రుద్రవీణ ఫ్లేవర్ అంటూ టాక్

RC 15 Movie: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Mega Power star Ram Charan) హీరోగా డైరెక్టర్ శంకర్(Director Shankar) దర్శకత్వంలో ఆర్ సీ 15 వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న సినిమాకు లీకులు బెడద ఎక్కువైంది..

RC 15 Movie: చెర్రీ, శంకర్ మూవీకి లీకుల బెడద..తాజా లుక్‌లో తండ్రిని తలపిస్తున్న తనయుడు..రుద్రవీణ ఫ్లేవర్ అంటూ టాక్
Rc 15
Surya Kala
| Edited By: Ravi Kiran|

Updated on: Mar 03, 2022 | 1:00 PM

Share

RC 15 Movie: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Mega Power star Ram Charan) హీరోగా డైరెక్టర్ శంకర్(Director Shankar) దర్శకత్వంలో ఆర్ సీ 15 వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న సినిమాకు లీకులు బెడద ఎక్కువైంది. పాన్ ఇండియా మూవీగా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఆంధప్రదేశ్ లోని రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో జరుపుకుంటుంది. ఇక్కడ శంకర్ షూటింగ్ చేసిన మూవీస్ అన్నీ బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. అంతేకాదు రామ్ చరణ్ ..రంగస్థలం సినిమాకూడా భారీ హిట్ ను అందుకుంది..  ఆ సెంటిమెంట్ ను  కొనసాగిస్తూ.. ఇప్పుడు ఆర్ సి 15 సినిమా కూడా షూటింగ్ జరుపుకుందని టాక్ వినిపిస్తోంది. అయితే షూటింగ్ జరుపుకుంటున్న సమయంలో చిత్ర యూనిట్ ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా.. ఎక్కడో ఎదోకచోట సినిమా తాలూకా ఫోటోలు బయటకు వస్తున్నాయి. తాజాగా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న ఫొటోలో రామ్ చరణ్ గోదావరి ఒడ్డున సైకిల్ తొక్కుంటూ వస్తున్నాడు. ఈ ఫోటోలోని రామ్ చరణ్ లుక్ తండ్రి చిరంజీవి అలనాటి లుక్ ని గుర్తు చేస్తుందని అభిమానులు కామెంట్ చేస్తున్నారు.

అంతేకాదు చిరంజీవి క్లాసికల్ హిట్ మూవీ “రుద్రవీణ” మూవీ లుక్ లో చరణ్ కనిపిస్తున్నాడు అంటూ ఫ్యాన్స్ అంటున్నారు.  ఈ సినిమా మొదలు పెట్టక ముందే రామ్ చరణ్ ఈ సినిమాలో ముఖమంత్రిగా కనిపించనున్నాడని టాక్ వినిపించింది. ఇప్పుడు  లీక్ అవుతున్న ఫోటోలు రుద్రవీణ ను గుర్తు తెస్తున్నాయని .. ఈ సినిమా కూడా సాజిక అంశంతో తెరకెక్కుతోందని టాక్ వినిపిస్తోంది.

రామ్ చరణ్ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ సినిమాలో.. కియారా అద్వాని హీరోయిన్ గా నటిస్తోంది. దిల్ రాజు నిర్మిస్తున్నారు. తమన్ మ్యూజిక్ డైరెక్టర్. దక్షిణాది దర్శక దిగ్గజంలో ఒకరైన కె.బాలచందర్ దర్శకత్వంలో 1988లో చిరంజీవి నటించిన “రుద్రవీణ” అతిపెద్ద సంచలనం. నాగేంద్ర బాబు నిర్మించిన ఈ సినిమాలో చిరంజీవి నటన మరో శిఖరాన్ని ప్రేక్షకులకు పరిచయం చేసింది. చిరంజీవి నటనకు అవార్దులతో పాటు.. విమర్శకుల ప్రశంసలను అందుకుంది.

Read Also:

శుక్రదోషం ఉన్నవారు, వ్యాపారం అభివృద్ధి కోసం స్పటిక లింగం పూజించడం ఫలప్రదం..శివరాత్రిన మొదటి పూజ.. ఎందుకంటే