Ravanasura Movie: ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న ‘రావణాసుర’.. స్ట్రీమింగ్ ఎప్పుడు ఎక్కడంటే..

ఎన్నో అంచనాల మధ్య విడుదలై మిశ్రమ స్పందన అందుకున్న చిత్రాలు కూడా ఉన్నాయి.అందులో 'రావణాసుర' ఒకటి. మాస్ మాహారాజా రవితేజ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి సుధీర్ వర్మ దర్శకత్వం వహించారు. క్రైమ్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ మూవీలో రవితేజ పూర్తిగా విలనిజం చూపించారు.

Ravanasura Movie: ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న రావణాసుర.. స్ట్రీమింగ్ ఎప్పుడు ఎక్కడంటే..
Ravanasura

Updated on: Apr 26, 2023 | 12:36 PM

ఓవైపు థియేటర్లలో బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలు రిలీజ్ అవుతూ భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా కంటెంట్ నచ్చితే చాలు ప్రేక్షకులు క్యూ కడుతున్నారు. ఇటీవల విడుదలైన బలగం, దసరా చిత్రాలు బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకోగా.. గత నాలుగు రోజుల క్రితం రిలీజ్ అయిన విరూపాక్ష సినిమా సైతం హిట్టైంది. మొదటి రోజు నుంచి భారీగా కలెక్షన్స్ రాబడుతుంది ఈ మూవీ. అలాగే ఎన్నో అంచనాల మధ్య విడుదలై మిశ్రమ స్పందన అందుకున్న చిత్రాలు కూడా ఉన్నాయి.అందులో ‘రావణాసుర‘ ఒకటి. మాస్ మాహారాజా రవితేజ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి సుధీర్ వర్మ దర్శకత్వం వహించారు. క్రైమ్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ మూవీలో రవితేజ పూర్తిగా విలనిజం చూపించారు.

ఎప్పుడూ మాస్… యాక్షన్ పాత్రలలో మెప్పించే రవితేజ.. ఈ సినిమాలో సరికొత్త వెర్షన్లో కనిపించి ఆకట్టుకున్నారు. అయితే కొన్ని కారణాల వల్ల ఈ సినిమా అంతగా హిట్ కాలేకపోయింది.ఇందులో అను ఇమాన్యుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్షా నగార్కర్, పూజిత పొన్నాడ హీరోయిన్లగు నటించారు. తాజాగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

లేటేస్ట్ సమాచారం ప్రకారం ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని మే 5నుంచి స్ట్రీమింగ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన కూడా రానుందట.ఈ సినిమాకు హర్ష వర్దన్, భీమ్స్ సంగీతం అందించగా.. అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ పై నిర్మించారు. ప్రస్తుతం రవితేజ టైగర్ నాగేశ్వరరావు చిత్రంలో నటిస్తున్నారు. త్వరలోనే ఈ మూవీ అడియన్స్ ముందుకు రానుంది.