AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Raviteja: రీరిలీజ్ అంటే ఆ మాత్రం ‘కిక్’ ఉండాల్సిందే.. రవితేజ హిట్ మూవీ మళ్లీ వచ్చేస్తోంది..

న్నాళ్లుగా టాలీవుడ్ ఇండస్ట్రీలో రీరిలీజ్ ట్రెండ్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే స్టార్ హీరోస్ సినిమాలన్నీ మరోసారి అడియన్స్ ముందుకు వచ్చాయి. ఒకప్పుడు మిక్స్డ్ టాక్ అందుకున్న సినిమాలు.. ప్లాప్ మూవీస్ రీరిలీజ్ అయ్యి ఇప్పుడు భారీ వసూళ్లు రాబడుతున్నాయి. ఈ రీరిలీజ్ ట్రెండ్ మాస్ మాహారాజా హావా లేకపోతే ఎలా ?.. అందుకే ఇప్పుడు రవితేజ కెరీర్ లో వన్ ఆఫ్ ది సూపర్ హిట్ మూవీ మళ్లీ అడియన్స్ ముందుకు రాబోతుంది. అదే 'కిక్'. ప్రస్తుతం థియేటర్లలో ఒకప్పటికీ కల్ట్ సూపర్ హిట్ 'ఓయ్' సినిమా రన్ అవుతుంది.

Raviteja: రీరిలీజ్ అంటే ఆ మాత్రం 'కిక్' ఉండాల్సిందే.. రవితేజ హిట్ మూవీ మళ్లీ వచ్చేస్తోంది..
Kick Movie
Rajitha Chanti
|

Updated on: Feb 19, 2024 | 3:27 PM

Share

మాస్ మాహారాజా రవితేజ టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది యువ నటీనటులకు స్పూర్తి. నటనపై ఆసక్తితో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. ఇప్పటివరకు అనేక హిట్ చిత్రాల్లో నటించి అలరించాడు. ఇటీవలే ఈగల్ మూవీతో మరో సూపర్ హిట్ ఖాతాలో వేసుకున్నారు. డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కించిన ఈ మూవీలో రవితేజ సరికొత్త పాత్రలో కనిపించాడు. ఇందులో అనుపమ పరమేశ్వరన్, కావ్య థాపర్, నవదీప్, అవసరాల శ్రీనివాస్ కీలకపాత్రలు పోషించారు. ఫిబ్రవరి 9న రిలీజ్ అయిన ఈ సినిమా దేశవ్యాప్తంగా భారీ వసూల్లు రాబట్టింది. ఇదిలా ఉంటే.. కొన్నాళ్లుగా టాలీవుడ్ ఇండస్ట్రీలో రీరిలీజ్ ట్రెండ్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే స్టార్ హీరోస్ సినిమాలన్నీ మరోసారి అడియన్స్ ముందుకు వచ్చాయి. ఒకప్పుడు మిక్స్డ్ టాక్ అందుకున్న సినిమాలు.. ప్లాప్ మూవీస్ రీరిలీజ్ అయ్యి ఇప్పుడు భారీ వసూళ్లు రాబడుతున్నాయి. ఈ రీరిలీజ్ ట్రెండ్ మాస్ మాహారాజా హావా లేకపోతే ఎలా ?.. అందుకే ఇప్పుడు రవితేజ కెరీర్ లో వన్ ఆఫ్ ది సూపర్ హిట్ మూవీ మళ్లీ అడియన్స్ ముందుకు రాబోతుంది. అదే ‘కిక్’. ప్రస్తుతం థియేటర్లలో ఒకప్పటికీ కల్ట్ సూపర్ హిట్ ‘ఓయ్’ సినిమా రన్ అవుతుంది. ఇక ఇప్పుడు ప్రేక్షకులకు మళ్లీ కిక్ ఇవ్వబోతున్నాడు రవితేజ.

దాదాపు 15 ఏళ్ల క్రితం విడుదలై బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపిన సినిమా ‘కిక్’. రవితేజ, ఇలియాన, బ్రహ్మానందం ట్రాక్ ఈ సినిమాకే హైలెట్ అయ్యింది. హల్వారాజ్ అంటూ హాస్య బ్రహ్మా చేసిన కామెడీ.. ఇలియానను తన కిక్కుతో ఇరిటేట్ చేసిన మాస్ మాహారాజా.. ఇలా చెప్పుకుంటూ పోతే ఈమూవీలో ప్రేక్షకులకు నచ్చే సీన్స్ ఎక్కువే. కామెడీతో ఎమోషన్ కూడా అదే రేంజ్ లో ఉండిపోయింది. ఈ సూపర్ హిట్ సినిమాను మళ్లీ రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. తాజా సమాచారం ప్రకారం ఈ మూవీని మార్చి 1న రీరిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించగా.. ఇలియాన కథానాయికగా కనిపించింది. ఈ చిత్రానికి థమన్ అందించిన మ్యూజిక్ కూడా సూపర్ హిట్ అయ్యింది.

ఈ సినిమాలో శ్యామ్, దివంగత నటుడు వేణు మాధవ్ కీలకపాత్రలలో కనిపించారు. ఇప్పటికే ఈ మూవీలోని సాంగ్స్ ఏదోక సందర్భంలో వింటూనే ఉంటాం. ఈ సినిమాకు సీక్వెల్ గా వచ్చిన కిక్ 2 మాత్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయ్యింది. ఇందులో రకుల్ ప్రీత్ సింగ్ నటించింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.