Raviteja: ఫ్యామిలీతో జపాన్ వెకేషన్లో రవితేజ.. మాస్ మాహారాజా కూతురిని చూశారా ?..
సినిమాలకు ఏ మాత్రం గ్యాప్ తీసుకోకుండా వెంట వెంటనే ప్రాజెక్ట్స్ పట్టాలెక్కిస్తుంటారు. ఏడాదికి దాదాపు రెండు మూడు సినిమాలను చేస్తుంటారు. ఈ ఏడాది వాల్తేరు వీరయ్య, ధమాకా సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నారు రవితేజ. ఆ తర్వాత ఆయన నటించిన రావణాసుర చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ కమర్షియల్ గా అనుకున్నంత స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ప్రస్తుతం ఆయన టైగర్ నాగేశ్వరరావు చిత్రంలో నటిస్తున్నారు. భారీ అంచనాల మధ్య పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ మూవీ అక్టోబర్ 20న విడుదలకు రెడీ అవుతుంది.ఇదే కాకుండా మరో రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.

ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండానే టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తనకంటూ స్పెషల్ ఫ్యాన్ ఫాలోయింగ్ క్రియేట్ చేసుకున్నారు రవితేజ. తెలుగు సినీ పరిశ్రమలో మాస్ మాహారాజాగా క్రేజ్ అందుకున్న ఈహీరో.. వరుస సినిమాలతో ప్రేక్షకులను పలకరిస్తూనే ఉంటారు. సినిమాలకు ఏ మాత్రం గ్యాప్ తీసుకోకుండా వెంట వెంటనే ప్రాజెక్ట్స్ పట్టాలెక్కిస్తుంటారు. ఏడాదికి దాదాపు రెండు మూడు సినిమాలను చేస్తుంటారు. ఈ ఏడాది వాల్తేరు వీరయ్య, ధమాకా సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నారు రవితేజ. ఆ తర్వాత ఆయన నటించిన రావణాసుర చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ కమర్షియల్ గా అనుకున్నంత స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ప్రస్తుతం ఆయన టైగర్ నాగేశ్వరరావు చిత్రంలో నటిస్తున్నారు. భారీ అంచనాల మధ్య పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ మూవీ అక్టోబర్ 20న విడుదలకు రెడీ అవుతుంది.ఇదే కాకుండా మరో రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.
ఇదిలా ఉంటే.. రవితేజ ఎక్కువగా తన ఫ్యామిలీతో బయట కనిపించరు. ఇక సోషల్ మీడియాలో సైతం తమ ఫ్యామిలీకి సంబంధించిన ఎలాంటి విషయాలను పంచుకోరు. తన ఫ్యామిలీతో వెకేషన్స్, ఈవెంట్స్ అంటూ రవితేజ కనిపించడం చాలా అరుదు. చాలా కాలం తర్వాత మాస్ మహారాజా తన కుటుంబంతో కలిసి జపాన్ వెకేషన్ లో ఉన్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను తన ఇన్ స్టా ఖాతాలో షేర్ చేసుకున్నారు రవితేజ. అందులో టోక్యో వీధుల్లో ఫ్యామిలీతో కలిసి సరదాగా గడుపుతున్నారు. ఆ ఫోటోలో రవితేజ, ఆయన భార్య, కొడుకు, కూతురుతోపాటు మరికొందరు బంధువులు కనిపిస్తున్నారు.
View this post on Instagram
రవితేజ ఎక్కువగా తన ఫ్యామిలికీ సంబంధించిన విషయాలను సోషల్ మీడియాలో షేర్ చేయరు. కానీ ఇప్పుడు షేర్ చేసిన ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి. గతంలో బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరించిన అన్ స్టాపబుల్ షోలో పాల్గొన్న రవితేజ తన ఫ్యామిలీ, కొడుకు, కూతురు గురించి తొలిసారిగా మాట్లాడారు. ఇక అదే వేదికపై రవితేజ కొడుకు వీడియో రివీల్ చేస్తూ మాస్ మాహారాజాకు సర్ ప్రైజ్ ఇచ్చారు బాలయ్య.
View this post on Instagram
ఆ తర్వాత మళ్లీ ఇప్పుడే మాస్ మాహారాజ ఫ్యామిలీ ఫోటోస్ బయటకు వచ్చాయి. అందులో ఆయన కూతురు స్పెషల్ అట్రాక్షన్ అయ్యారు. రవితేజ కూతురు పేరు మోక్షధ భూపతి రాజు. నిజానికి ఆమె సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్ గా ఉండరు. కేవలం రవితేజ ఇన్ స్టా ఖాతాలో మాత్రమే ఆమె ఫోటోస్ ఒకటి కనిపిస్తుంటాయి. ఇక ఇప్పుడు మరోసారి తన తండ్రితోపాటు మోక్షధ ఫోటోస్ బయటకు రావడంతో నెట్టింట వైరలవుతున్నాయి.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




