AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Raviteja: మాస్ మహారాజా బర్త్ డే స్పెషల్.. ధమాకా నుంచి రవితేజ పోస్టర్ రిలీజ్..

మాస్ మహారాజా రవితేజ (Raviteja) ఇప్పుడు ఫుల్ జోష్ మీదున్నారు. క్రాక్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న

Raviteja: మాస్ మహారాజా బర్త్ డే స్పెషల్.. ధమాకా నుంచి రవితేజ పోస్టర్ రిలీజ్..
Raviteja
Rajitha Chanti
|

Updated on: Jan 26, 2022 | 4:29 PM

Share

మాస్ మహారాజా రవితేజ (Raviteja) ఇప్పుడు ఫుల్ జోష్ మీదున్నారు. క్రాక్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న రవితేజ ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఓవైపు ఖిలాడీ (Khiladi).. రామరావు ఆన్ డ్యూటీ (Ramarao On Duty) సినిమాలు చేస్తూనే మరోవైపు కొత్త ప్రాజెక్టులను పట్టాలెక్కిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రముఖ డైరెక్టర్ త్రినాథ రావు నక్కిన దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారు. ఈ చిత్రానికి ధమాకా అనే టైటిల్ ఫిక్స్ చేసిన సంగతి తెలిసిందే. మాస్ మహారాజ రవితేజ, త్రినాథరావు నక్కిన కాంబినేషన్‌లో అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్‌గా ధమాకా (Dhamaka)  చిత్రం రాబోతోంది.

డబుల్ ఇంపాక్ట్ అంటూ ఇంట్రెస్టింగ్ ట్యాగ్ లైన్‌తో ఈ మూవీ రూపొందుతోంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ సినిమాకు నిర్మాతగా టీజీ విశ్వ ప్రసాద్, సహ నిర్మాతగా వివేక్ కూచిబొట్ల వ్యవహరిస్తున్నారు. ఈరోజు రవితేజ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రం నుంచి స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ పోస్టర్‌లో రవితేజ ట్రెండీ వేర్‌లో ఫుల్ఎనర్జీగా కనిపిస్తున్నారు. ఇక ఈ డ్యాన్స్ మూమెంట్ ప్రేక్ష‌కుల‌ను ఆకట్టుకునేలా ఉంది. మొత్తానికి ఈ స్పెష‌ల్ పోస్టర్ కలర్ ఫుల్‌గా ఉంది.

ఈ చిత్రంలో ముఖ్య పాత్రల్లో ఫేమస్ నటీనటులు కనిపించబోతన్నారు. ఇక సాంకేతికంగానూ గొప్ప టెక్నీషియన్లు ఈ ప్రాజెక్ట్‌కి వర్క్ చేస్తున్నారు. ప్రసన్న కుమార్ బెజవాడ ఈ చిత్రానికి కథ, మాటలు అందిస్తున్నారు. భీమ్స్ సిసిరిలియో సంగీతాన్ని అందిస్తుండగా.. కార్తీక్ ఘట్టమనేని కెమెరామెన్‌గా వ్యవహరించనున్నారు. మిగతా నటీనటులు, సాంకేతిక బృందాన్ని చిత్రయూనిట్ త్వరలోనే ప్రకటించనుంది.

Also Read: Viral Photo: అమాయకపు చూపులతో కట్టిపడేస్తున్న ఈ చిన్నారో ఎవరో గుర్తుపట్టండి.. ఫస్ట్ మూవీతోనే కుర్రాళ్ల మతిపోగొట్టింది..

Shilpa Shetty: శిల్పాశెట్టి బహిరంగ ముద్దు వివాదం.. షాకింగ్ తీర్పునిచ్చిన కోర్టు..

Maheshwari: ఆ విషయంలో డైరెక్టర్ నన్ను చీట్ చేశాడు.. ఆసక్తికర విషయాలను చెప్పిన హీరోయిన్..

Actor Sampath Raj: ఆ నటి నా మొదటి భార్య కాదు.. రూమర్స్ పై స్పందించిన నటుడు సంపత్ రాజ్..