రీరిలీజ్.. ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తోన్న పేరు. గత కొన్ని రోజులుగా తెలుగు సినీ పరిశ్రమలో ఈ ట్రెండ్ కొనసాగుతోంది. మొదట్లో స్టార్ హీరోస్ పుట్టిన రోజు సందర్భంగా మాత్రమే వారి సూపర్ హిట్ మూవీస్ మరోసారి అడియన్స్ ముందుకు తీసుకువచ్చారు మేకర్స్. అది కూడా 4కే వెర్షన్లో. ఆ సినిమాలకు మంచి రెస్పాన్స్ రావడమే కాకుండా.. భారీగా కలెక్షన్స్ వచ్చాయి. ఇక ఆతర్వాత ఒకప్పుడు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయినా చిత్రాలను 4కే వెర్షన్ లో రిలీజ్ చేయగా.. నిర్మాతలకు గట్టిగానే లాభాలు వచ్చాయి. దీంతో డైరెక్టర్స్ బర్త్ డేస్.. స్పెషల్ డేస్ ఇలా ప్రతి ప్రత్యేకమైన రోజున స్టార్ హీరోస్ చిత్రాలను మళ్లీ రిలీజ్ చేసే పనిలో పడ్డారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ప్రభాస్, అల్లు అర్జున్, రామ్ చరణ్, ఎన్టీఆర్ చిత్రాలు విడుదలై మంచి వసూళ్లు రాబట్టాయి. ఇక ఇప్పుడు మాస్ మాహారాజా సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోంది. అదే వెంకీ చిత్రం.
మాస్ మాహారాజా రవితేజ, స్నేహ జంటగా నటించిన చిత్రం వెంకీ. డైరెక్టర్ శ్రీను వైట్ల తెరకెక్కించిన ఈ కామెడీ ఎంటర్టైనర్ అప్పట్లో భారీ విజయాన్ని అందుకుంది. ఇందులో కామెడీ సీన్స్ ఇప్పటికీ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంటాయి. ఇక ఈ సినిమాను తిరిగి థియేటర్లలో రిలీజ్ చేయనున్నట్లు కొన్ని రోజుల క్రితం నుంచి నెట్టింట వార్తలు వస్తున్నాయి. అయితే ఈ సూపర్ హిట్ మూవీ రీరిలీజ్ ఎప్పుడెప్పుడా అంటూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్.
ఈ క్రమంలో తాజాగా వెంకీ మూవీ రీరిలీజ్ అప్డేట్ అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేసింది. ఈ సినిమాను ఈ ఏడాది చివరలో అంటే డిసెంబర్ 30న రీరిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. శ్రీమాతా క్రియేషన్స్ బ్యానర్ పై ఈ సినిమాను విడుదల చేయనున్నటాలు. ఈ చిత్రంలో రవితేజ, బ్రహ్మానందం, ఏవీఎస్, వేణుమాధవ్, చిత్రం శ్రీను, శ్రీనివాస్ రెడ్డి, తనికెళల్ భరణి కామెడీ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.
Get ready to Re-ride the Fun Rollercoaster of #Venky & Gang 🤩
Re-Releasing on Dec 30 💥@RaviTeja_offl #Sneha @SreenuVaitla @SrimathaCreati1 pic.twitter.com/Z4fjIaYTQ3
— SMC.official (@SrimathaCreati1) July 14, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.