RaviTeja: రామారావు డ్యూటీకి వచ్చేది అప్పుడే.. మాస్ మహారాజా సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్..
ఈ ఏడాది ప్రారంభంలో 'క్రాక్' వంటి బ్లాక్ బస్టర్ హిట్‌ను సొంతం చేసుకున్నారు మాస్ మహారాజా రవితేజ. అదే జోరుతో వరుస సినిమాలను లైన్‌లో పెట్టాడు. యువ హీరోలకు ధీటుగా కొత్త సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.
ఈ ఏడాది ప్రారంభంలో ‘క్రాక్’ వంటి బ్లాక్ బస్టర్ హిట్‌ను సొంతం చేసుకున్నారు మాస్ మహారాజా రవితేజ. అదే జోరుతో వరుస సినిమాలను లైన్‌లో పెట్టాడు. యువ హీరోలకు ధీటుగా కొత్త సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. రమేశ్ వర్మ డైరెక్షన్‌లో ఆయన నటిస్తోన్న ‘ఖిలాడీ’ ఇప్పటికే చాలాభాగం షూటింగ్ పూర్తి చేసుకుంది. దీంతో పాటు ఆయన నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో ‘ధమాకా’, సుధీర్ వర్మ డైరెక్షన్‌లో ‘రావణాసుర’, కొత్త డైరెక్టర్ వంశీని పరిచయం చేస్తూ ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమాలు చేస్తున్నాడు. ఇక మాస్ మహారాజా హీరోగా మరో కొత్త దర్శకుడు శరత్ మండవ తెరకెక్కిస్తోన్న చిత్రం ‘రామారావు ఆన్ డ్యూటీ’. దివ్యాన్షా కౌశిక్, రజిషా విజయన్ రవితేజతో రొమాన్స్ చేయనున్నారు. వేణు తొట్టెంపూడి ఓ కీలక పాత్రలో మెరవనున్నాడు. యసెల్వీ సినిమాస్, ఆర్.టీ.టీమ్ వర్క్స్ సంయుక్త నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కుతోంది.
44 రోజుల గ్యాప్‌లోనే రెండు సినిమాలు.. కాగా రవితేజ ఈ చిత్రంలో పవర్‌ఫుల్ ప్రభుత్వ అధికారిగా నటించనున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించింది చిత్రబృందం. వచ్చే ఏడాది మార్చి 25 న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు మూవీ మేకర్స్ తెలిపారు. ఈ సందర్భంగా ఒక కొత్త పోస్టర్‌ను విడుదల చేసింది. ఇందులో కర్ర పట్టుకుని విసురుతూ ఆకట్టుకున్నారు రవితేజ. అదేవిధంగా పోలీసులు, గ్రామస్తులు కూడా కర్రలతో కనిపించారు. వీటిని చూస్తుంటే రవితేజ నుంచి మరో మంచి యాక్షన్ ఎంటర్ టైనర్ వస్తుందని భావించవచ్చు. కాగా రవితేజ ‘ఖిలాడీ’ కూడా వచ్చే ఏడాది ఫిబ్రవరి 11న విడుదల కానుంది. దీనికి సరిగ్గా 44 రోజుల గ్యాప్ లోనే ‘రామారావు ఆన్ డ్యూటీ’ విడుదల కానుండడం విశేషం.
#RamaRaoOnDuty from 25th March 2022? pic.twitter.com/H2JMSGoJ4b
— Ravi Teja (@RaviTeja_offl) December 6, 2021
Also read:
RRR Movie : ఆర్ఆర్ఆర్ నుంచి కొమురం భీమ్ పోస్టర్.. అదిరిపోయిన ఎన్టీఆర్ న్యూలుక్..
Sharwanand: అలా మారిన తర్వాత సినిమాలు చేస్తా.. హీరో శర్వానంద్ షాకింగ్ కామెంట్స్..