Sharwanand: అలా మారిన తర్వాత సినిమాలు చేస్తా.. హీరో శర్వానంద్ షాకింగ్ కామెంట్స్..
యంగ్ హీరో నాగశౌర్య ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటేస్ట్ చిత్రం లక్ష్య. స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంతోష్
యంగ్ హీరో నాగశౌర్య ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటేస్ట్ చిత్రం లక్ష్య. స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంతోష్ జాగర్లపూడి దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. సోనాలి నారంగ్ సమర్ఫణలో శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పి, నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ ప్రై. లి. బ్యానర్లపై నారాయణ్ దాస్ కే నారంగ్, పుస్కర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో నాగశౌర్య సరసన కేతిక శర్మ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా డిసెంబర్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో లక్ష్య ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఆదివారం సాయంత్రం ఘనంగా నిర్వహించారు మేకర్స్
ఈ వేడుకకు టాలెంటెడ్ హీరో శర్వానంద్ ముఖ్య అతిథిగా వచ్చారు. ఈ సందర్భంగా.. శర్వానంద్ మాట్లాడుతూ… స్పోర్ట్స్ బేస్డ్ సినిమాలు చేయాలంటే చాలా కష్టం. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన తెలుగు సినిమాలు మజిలీ, జెర్సీ సూపర్ హిట్ అయ్యాయి. ఈ సినిమాలు చేసేటప్పుడు నటుడికి ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ధైర్యం కూడా కావాలి. నాగశౌర్యకు చాలా ధైర్యం ఉంది. తన లక్ష్య సినిమా కోసం చాలా కష్టపడ్డినట్టు తెలుస్తోంది.
ఇప్పుడు ఒకే ఒక జీవితం.. ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమాలు చేస్తున్నాను. వాటి తర్వాత సిక్స్ ప్యాక్ వచ్చిన తర్వాతే సినిమా చేస్తాను. నాగశౌర్య అందరితో నవ్వుతూ జెన్యూన్ గా ఉంటాడు. ఇండస్ట్రీలో నిలబడడం ఎంతో కష్టమో మాకు తెలుసు. బాస్ చిరంజీవి గారు చెప్పినట్లు నాగశౌర్య సూపర్ స్టా్ర్ అవుతాడు. తను బాలీవుడ్ ఇండస్ట్రీకి కూడా చెప్పాలనుకుంటున్నాడు. కేతికకు ఈ సినిమా హిట్ కావాలనుకుంటున్నాను అంటూ చెప్పుకొచ్చారు శర్వానంద్.