Ravi Teja: మాస్ మహారాజాతో మాములుగా ఉండదు మరి.. కాలుకు ఇనుప చువ్వ గుచ్చుకున్నా..

|

Dec 10, 2022 | 7:07 AM

ఇక రవితేజ నటించిన రీసెంట్ మూవీ రామారావు ఆన్ డ్యూటీ సినిమా ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేక పోయింది. ఇక ఇప్పుడు ధమాకా అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు

Ravi Teja: మాస్ మహారాజాతో మాములుగా ఉండదు మరి.. కాలుకు ఇనుప చువ్వ గుచ్చుకున్నా..
Raviteja
Follow us on

మాస్ మహారాజ రవితేజ సినిమా వస్తుందంటే ప్రేక్షకుల్లో ఓ తెలియని ఉత్సహం వస్తుంది. ఇటీవల కాలంలో పెద్దగా హిట్స్ అందుకోలేకపోయినప్పటికీ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు రవితేజ. ఇక రవితేజ నటించిన రీసెంట్ మూవీ రామారావు ఆన్ డ్యూటీ సినిమా ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేక పోయింది. ఇక ఇప్పుడు ధమాకా అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. సినిమా చుపిస్తా మామ, నేను లోకల్, హలొ గురు ప్రేమ కోసమే లాంటి హిట్ సినిమాలకు దర్శకత్వం వహించిన త్రినాద్ రావు ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో మాస్ రాజాకు జోడీగా లేటెస్ట్ సెన్సేషన్ శ్రీలీల నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమానుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. అయితే రీసెంట్ గా ధమాకా నుంచి మాస్ మసాలా సాంగ్ దండకాడియాల్ అనే సాంగ్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఈ పాట యూట్యూబ్ లో ట్రెండింగ్ లో కంటిన్యూ అవుతోంది. అయితే ఈ పాటలో రవితేజ , శ్రీలీలచాలా ఎనర్జీగా డాన్స్ చేసి అదరగొట్టారు. అయితే ఈ పాట సమయంలో రవితేజ కాలికి కట్టు ఉందట. రవితేజ కాలికి గాయం అయినా కూడా లెక్క చేయకుండా కట్టు కట్టుకొని మరి డాన్స్ చేశారట. అంతకు ముందు షూటింగ్ లో ఓ ఇనుప చువ్వ రవితేజ కాలిలో గుచ్చుకుందట. ఆ నొప్పి ఉన్నప్పటికీ రవితేజ ఈ పాటను కంప్లీట్ చేశారని చిత్రయూనిట్ తెలిపింది.

షూటింగ్ కు ఆలస్యం అవ్వకుండదని మొండిగా రవితేజ ఆ సాంగ్ ను కంప్లీట్ చేశారట. ఈ సాంగ్ చూస్తుంటే ఎక్కడ రవితేజ గాయంతో ఇబ్బంది పడుతున్నట్టు అనిపించదు. అంతబాగా మానేజ్ చేశారు. రవితేజ డెడికేషన్ అలా ఉంటుంది మరి. ఇక ఈ నెల 23న సినిమాను విడుదల చేస్తున్నారు. మరి ఈ మూవీ ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

ఇవి కూడా చదవండి