AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ravi Mohan: స్టార్ హీరో విడాకుల వ్యవహారంలో బిగ్ ట్విస్ట్.. ఆమెను చంపేస్తామంటూ బెదిరింపులు

గత కొద్ది రోజుల నుంచి కోలీవుడ్ స్టార్ హీరో రవి మోహన్ (జయం రవి) కుటుంబ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ విషయంలో రవి మోహన్, ఆయన భార్య ఆర్తి, సింగర్ కెనీషా (రవి ప్రియురాలు) మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి.

Ravi Mohan: స్టార్ హీరో విడాకుల వ్యవహారంలో బిగ్ ట్విస్ట్.. ఆమెను చంపేస్తామంటూ బెదిరింపులు
Ravi Mohan Issue
Basha Shek
|

Updated on: May 23, 2025 | 3:59 PM

Share

కోలీవుడ్‌ స్టార్‌ హీరో రవి మోహన్, ఆయన భార్య ఆర్తి విడాకుల వ్యవహారం దాదాపు ఓ కొలిక్కి వచ్చింది. ఇటీవల ఫ్యామిలీ కోర్టుకు హాజరైన రవి మోహన్ తన భార్యతో విడాకులు కావాల్సిందేనని తెగేసి చెప్పాడు. అదే సమయంలో తనకు విడాకుల భరణం ఇప్పించాలని భార్య ఆర్తి కోర్టులో పిటిషన్ వేసింది. దీనిపై తర్వాతి విచారణ జూన్ 12కు వాయిదా పడింది. కాగా రవి మోహన్, ఆర్తి విడిపోవడానికి సింగర్ కెనీషా ఫ్రాన్సెస్ కారణమని కోలీవుడ్ లో ప్రచారం జరుగుతోంది. రవి మోహన్, కెనీషా ప్రేమలో ఉన్నారని, అందుకే హీరో తన భార్యకు విడాకులు ఇస్తున్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో కెనీషాపై నెట్టింట విమర్శల వర్షం కురుస్తోంది. కొందరైతే ఆమెను చంపేస్తామంటూ మెసేజులు కూడా పంపుతున్నారట. ఈ విషయాన్ని కెనీషానే సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. ఈ మేరకు తనను బెదిరిస్తూ పంపిన సందేశాలకు సంబంధించిన స్క్రీన్‌ షాట్‌లను కూడా ఇన్‌స్టా స్టోరీలో పోస్ట్‌ చేసింది.

‘నేను కామెంట్‌ బాక్స్‌ ఆఫ్‌ చేయలేదు. ఏ విషయాన్ని కూడా దాచడం లేదు. ఎక్కడికీ పారిపోవడం లేదు. నన్ను ప్రశ్నించే హక్కు అందరికీ ఉంది. ఏ విషయాన్ని అయినా నా ముఖంపైనే అడగండి. మీ ప్రశ్నలన్నింటికీ సమాధానం ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నాను. నిజానిజాలు చెప్పడం నాకు కూడా సంతోషమే. ఇప్పుడు నా చుట్టూ జరుగుతున్న కొన్ని విషయాలకు నేనే బాధ్యురాలు అని మీకు అనిపిస్తే.. నన్ను కోర్టుకు అప్పగించండి. అంతేకానీ మీ మాటలు, శాపాలతో నన్ను మానసికంగా వేధించకండి. మీ మాటల ల్ల నేను ఎంత ఆవేదన అనుభవిస్తున్నానో మీకు అర్థం కావడం లేదు. కర్మ ఎవరినీ విడిచిపెట్టదు అని దారుణంగా మాట్లాడుతున్నారు. త్వరలో నిజం బయటకు రావాలని నేను కోరుకుంటున్నాను. కానీ అప్పుడు నాలాగా మీరు కూడా బాధపడాలని నేను అనుకోవడం లేదు. మీలో చాలామందికి నిజం తెలియకపోవడం వల్ల నన్ను నిందిస్తూ దారుణంగా తిడుతున్నారు. మీ అందరి భావాలను నేను అర్థం చేసుకున్నా. కానీ త్వరలో నిజం బయటపడాలిని భగవంతుడిని ప్రార్థిస్తున్నా. ఒకవేళ తప్పు చేస్తే.. చట్టం వేసే శిక్షణను అనుభవించడానికి సిద్ధంగా ఉన్నా. కానీ అప్పటి వరకు దయచేసి నన్ను ప్రశాంతంగా బతకనివ్వండి’ అని ఎమోషనల్ పోస్ట్ పెట్టింది కెనీషా. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. కొందరు ఆమెకు సపోర్టుగా నిలుస్తుంటే మరికొందరు మాత్రం సింగర్ ను తిడుతున్నారు.

ఇవి కూడా చదవండి

సింగర్ కెనీషా..

View this post on Instagram

A post shared by KENEESHAA (@keneeshaa1)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.