- Telugu News Photo Gallery Cinema photos Those combinations are going to be repeated again in Tollywood
Repeated Combinations: టాలీవుడ్‌లో ఆ కాంబినేషన్లు మళ్ళీ రిపీట్.. ఫ్యాన్స్‌కి పండగే..
గుర్తుందా? ఆ సినిమా సెట్లో మనం ఏం చేశామో? ఈ లొకేషన్‌కి ఫలానా టైమ్‌లో రీచ్ అయ్యాం. అప్పుడు మనం షేర్ చేసుకున్న డిష్ పేరేంటి? ఇలాంటి మాటలే మళ్లీ మళ్లీ వినిపిస్తున్నాయి టాలీవుడ్ సర్కిల్స్‌లో. ఇంతకీ మాట్లాడుకుంటున్న విషయమేంటో మీకు అర్థమయ్యిందిగా.. యస్.. రిపీటెడ్ కాంబినేషన్లు చాలానే కనిపిస్తున్నాయి మన ఇండస్ట్రీలో.
Updated on: May 23, 2025 | 3:08 PM

స్టాలిన్ కాంబో విశ్వంభరలో రిపీట్ అవుతోంది. షూటింగ్ పార్ట్ పూర్తయినా, పోస్ట్ ప్రొడక్షన్ పనుల నిమిత్తం ఏదో ఒకటి షేర్ చేసుకుంటూనే ఉన్నారు చిరు అండ్ త్రిష. ఈ మూవీ త్వరలోనే ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధం అవుతుంది.

ఇటు సంక్రాంతికి రఫ్ఫాడించేద్దాం అంటూ మెగా అనిల్ సెట్లో జాయిన్ అయ్యారు నయన్. సైరా నరసింహారెడ్డి తర్వాత ఆమె చిరుతో జోడీ కడుతున్న సినిమా ఇది. మధ్యలో గాడ్‌ఫాదర్‌లో మెగాస్టార్‌కి చెల్లెలి రోల్‌లో కనిపించారు నయనతార.

ఇటు కల్కి సీక్వెల్‌లోనూ, సందీప్‌రెడ్డి వంగా స్పిరిట్‌లోనూ ప్రభాస్ పక్కన కనిపించడానికి సిద్ధం అంటున్నారు దీపిక పదుకోన్. అలాగే ప్రభాస్ కల్కి సీక్వెల్‌తో పాటు మరో సినిమాలో దిశా పటానితో కలిసి నటించనున్నారని సమాచారం.

ఇటు శౌర్యాంగపర్వంలో శ్రుతిహాసన్‌తోనూ ఆడిపాడతారు. ఫస్ట్ పార్టుతో పోలిస్తే, శ్రుతి - డార్లింగ్ సీన్స్ సెకండ్ పార్టులో ఇంట్రస్టింగ్‌గా ఉంటాయనే టాక్ నడుస్తోంది. ప్రస్తుతం నీల్ తారక్ చేస్తున్న మూవీ పూర్తికాగానే సలార్ రెండవ భాగం స్టార్ చేస్తారు.

ఇటు రష్మిక మందన్న ఎలాగూ యానిమల్ సీక్వెల్‌లో ఉంటారు. మన వారికి అంతకు మించిన కిక్ ఇచ్చే విషయం సక్సెసఫుల్ జోడీ విజయ్ అండ్ రష్మిక మరోసారి కలిసి కనిపిస్తారన్నదే. సో... కొబ్బరికాయ కొట్టినప్పటి నుంచే పాజిటివ్ వైబ్స్ ఇలా రిపీట్ అవుతున్నాయి టాలీవుడ్‌లో.




