- Telugu News Photo Gallery Cinema photos Is this the reason why Jr NTR and Janhvi Kapoor are trending on social media?
Devara Pair: సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న దేవర జోడీ.. రీజన్ ఇదేనా.?
దేవర జోడీ ఇవాళ యమాగా ట్రెండ్ అవుతున్నారు. ఆల్రెడీ కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందని ఈ జోడీ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు. ఇంతకీ తారక్, జాన్వీ ట్రెండ్ కావడానికి రీజన్ ఏంటి అంటారా? రీజన్ కంబైన్డ్ కాకపోయినా, సోషల్ మీడియాలో మాత్రం వీరిద్దరి పేరు మారుమోగిపోతోంది.
Updated on: May 23, 2025 | 2:33 PM

కౌంట్‌డౌన్ స్టార్ట్ అయింది. మరికొన్ని గంటల్లో మాకు అప్‌డేట్ వచ్చేస్తుందని వెయిట్ చేస్తున్నారు తారక్ ఫ్యాన్స్. అయితే ఆల్రెడీ కొన్ని లీకులు వాళ్లని ఎగ్జయిట్ చేస్తున్నాయి. ఆ లీక్‌కి దేవరతోనూ, దేవర సీక్వెల్‌తోనూ సంబంధం ఉంది. ఇంతకీ ఏంటది?

వార్2లో తారక్‌కి ఫ్లాష్ బ్యాక్ ఉంటుందన్నది ఫ్యాన్స్‌ని ఊరిస్తున్న విషయం. రెగ్యులర్ లుక్‌కీ, ఫ్లాష్ బ్యాక్ లుక్‌కీ చాలా తేడా ఉంటుందట. ఫ్లాష్ బ్యాక్ కాసేపే కనిపించినా అల్ట్రా స్టైలిష్‌గా ఉంటారట తారక్.

షార్ప్ కట్‌తో చూసీ చూడగానే నచ్చే లుక్ అంటూ బాలీవుడ్‌లో టాక్ మొదలైంది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ దేవర సీక్వెల్‌లోనూ తండ్రీ కొడుకులుగా కనిపిస్తారు తారక్.

ఇటు దేవర బ్యూటీ జాన్వీ గురించి కూడా సోషల్ మీడియాలో ట్రెండింగ్ స్టార్ట్ అయింది. కేన్స్ డెబ్యూ అంటూ జాన్వీ మీద ఫోకస్ పెంచింది నార్త్ మీడియా. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ కోసం ఆల్రెడీ బయలుదేరారు జాన్వీ. ఆమె ఎయిర్‌పోర్టు లుక్స్ వైరల్ అవుతున్నాయి.

ఇషాన్ కట్టర్, జాన్వీ నటించిన హోమ్ బౌండ్ మూవీ ప్రీమియర్ కేన్స్ వేదికగా జరగనుంది. ఈ వేడుక కోసమే ట్రావెల్ చేస్తున్నారు జాన్వీ కపూర్. ఓ వైపు సినిమాలు, మరోవైపు స్పెషల్ అకేషన్స్.. ప్రతిదానికీ టైమ్ కేటాయిస్తూ వావ్ అనిపించుకుంటున్నారు జాన్వీ.




