విరోష్ జంటకు ఓవైపు కొండంత ప్రేమ.. మరోవైపు సముద్రమంత పగ
ఎవర్రా మీరంతా ? మా జీవితం మాఇష్టం. మా ప్రేమా మాఇష్టం. మధ్యలో మీరెవరు..అంటూ ట్రోలర్స్‌పై విరుచుకుపడింది జయమ్మ. తన భాషపై..తన లవ్‌పై..తన భర్తపై, తన ప్రేమపై వంకరగా మాట్లాడిన ప్రతి ఒక్కరికీ ఇచ్చిపడేసింది. ఇంతకూ కోట్లమంది ఎంతో అభిమానించే ఆ జంటపై, వదినమ్మా అంటూ ఆప్యాయంగా పిలుచుకునే ఆమెపై, రౌడీబాయ్ అంటూ ముద్దుగా పిలుచుకునే హీరోపై ట్రోలర్స్ ఎందుకింత విరుచుకుపడ్డారు..? తమ పర్సనల్ లైఫ్‌ను టార్గెట్ చేసినవారికి సెలబ్రిటీ కపుల్ ఎలా బదులిచ్చింది ?

వదినమ్మా అంటూ ఆప్యాయంగా పిలిచే అభిమానం ఒకవైపు.. ఇష్టమొచ్చిన రీతిలో ట్రోల్స్ చేస మూక మరోవైపు.. ఈ బరెండింటి మధ్య నేషనల్ క్రష్ రష్మిక జంట క్రష్ అవుతోందా..? అంటే అవుననే అంటోంది ఆ జంట..ఆజంటను విపరీతంగా అభిమానంచే విరోష్ టీమ్… అందుకే ఇష్యూ సైబర్ క్రైమ్ దాకా వెళ్లింది… ఇష్టారీతిన కామెంట్స్ చేసినవారిని శిక్షించాలని ఫిర్యాదు చేసేదాకా రచ్చ చేసింది. ప్రేమిస్తే ఇంత గాఢంగా ప్రేమిస్తారా? ద్వేషిస్తే మాత్రం ఎందుకింతగా వెంటపడతారు? విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంట విషయంలో ఇప్పుడు సోషల్ మీడియాలో జరుగుతున్నదిదే.
ఒక టాక్ షోలో ఇద్దరూ మనసు విప్పి మాట్లాడితే.. కొందరు అభినందించారు.. మరికొందరు ట్రోలింగ్‌కు దిగారు. ప్రేమ ఎలా మొదలైంది? పెళ్లి గురించి ఎవరు ఎవరికి ప్రపోజ్ చేశారు? రష్మిక హిందీ మాట్లాడిన విధానంపైనా వదల్లేదు ట్రోలర్స్. ఇలా ప్రతి విషయాన్నీ పట్టుకుని కామెంట్లతో తమ మూర్ఖత్వాన్ని చూపించారు. కానీ ఈసారి రష్మిక సైలెంట్‌గా ఉండలేదు. తనను ప్రేమించే వాళ్లకే కాదు.. తనను ట్రోల్ చేసేవాళ్లకూ స్వీట్‌గా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చేసారు. విజయ్‌ను పెళ్లి చేసుకోవాలనే నిర్ణయం వెయ్యిసార్లు చెప్పాల్సి వచ్చినా చెబుతానంటూ తన ప్రేమను ఓపెన్‌గా బయటపెట్టారు.
ఒక ఇంటర్వ్యూ.. కొన్ని వ్యక్తిగత విషయాలు.. అంతే.. సోషల్ మీడియాలో ట్రోలర్స్‌కు పని దొరికింది. విజయ్ దేవరకొండ, రష్మిక జంటపై ఇష్టమొచ్చినట్లు కామెంట్లతో రెచ్చిపోయారు. విజయ్-రష్మిక ఇద్దరూ తమ జీవితానికి సంబంధించిన విషయాలను సరదాగా పంచుకుంటే.. వాటిని పట్టుకుని విమర్శలతో విరుచుకుపడ్డారు. దీనిపై రష్మిక అసహనం వ్యక్తం చేస్తూనే, తన ప్రేమ, పెళ్లి, ఎంత బలమైనవో చెప్పుకొచ్చారు. తనను ప్రేమించే వాళ్ల అభిమానం తనకు తెలుసని.. తనను ఇష్టపడని వాళ్ల అభిప్రాయాలూ తెలుసని చెప్పిన ఆమె, కొన్ని కామెంట్లు చదివితే ఆశ్చర్యం వేసిందని, అయినా ఇలాంటి ట్రోల్స్ తమ జంటను కుంగదీయవని చెప్పుకొచ్చారు. అంతేకాదు అప్పుడప్పుడు వాటిని చదివి నవ్వుకుంటానంటూ సెటైర్ వేశారు రష్మిక.
ఇక విజయ్‌తో తన ప్రేమ గురించి రష్మిక చెప్పిన మాటలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. తమ పెళ్లి నిర్ణయం వెనుక సినిమాల్లో చూపించినట్టుగా భారీ ప్రపోజల్ లాంటిదేమీ కాదని, ఇద్దరం సమయం తీసుకుని, అర్థం చేసుకున్నాకే పెళ్లి చేసుకున్నామన్నారు. జీవితంలో ఎదురయ్యే సంతోషాలు, ఒత్తిళ్లు, ఎత్తుపల్లాల గురించి ఆలోచించే అడుగులు వేశామన్నారు. ప్రేమను నిరూపించడానికి మోకాలిపై కూర్చుని రింగ్ తొడగడమే మార్గం కాదని, అది కేవలం ఒక అందమైన సంప్రదాయం మాత్రమేనంది రష్మిక. అయినా తాను పెళ్లి చేసుకున్న వ్యక్తినే ప్రేమించకపోతే, అసలు ఆ పెళ్లికి అర్థమేంటని ట్రోలర్స్‌కు ఇచ్చిపడేసింది రష్మిక. రష్మిక ట్రోలర్స్‌కు తనదైన శైలిలో సమాధానం ఇస్తే.. విజయ్ దేవరకొండ మాత్రం చాలా గట్టిగా ఇచ్చిపడేశాడు. తాను, రష్మిక ఒకవైపు.. ప్రపంచమంతా మరోవైపు, ఎవరో పెట్టిన కామెంట్ల వల్ల తమ బంధంలో బలం ఏమాత్రం తగ్గదన్నాడు విజయ్
రష్మిక మాటల్లో ప్రేమతో పాటు ట్రోలింగ్‌పై కోపం కనిపిస్తే.. విజయ్ రియాక్షన్‌లో భర్తగా ఆమెకు అండగా నిలబడే ధైర్యం కనిపించింది. విజయ్- రష్మిక జంటకు అభిమానులు కోట్లలో ఉన్నారు. అలాగే వారికున్న ట్రోలర్స్ కూడా తక్కువేమీ కాదు. కొండంత అభిమానం ఒక ఎత్తయితే, సముద్రమంత ట్రోల్స్ మరోవైపు. మొన్నీమధ్య ఒక టాక్ షోలో విజయ్, రష్మిక పాల్గొన్న తర్వాత, రెస్సాన్స్ ట్రోల్స్ రూపంలో వచ్చింది. లవ్ ప్రపోజల్, పెళ్లి, రష్మిక హిందీ లాంగ్వేజ్ ఇలా ఒకటేమిటి, అన్నింటిపై ట్రోలర్స్ తెగరెచ్చిపోయారు. అందుకే సైలెంట్‌గా ఉంటే ఇంకా రెచ్చిపోతారని, అలాంటి చాన్స్ ఇవ్వకూడదని భావించిన రష్మిక-విజయ్ జంట ఇలా స్ట్రాంగ్‌గా బదులిచ్చింది.
