Rashmika Mandanna: అమ్మ ఆశీస్సులతో.. కొత్త బిజినెస్‌ స్టార్ట్ చేసిన రష్మిక.. వీడియో వైరల్

సినిమా రంగంలో స్టార్ హీరోయిన్ గా ఎనలేని క్రేజ్ సొంతం చేసుకుంది రష్మిక మందన్న. నేషనల్ క్రష్ గా దేశ వ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకుంది. నేమ్, ఫేమ్ తో పాటు భారీగానే ఆస్తులు సంపాదించుకుంది. ఈ క్రమంలో చాలా మంది స్టార్స్ లాగే రష్మిక కూడా కొత్త వ్యాపారాన్ని ప్రారంభించింది.

Rashmika Mandanna: అమ్మ ఆశీస్సులతో.. కొత్త బిజినెస్‌ స్టార్ట్ చేసిన రష్మిక.. వీడియో వైరల్
Rashmika Mandanna

Updated on: Jul 20, 2025 | 3:34 PM

ప్రస్తుతం రష్మిక మందన్నా క్రేజ్, డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. యానిమల్, పుష్ప 2, చావా, కుబేర తదితర సినిమాలతో రష్మిక క్రేజ్ నెక్ట్స్ లెవెల్ కు వెళ్లిపోయింది. స్టార్ హీరోలకు రష్మిక మందన్న ఒక లక్కీ హీరోయిన్ గా మారిపోయింది. అందుకే ఆమె తో సినిమాలు తీసేందుకు దర్శక నిర్మాతలు క్యూ లో రెడీగా ఉన్నారు. ప్రస్తుతం రష్మిక చేతిలో చాలా సినిమా ఆఫర్లు ఉన్నాయి. వీటి షూటింగులతోనే బిజి బిజీగా గడుపుతోందీ అందాల తార. అయితే ఇంతలోనే ఆమె బిజినెస్ రంగంలోకి అడుగు పెట్టింది. ఇందులో మొదటి అడుగ వేసే ముందు తన తల్లి ఆశీస్సులు తీసుకుంది. రష్మిక మందన్న వయసు ఇప్పుడు 29 సంవత్సరాలు. కన్నడ సినిమా నుంచి ప్రారంభమైన ఆమె సినీ ప్రయాణం ఇప్పుడు బాలీవుడ్ దాకా వెళ్లింది. రష్మిక మందన్న 2016 లో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది. ఆమె మొదటి సినిమా ‘కిరిక్ పార్టీ’ సూపర్ హిట్ అయింది. ఆ తర్వాత టాలీవుడ్ ,కోలీవుడ్, బాలీవుడ్ అంటూ గత పదేళ్లలో టాప్ హీరోయిన్ గా ఎదిగిపోయింది. రష్మిక మందన్న సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కొన్ని సంవత్సరాలలోనే చాలా డబ్బు సంపాదించింది. నివేదికల ప్రకారం, ఆమె మొత్తం ఆస్తులు రూ. 60 కోట్లకు పైగా ఉన్నాయని సమాచారం. ఈ క్రమంలోనే ఆమె వ్యాపారంలో పెట్టుబడి పెట్టాలని నిర్ణయించుకుంది.

బిజినెస్ రంగంలోకి అడుగుపెడుతున్న విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది రష్మిక. ‘ఈ రోజు నేను చాలా ముఖ్యమైన షూట్ కి వెళ్తున్నాను. మీరు చెప్పిన వ్యాపారాన్ని నేను ప్రారంభిస్తాను’ అని రష్మిక తన తల్లి సుమన్ మందన్నకు వీడియో కాల్ ద్వారా తెలియజేసింది. సుమన్ కూడా తన కుమార్తె కు శుభాకాంక్షలు తెలిపింది. అయితే రష్మిక ఏ బిజినెస్ స్టార్ట్ చేయనుందో మాత్రం వెల్లడించలేదు.

ఇవి కూడా చదవండి

రష్మిక షేర్ చేసిన వీడియో..

చాలా మంది స్టార్ హీరోయిన్ల మాదిరిగానే రష్మిక మందన్న కూడా తన సొంత ఫ్యాషన్ బ్రాండ్‌ను ప్రారంభిస్తుందని అభిమానులు ఊహిస్తున్నారు. దీని గురించి అధికారిక సమాచారం త్వరలో వెలువడే అవకాశం ఉంది. మొత్తంమీద రష్మిక మందన్న బిజినెస్ లో కూడా సక్సెస్ అవ్వాలంటూ అభిమానులు, నెటిజన్లు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

రష్మిక కొత్త సాంగ్ చూశారా?

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.