ఈ మధ్య కాలంలో విడుదలవుతోన్న సినిమాల్లో హీరోయిన్స్ కు ఎక్కువ ప్రాధాన్యత ఉండటం లేదు అనే మాటలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఎంతపెద్ద స్టార్ హీరో సినిమా అయినా హీరోయిన్స్ కేవలం రెండు మూడు సీస్ కు, పాటలకు మాత్రమే పరిమితం అవుతున్నారు. బడా హీరోల సినిమా అంటే ఆ హీరోనే చూస్తారు ప్రేక్షకులు.. దర్శకులు కూడా ఆ స్టార్ హీరోనే దృష్టిలో పెట్టుకొని సినిమా తీస్తుంటారు. హీరోయిన్ ఉందంటే ఉంది అంతే .. అలా స్టోరీ రాసుకుంటూ ఉంటారు కొందరు డైరెక్టర్స్. ఇదే పరిస్థితి ఇటీవల ఓ సినిమాలో కూడా జరిగింది. హీరోయిన్ కు పెద్దగా పాత్ర లేకపోవడంతో ఆమె అభిమానులు కాస్త నిరాశపడరు. మా హీరోయిన్ ను ఎక్కువ సేపు చూపించలేదు అని ఫీల్ అయ్యారట.. ఇంతకు ఆ హీరోయిన్ ఎవరో తెలుసా.. ఆమె రష్మిక మందన్న.
ఇటీవల విడుదలైన సినిమాల్లో దళపతి విజయ్ వారసుడు ఒకటి. టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడి పల్లి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మంచి టాక్ ను సొంతం చేసుకుంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా తెలుగు, తమిళ్ భాషల్లో రిలీజ్ అయ్యింది.
తమిళ్ లో హిట్ టాక్ వచ్చినా తెలుగులో మాత్రం మిక్స్డ్ టాక్ వచ్చింది. ఇప్పుడు కలెక్షన్స్ బాగానే రాబడుతోంది. అయితే ఈ సినిమాలో రష్మిక పాత్ర చాలా తక్కువ సమయం ఉంటుంది . కేవలం రెండు మూడు సన్నివేశాలకే పరిమితం చేశారు. అలాగే రెండు పాటల్లో కనిపిస్తుంది అంతే.. తాజాగా దీని పై రష్మిక స్పందించింది. రష్మిక నటించిన మిషన్ మజ్ను సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రష్మిక విజయ్ సినిమా గురించి మాట్లాడింది. దళపతి విజయ్ అంటే తనకు చాలా ఇష్టమని.. ఈ సినిమాలో నటించడమే అదృష్టంగా భావిస్తున్నా అని తెలిపింది. వారసుడు సినిమాలో నేను చేసింది ఏమీ లేదు.. అది నాకు కూడా తెలుసు. కానీ విజయ్ సార్ తో కలిసి నటించా.. ఆయన దగ్గర చాలా నేర్చుకున్నా.. నేను వారసుడు సినిమా చేసిందని చాలా హ్యాపీగాఫీల్ అవుతున్నా అని చెప్పుకొచ్చింది.