Hari Hara Veera Mallu: పవర్ స్టార్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించే న్యూస్.. హరిహర వీరమల్లు టీజర్ వచ్చేది అప్పుడే
క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా పిరియాడికల్ డ్రామాగా రూపొందుతోంది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ బందిపోటుగా నటిస్తున్నాడని తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమానుంచి విడుదలైన పోస్టర్లు, గ్లిమ్ప్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా కోసం అయన అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. పవన్ ఒక వైపు రాజకీయాలతో బిజీగా ఉంటూనే మరో వైపు సినిమాల్లోనూ రాణిస్తున్నారు. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా పిరియాడికల్ డ్రామాగా రూపొందుతోంది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ బందిపోటుగా నటిస్తున్నాడని తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమానుంచి విడుదలైన పోస్టర్లు, గ్లిమ్ప్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. దాంతో ఈ సినిమా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఈ సినిమాలో పవన్ సరసన హాట్ బ్యూటీ నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే బాలీవుడ్ స్టార్స్ కూడా ఈ సినిమాలో కనిపించనున్నారు. ఈ సినిమా ఎప్పుడో ప్రారంభం అయ్యింది కానీ కరోనా కారణంగా షూటింగ్ లెట్ అవుతూ వచ్చింది. ఆ తర్వాత పవన్ రాజకీయాల్లో బిజీగా ఉండటం కూడా ఈ సినిమా ఆలస్యానికి కారణం. ఇక ఇప్పుడు పవన్ ఈ సినిమాను వీలైంత స్పీడ్ గా కంప్లీట్ చేయాలని చూస్తున్నారు.
తాజాగా ఈ సినిమా టీజర్ కు సంబంధించిన అప్డేట్ ను ఇచ్చారు మూవీటీమ్ . ఈ నెల 26వ తేదీన హరిహర వీరమల్లు టీజర్ రిలీజ్ కానుందని తెలుస్తోంది . గతంలో వచ్చిన టైటిల్ టీజర్ కు విపరీతమైన రెస్పాన్స్ వచ్చిన విషయం తెలిసిందే.
టీజర్ రిలీజ్ డేట్ ను నిర్మాత ఏఎం రత్నం కన్ఫామ్ చేయడంతో హరిహర వీరమల్లు టీజర్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. త్వరలోనే మూవీ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేయనున్నారు. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతోన్న ఈ సినిమా పవన్ కెరీర్ లో అతంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది. ఈ సినిమా తర్వాత వరుస సినిమాలను లైనప్ చేశారు పవర్ స్టార్. ఈ సినిమా తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమా చేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలవ్వనుంది. అలాగే సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారట.