మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ భోళాశంకర్. ఇటీవలే వాల్తేరు వీరయ్య సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నారు చిరు. బాబీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో చిరంజీవి మాస్ మసాలా పాత్రలో నటించి మెప్పించారు. చిరుతో పాటు మాస్ రాజా రవితేజ కూడా నటించి ఆకట్టుకున్నారు. ఇక ఇప్పుడు భోళాశంక మూవీ షూటింగ్ లో జాయిన్ అయ్యారు మెగాస్టార్. ఈ సినిమాకు మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్నారు. తమిళ్ లో సూపర్ హిట్ అయినా వేదాళం మూవీకి రీమేక్ గా ఈ సినిమా వస్తోంది. అలాగే ఈ సినిమాలో అందాల భామ కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. అయితే ఈ సినిమా ముందుగా అనుకున్న తేదీకి విడుదల కాకపోవచ్చు అని టాక్ వినిపిస్తోంది. 2023 ఏప్రిల్ 14న రిలీజ్ చేయబోతున్నట్లు ఇదివరకు అనౌన్స్ చేశారు.
అయితే ఇప్పుడు భోళాశంకర్ సినిమాను మే 12న విడుదల చేయాలనీ నిర్ణయించినట్టు తెలుస్తోంది. అయితే మెగాస్టార్ సినిమా రిలీజ్ డేట్ మార్చుకోవడానికి కారణం అక్కినేని యంగ్ హీరో అని అంటున్నారు. అఖిల్ నటిస్తున్న ఏజెంట్ సినిమాను అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. అలాగే బోళాశంకర్ సినిమాను కూడా ఆయనే నిర్మిస్తున్నారు.
అయితే రెండు సినిమాలు ఒకేసారి రిలీజ్ చేస్తే బిజినెస్ విషయం లో క్లాష్ వచ్చే అవకాశం ఉందని.. మెగాస్టార్ సినిమాను వాయిదా వేశారని తెలుస్తోంది. అఖిల్ సినిమా ఇప్పటికే వాయిదా పడుతూ వస్తోంది. ఈ సారి ఎట్టి పరిస్థితిలో సినిమాను రిలీజ్ చేయాల్సిందే అని నిర్ణయించుకున్నారట. ఏజెంట్ సినిమా ఏప్రిల్ మొదటి వారంలో రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. దాంతో మెగాస్టార్ సినిమా మే కి షిఫ్ట్ అయ్యిందని ఫిలిం సర్కిల్స్ లో టాక్.