AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ashish Vidyarthi: సుహాస్‌కు ఆ స్టార్ హీరోకు చాలా సిమిలారిటీస్ ఉన్నాయి.. ఆశిష్ విద్యార్థి ఆసక్తికర కామెంట్స్

ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ గా ఈ సినిమా రైటర్ పద్మభూషణ్‌.

Ashish Vidyarthi: సుహాస్‌కు ఆ స్టార్ హీరోకు చాలా సిమిలారిటీస్ ఉన్నాయి.. ఆశిష్ విద్యార్థి ఆసక్తికర కామెంట్స్
Ashish Vidyarthi
Rajeev Rayala
|

Updated on: Jan 22, 2023 | 9:29 AM

Share

ట్యాలెంటెడ్ యాక్టర్ సుహాస్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా గడిపేస్తున్నాడు. ఒక వైపు హీరోగా సినిమాలు చేస్తూనే మరోవైపు కొన్ని సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నాడు. ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ గా ఈ సినిమా రైటర్ పద్మభూషణ్‌. నూతన దర్శకుడు షణ్ముఖ ప్రశాంత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో టీనా శిల్పరాజ్ కథానాయిక. ఛాయ్ బిస్కెట్ ఫిల్మ్స్, లహరి ఫిల్మ్స్ బ్యానర్స్ పై అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర, చంద్రు మనోహర్ నిర్మించిన ఈ చిత్రాన్ని జి. మనోహర్ సమర్పిస్తున్నారు. రైటర్ పద్మభూషణ్‌ ఫిబ్రవరి 3న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానున్న నేపథ్యంలో ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించిన ప్రముఖ నటుడు ఆశిష్ విద్యార్ధి విలేఖరుల మీడియాతో చిత్ర విశేషాలని పంచుకున్నారు.

ఆశిష్ విద్యార్ధి మాట్లాడుతూ.. మనం ఎక్కడో దూరంగా ఆలోచించి మన దగ్గరే వుండే సింపుల్ గా వుండే విషయాలని సెలబ్రేట్ చేసుకోవడం మర్చిపోతాం. ఛాయ్ బిస్కెట్ ప్రయాణం కూడా ఇలా సింపుల్ గా గానే మొదలైయింది. ఈ సినిమాలో పనిచేసిన వారంతా ముందు యుట్యూబ్ లో వీడియోలు చేశారు. అక్కడే నేర్చుకున్నారు. అవకాశాలు ఇచ్చి, నేర్పించేవారు వారంటే నాకు చాలా ఇష్టం. ఈ సినిమాలో పని చేయడం చాలా గర్వంగా వుంది. మంచి హ్యుమర్ వున్న ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ఇది. ఫిబ్రవరి3 కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను అన్నారు.

రైటర్ పద్మభూషణ్‌ లో ఒక మధ్యతరగతి తండ్రిగా కనిపిస్తా. ప్రతి తండ్రిలానే తన కొడుకు ఎదో సాధిస్తాడనే ఆశ పడే తండ్రి పాత్ర. తనకి ఒక ఫిక్స్ లైఫ్ స్టయిల్ వుంటుంది. ప్రతి రూపాయిని లెక్కపెట్టుకునే తండ్రి. అయితే తన జీవితంలో ఎదో డిఫరెంట్ గా జరుగుతుంది. చివర్లో ఒక అద్భుతమైన ట్విస్ట్ వుంటుంది. సినిమా చూసిన వారు రివ్యూ ఇవ్వండి కానీ దయచేసి ఆ ట్విస్ట్ ని మాత్రం రివిల్ చేయొద్దు. చాలా మంచి హ్యుమర్, ఎమోషన్ వుంటుంది. చాలా నిజాయితీగా తీసిన చిత్రమిది.

నేను ఎప్పుడూ పెద్ద సినిమా, చిన్న సినిమ అని చూడను. వచ్చిన పాత్రని, నచ్చిన పాత్రని చేసుకుంటూ వెళ్ళడమే తెలుసు. నా వరకూ తోటి నటులతో యాక్ట్ చేస్తున్నపుడు నా పాత్రని ఎంత వరకూ న్యాయం చేస్తున్నాననె దానిపైనే ద్రుష్టి వుంటుంది తప్పితే చిన్నా పెద్ద ఆలోచన వుండదు. సుహాస్ చాలా సింపుల్. చాలా సహజంగా ఉంటాడు. తనకి మంచి భవిష్యత్ వుంటుంది. నాని, సుహాస్ లో చాలా సిమిలారిటీస్ కనిపించాయి అని చెప్పుకొచ్చారు.

Follow Us
అంత పెద్ద హీరోయిన్.. ఆ ఒక్క పనితో నన్ను పట్టుకొని ఏడ్చేసింది..
అంత పెద్ద హీరోయిన్.. ఆ ఒక్క పనితో నన్ను పట్టుకొని ఏడ్చేసింది..
భర్త పాదాలకు పూజలు చేసిన టాలీవుడ్ హీరోయిన్.. ఎందుకో తెలుసా?
భర్త పాదాలకు పూజలు చేసిన టాలీవుడ్ హీరోయిన్.. ఎందుకో తెలుసా?
బస్సును ఢీకొట్టిన బండరాయి భయానక దృశ్యం..!
బస్సును ఢీకొట్టిన బండరాయి భయానక దృశ్యం..!
ఖరీదైన ఫేస్ వాష్‌లకు గుడ్‌బై చెప్పేయండి.. మెరిసే చర్మానికి ఇలాంటి
ఖరీదైన ఫేస్ వాష్‌లకు గుడ్‌బై చెప్పేయండి.. మెరిసే చర్మానికి ఇలాంటి
పెరగనున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలు.. నిరుపేదల కోసం సెస్‌ పెంపు..
పెరగనున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలు.. నిరుపేదల కోసం సెస్‌ పెంపు..
నెలకోసారి మీ బాడీకి ఇది ఇచ్చి చూడండి.. ఫలితాన్ని మీరే నమ్మరు..
నెలకోసారి మీ బాడీకి ఇది ఇచ్చి చూడండి.. ఫలితాన్ని మీరే నమ్మరు..
నీట్ ఉచిత లాంగ్‌టర్మ్ కోచింగ్‌కు ఇలా అప్లై చేసుకోండి..
నీట్ ఉచిత లాంగ్‌టర్మ్ కోచింగ్‌కు ఇలా అప్లై చేసుకోండి..
కామాంధుడికి కఠినశిక్ష విధించిన కోర్టు!
కామాంధుడికి కఠినశిక్ష విధించిన కోర్టు!
పులిహోర పేరు వెనుక ఇంత చరిత్ర ఉందా? ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలగలిసిన
పులిహోర పేరు వెనుక ఇంత చరిత్ర ఉందా? ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలగలిసిన
ఈ యంగ్ స్పిన్నర్‌ని చూస్తే లంక బ్యాటర్లు వణకాల్సిందే
ఈ యంగ్ స్పిన్నర్‌ని చూస్తే లంక బ్యాటర్లు వణకాల్సిందే