Rashmika Mandanna: ఆ ఒక్క మాట అన్నందుకే రష్మిక మనసును అంతలా బాధపెట్టారా ?.. ఎమోషనల్ పోస్ట్ వెనక కారణమదే ?..

|

Nov 11, 2022 | 8:03 AM

ఇప్పుడు తనపై వస్తున్న నెగిటివ్ కామెంట్స్ పై అసహనం వ్యక్తం చేసింది. అయితే ఇటీవల చెప్పిన ఆ ఒక్కమాటకే రష్మికను ట్రోల్ చేసినట్లుగా తెలుస్తోంది.

Rashmika Mandanna: ఆ ఒక్క మాట అన్నందుకే రష్మిక మనసును అంతలా బాధపెట్టారా ?.. ఎమోషనల్ పోస్ట్ వెనక కారణమదే ?..
Rashmika Mandanna
Follow us on

పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్‏ గా గుర్తింపు తెచ్చుకుంది రష్మిక మందన్న. తెలుగు.. తమిళం.. హిందీలో వరుస చిత్రాలతో బిజీ షెడ్యూల్ గడిపేస్తున్న ఈ నేషనల్ క్రష్.. ఇటీవల తన ఇన్ స్టాలో ఎమోషనల్ పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. తన గురించి సోషల్ మిడీయాలో వస్తున్న రూమర్స్ పై ఎప్పుడూ స్పందించని రష్మిక.. ఈసారి తన మనసులోని బాధను బయటపెట్టింది. ట్రోలింగ్స్.. నెగిటివిటి తన హృదయాన్ని ముక్కలు చేశాయని.. ప్రేక్షకులను అలరించేందుకు తాను ఎంతగానో కష్టపడుతున్నప్పటికీ.. ఎందుకు అంత ద్వేషం చూపిస్తున్నారంటూ భావోద్వేగ పోస్ట్ చేసింది. పలు ఇంటర్వ్యూలలో తాను మాట్లాడిన మాటలను పూర్తి వ్యతిరేకంగా మార్చేసి…తనను దారుణంగా ట్రోల్ చేస్తున్నారని.. అవి తనను మానసికంగా బాధిస్తున్నాయంటూ చెప్పుకొచ్చింది. అయితే రష్మిక గురించి ఇటీవల కాలంలో అనేక్ రూమర్స్ చక్కర్లు కొట్టాయి. టాలీవుడ్ రౌడీ విజయ్ తో రష్మిక ప్రేమలో ఉన్నారంటూ వార్తలు వినిపించాయి. ఆసమయంలో స్పందించని రష్మిక.. ఇప్పుడు తనపై వస్తున్న నెగిటివ్ కామెంట్స్ పై అసహనం వ్యక్తం చేసింది. అయితే ఇటీవల చెప్పిన ఆ ఒక్కమాటకే రష్మికను ట్రోల్ చేసినట్లుగా తెలుస్తోంది.

కన్నడ నటుడు రిషబ్ శెట్టి రూపొందించిన అద్భుతం కాంతార. ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ సినిమాపై అటు ప్రేక్షకులే కాదు.. ఇటు సినీ విశ్లేషకులు సైతం ప్రశంసలు కురిపించారు. రిషబ్ శెట్టి నటన… స్క్రీన్ ప్లే సూపర్ అంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఇటీవల ఓ విమానాశ్రయంలో కనిపించిన రష్మికను విలేకర్లు.. కాంతార సినిమా గురించి అడిగారు. ఈ క్రమంలో ఆమె ఇప్పటివరకు తాను కాంతార చిత్రాన్ని చూడలేదని.. త్వరలోనే చూస్తాను అంటూ చెప్పుకొచ్చింది. రష్మిక కామెంట్స్ కు సంబంధించిన సోషల్ మీడియాలో వైరల్ కాగా.. ఆమె తీరుపై కర్ణాటక ప్రజలు అసహనం వ్యక్తం చేశారు.

ఇవి కూడా చదవండి

కన్నడ ఇండస్ట్రీలో కెరీర్ ప్రారంభించిన రష్మిక.. ఇప్పుడు మూలాలను మర్చిపోయిందని.. ప్రపంచమే మెచ్చిన కాంతార సినిమాను ఆమె ఇంకా చూడకపోవడం ఏంటీ ? అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో రష్మిక పై నెట్టింట దారుణంగా ట్రోలింగ్స్ నడిచాయి. ఈ క్రమంలోనే తనపై వస్తున్న నెగిటవ్ కామెంట్స్ పై స్పందిస్తూ ఎమోషనల్ పోస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. 2016లో కిరిక్ పార్టీ సినిమాతో సినీరంగ ప్రవేశం చేసింది రష్మిక. ఆ తర్వాత తెలుగు, తమిళం, హిందీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. రష్మికను ముద్దుగా నేషనల్ క్రష్ అని పిలుచుకుంటారు అభిమానులు. ప్రస్తుతం ఆమె తెలుగులో పుష్ప 2 సినిమా చేస్తుంది.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.