
స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతుంది. నేషనల్ క్రష్ రష్మిక మందన్న క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ.. కొన్నాళ్లుగా వరుస హిట్లతో దూసుకుపోతుంది. ఇటీవలే యానిమల్, పుష్ప 2, ఛావా సినిమాలతో భారీ విజయాన్ని అందుకుంది. ఇక ఇప్పుడు కుబేర సినిమాతో మరోసారి నటిగా ప్రశంసలు అందుకుంది. ఇటీవలే బాలీవుడ్ లో థామ అనే సినిమా చేసింది. ఈ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది. అలాగే త్వరలో గర్ల్ ఫ్రెండ్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకురానుంది. ప్రస్తుతం రష్మిక చేతినిండా సినిమాలతో బిజీగా ఉంది. అలాగే ఈ చిన్నది ఇప్పుడు బడా హీరోల సినిమాల్లోనూ నటిస్తుంది. తెలుగు, తమిళ్ సినిమాలతో పాటు హిందీలోనూ సత్తా చాటుతుంది.
ప్రస్తుతం రష్మిక ది గర్ల్ ఫ్రెండ్ సినిమా ప్రమోషన్స్‌లో బిజీ బిజీగా గడుపుతుంది. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో వస్తున్న ‘ది గర్ల్‌ఫ్రెండ్’ సినిమాలో రష్మిక పవర్ ఫుల్ పాత్రలో కనిపించనుంది. ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం రష్మిక అభిమానులు ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. నవంబర్ 7న థియేటర్లలో విడుదల కానుంది. సోషల్ మీడియాలో తన అభిమానులతో చిట్‌చాట్ చేసింది.
ఈ చిట్ చాట్‌లో అభిమానులు అడిగిన ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలు ఇచ్చింది. ఒక నెటిజన్ “మీరు ప్రభాస్ తో ఎప్పుడు నటిస్తారు?” అని అడగగా రష్మిక చెప్పిన సమాధానం ఇప్పుడు వైరల్ గా మారింది. నాకు కూడా ప్రభాస్‌తో నటించాలని ఆశ ఉంది. ఆయన చాలా మంచి నటుడు, మంచి మనిషి. తనతో పనిచేసే అవకాశం దొరికితే నా కెరీర్ వేరే లెవెల్‌లోకి వెళ్తుందని నమ్ముతున్నా.. ఈ కామెంట్ ప్రభాస్ చూస్తారనే ఆశిస్తున్నా” అంటూ చెప్పుకొచ్చింది. దాంతో ప్రభాస్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇది మన హీరో రేంజ్ అంటూ ప్రభాస్ అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.
మరిన్ని సినిమా కథనాల కోసం క్లిక్ చేయండి